• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Attention Needed THAT ONE WOMEN WHO INSPIRED/MOTIVATED YOU [ Content Writing ] Category [Telugu}

Content Writing Telugu Poll

  • Anonymous 7

    Votes: 12 85.7%
  • Anonymous 10

    Votes: 2 14.3%

  • Total voters
    14
  • Poll closed .

Hunkkk

Invisible Glitter
Chat Pro User
Poll rules:

  • Self vote not allowed
  • It's an audience poll so PPL will decide the Winner.
  • Don't reveal to ur frndz about ur submissions.
  • The poll ends automatically after 24 hrs
 
Post 7: (Telugu)
ఆమె!

ఆశుధారా ప్రజ్వలిత స్వయంప్రకాసిత తార. నిరంతర చలనంతోమరువలేని ముద్రలువేస్తూ పరపరాగ అనురాగ విరాగాల్నీ, సోయగాల్నీ, బహిరంతర స్వేచ్చా ప్రవాహాల్నీ ఆనకట్టలు కడుతూనే- "ఆత్మస్తుతి- పరనింద"ల వాదనల్లోకీ, నిష్క్రియా పరత్వానికీఅంతేరకమైన భావదాస్యానికి లోనవ్వకుండా నన్ను పట్టి ఆపినఆంకుశం.

రేయ్! చదువును దువ్వరా అంటే జుట్టుని దువ్వుతావేమిరావెదవాయ్ అంటూ మెత్తగా చివాట్లు పెట్టినా- భాషంటేయజ్ఞోపవీతాల సొత్తు కాదురా అబ్బీ, నువ్వలా శూన్యంలోకిచూడకురా నన్ను భయపెట్టకురా అని డిప్ప మీద ఒక్కటేసిపదబంధవిన్యాసాల్ని తునాతునకలు చేసి నా చేతిలొ పెట్టింది.

కేవలం తరగతి గదికి సంభందించిన విద్యకే కట్టుబడకుండా, ఎన్నెన్నో నేర్పింది. తెలుగు సాహిత్యాన్నీ, సాహిత్యపు ఆటుపోట్లనీ, "నీలిమేఘాల" స్త్రీ వాదాన్ని పరిచయం చేసింది. మాక్జిం గోర్కీ"డాలరు పిశాచం" నుండి రావిశాస్త్రి "గోవులొస్తున్నాయ్ జాగ్రత్త" వరకు, ప్రేంచంద్ "రంగభూమి" నుండి ముళ్ళపూడి "మిధునం" వర కూ అన్నింటినీ తవ్వి తీసి నా ముందు పోసింది.

సిద్దాంత రాద్దాంతాలు చెయ్యకు గానీ, రుధిరాక్షర రక్తాశృవుల్నిగుర్తుపట్టి దాచిపెట్టుకో అని హితబోధ చేసింది. "మత్తేభాల" మత్తగజాల కూసాలు కదిల్చి, గురులఘువుల వ్యాకరణాన్నిఅర్ధమయేట్టు చెప్పింది. ఎల్లలు లేని సమాజాన్ని ఆమె కళ్ళతోకాకుండా దివిటీపట్టి నాకు అర్ధమయేట్టు చూపించింది .నాకు తిండిలేని రోజుల్లో ఆమె అక్షయపాత్ర- నా విద్యా ప్రాదాత - My Aes Sedai!

( Deicated to all the women who are in education field)

Credits to: anonymous 7 @EkaLustYa
 
Last edited:
Post 10: (Telugu)
మహిళా భౌగోళిక శరీరంలో దాగిన మనసు పొరల్ని తొలగించి
తీరిగ్గా ఆమెనడక్కుండా అంతరంగ చరిత్రని చదివారా ఎవరైనా?

మాగాడికి భిన్నమైన మమకారమే ఆమె కులం అదే ఏకాంతం
శతాబ్దాలుగా శ్రమించి దాచిన స్థిరాస్తులెన్నో చెప్పగలరా ఎవరైనా?

తన కాల్పనికతలో తనని తాను నిర్మించుకుని బహిష్కరించబడి
కలలో కూడా ఉరకలేసి జీవించే ఆమెని వెంబడించారా ఎవరైనా?

బంధుబంధాల నడుమ సాగే కురుక్షేత్రంలో ఆమెతో ఆమే పోరాడి
ఓడిపోయి గెలిచాననే అమె అంతర్గత మర్మం తెలుసా ఎవరికైనా?

మౌనద్వారంపై కూర్చుని మోములోముఖంపెట్టి మనసు ముడివిప్పి
కవళికల్చెప్పే నిశ్శబ్ద పదాల్ని చదివి అర్థంచేసుకున్నారా ఎవరైనా?

భీజాన్ని మొలకెత్తించే ముందు మూలాన్ని అడుగరెవరూ ఇష్టమాని
ఆమెకున్న సంబంధాల వ్యాకరణమేమిటో విశధీకరించగలరా ఎవరైనా?

వంటగదీ వండివడ్డించి పక్కపై పొర్లేటి గణితశాస్త్రం మాత్రమే నేర్పించి
వ్యంగ్యంతో సమానత్వమంటారే కానీ స్వేఛ్ఛగా వదలగలరా ఎవరైనా?

వాస్తవానికి ఎంత అణగద్రొక్కితే అంతకుమించి ఎదగడమే ఆమె రీతి
మాటలతో కాకుండా చేతల్లో చూపి రెక్కలు విప్పుకొని ఎగిరిపోతుంది
ఎప్పుడోకప్పుడు ఆమే కోరుకుంటుంది తనకంటూ ఒక ప్రత్యేక లోకం
స్త్రీ దృక్కోణం నుండి స్త్రీని చూడటం...ఆమె స్త్రీత్వానికి అదే నిర్వచనం!

Credits to: anonymous 10
 
Screenshot_20220307_142717.jpg
Disqualified from event. Found this as content from some other source. Not his/her own writing.
 
Top