ఒక్కసారి ప్రపంచాన్ని మర్చిపోయి, నీ జీవితంలో ఒక్కరోజు నాకోసం నీ సమయాన్ని కేటాయించగలవా?
ఉదయం నిద్రలేవగానే నా కళ్ళు మొదట చూడాలనేది నిన్నే. నీ పలకరింపుతో ఆ రోజు మొదలు అందంగా మారిపోవాలి. బాధ్యతలు, బాధలు అన్నీ కాసేపు పక్కనపెట్టి, మనసంతా కొన్ని చిలిపి క్షణాలను సృష్టించుకుందాం.
మనసుకు ప్రశాంతతనిచ్చే మాటలు మాట్లాడుకుందాం. మనకు నచ్చిన పనులను ఇష్టంగా కలిసి చేసుకుందాం. ఒకరికొకరం వడ్డించుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ కలిసి భోజనం చేద్దాం.
కాసేపు బయటకు నీతో కలిసి నడవాలని ఉంది. ఆ నడకలో నీ చెయ్యి నా చేతిలోనే ఉండాలి. మనం కలిసి నడిచే ఆ చిన్న దారి కూడా నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలి.
నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. నేను నీ మాటలు వింటూ నిన్నే చూస్తూ ఉండాలి. అలా నీతో గడిపే ప్రతి క్షణం నా మనసులోని భారాన్ని తగ్గించాలి.
కలిసి గుడికి వెళ్దాం. మన బంధం జీవితాంతం ఇలాగే నిలిచిపోవాలని దేవుడిని కోరుకుందాం. కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చొని, ఇంటికి వచ్చాక మనకు ఇష్టమైన పాటలు వింటూ, ఒక మంచి కాఫీ కప్పుతో ఆ సాయంత్రాన్ని అందంగా గడుపుదాం.
ఎప్పుడో మాట ఇచ్చి మర్చిపోయిన చిన్న చిన్న ఆనందాలను ఈరోజైనా గుర్తుపెట్టుకుని నాకు ఇవ్వడం మాత్రం మర్చిపోకు. ఎందుకంటే నాకు కావాల్సిన సంతోషం పెద్ద పెద్ద బహుమతుల్లో లేదు. నువ్వు ప్రేమతో గుర్తుపెట్టుకునే ఆ చిన్న చిన్న విషయాల్లోనే ఉంది.
ఈరోజు నీకు నా చేతులతో భోజనం తినిపించాలి. అది నాకు నువ్విచ్చే గొప్ప బహుమతుల్లో ఒకటి. రోజంతా నీతో గడిపిన ఆనందంతో అలసిపోయినా నా మనసుకు, రోజు చివర్లో నీ ఒడిలో కాసేపు తలపెట్టుకుంటే చాలు.
నువ్వు నా పక్కనే ఉన్నావనే ధైర్యం కలుగుతుంది. రోజంతా మనం పంచుకున్న ఆనందాలను గుర్తుచేసుకుంటూ నీతో కబుర్లు చెబుతూ, చివరికి నీ ఒడిలోనే చిన్నపిల్లలా ప్రశాంతంగా నిద్రపోవాలి.
నా జీవితంలో ఇంతకంటే అందమైన రోజులు మళ్లీ రావచ్చు... రాకపోవచ్చు. కానీ నువ్వు నాకోసం కేటాయించిన ఈ ఒక్కరోజు మాత్రం నా జ్ఞాపకాలలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
ఇవి ఏం నాకు వద్దు ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్ చాలు