• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Oka Sambhaashana!

EkaLustYa

Eternal Optimist of ZoZo
Senior's
Chat Pro User
( Note: This my own write up and all fiction )

"హలో"
"నేనమ్మా, ఎలా ఉన్నావ్?"
"బాగున్నారా అయ్యా! ఈ రోజింకా ఫోన్ చెయ్యెలేదంటా అనుకుంటున్నా!! నువ్వెలా ఉన్నావు? పిల్లది బాగా ఆడుకుంటోందా?"
"బాగుందమ్మా! ఇంట్లో అంతా ఎలా ఉంది? నీ ఆరోగ్యం ఎలా ఉంది?"
"నాకేమొచ్చిందిరా? బాగానే ఉన్నా. మీరు బాగుంటే నేను కూడాబాగుంటాను. చిన్నదొచ్చింది మాట్లాడతావా? ఐదేళ్ళయింది రా దీన్నిచూసి, చాలా చిక్కిపోయింది మనం పెంచుకున్న చిన్నది లా లేదు"

"ఇంత సడెన్ గా ఈ రోజు ఎందుకొచ్చింధి? దాని ఆరోగ్యమంతా బాగానేఉందా?"

"మన పండు పెద్దమనిషి అయింది రా! ఈ సంగతి వాళ్ళాయనికి ఫోన్ చేసిచెబ్తే చిన్నదాన్ని పంపాడు. సాయంత్రానికల్లావచ్చెయ్యమన్నాడట, టైమవుతొందని కంగారు పడుతోంది"

"సరే, ఇప్పుడు పెద్దమనిషి అయిన పేరు మీద ఫంక్షన్స్ ఏమైనా చేస్తున్నారా?"

"చెయ్యాలి కదరా! ఒక్కగానొక్క పిల్ల, ఆ ముద్దూ ముచ్చటా తీర్చకపోతే ఇంటికిఅరిష్టం కూడానూ"

"అమ్మా! నీకు చెప్పెదేం లేదు. అయితే పండుని ఇల్లంతా తిరగొద్దు, ఒక్క చోటేకూర్చో, అని చాప వేసి చెక్క బొమ్మలకి బట్టలు చుట్టే ప్రొగ్రాంస్ లాంటివిపెట్టకు. మిగిలిన పిల్లల్తో కలవకుండా చెయ్యకు. శరీరం లొ జరిగే మార్పులగురించి నీకు తెలిసిందే కాబట్టి దానికి అర్ధమయ్యే రీతి లో జాగ్రత్తలు చెప్పుఅంతేకాని ఇంకేరకమైన restrictions పెట్టకు"

"అలా అంటావేంట్రా?! మీ నాన్న కూడా ఇలానే అంటున్నారు, అసలు మీతోవేగలేం, ఆగు పెద్ద దాంతో చెబుతా"

"నువ్వెవరితో చెప్పినా నెను చెప్పేది ఇదే! సరేగాని చిన్నదానికి ఫోన్ ఇవ్వు"
"ఏరా అన్నయ్యా ఎలా ఉన్నావు? నా మేనకొడలు ఎలా ఉంది? వదిన ఎలాఉంది?"
" ఈ సంగతులన్నీ తర్వాత గానీ, ముందు నీ సంగతి చెప్పు. ఎన్ని సార్లు ఫోన్చేసినా ఆన్సర్ చెయ్యవు. పోనీ పని లో ఉండి ఉంటావ్ అనుకుంటే మళ్ళాతిరిగి ఫోన్ చెయ్యవు?"

".....మ్మ్ మ్మ్ ......నా ఫోన్ కూడా ఆయన దగ్గరే ఉంటుందిరా. ఏ ఫోన్వొచ్చినా ఆన్సర్ చెయ్యకుండా రింగ్ ఆగేవరకు అలాగే చుస్తూ ఉంటాడు. నీఫోన్ అనే కాదు నా కోసం ఎవ్వరు కాల్ చేసినా ఆన్సర్ చెయ్యనివ్వడు. నాన్నఫోన్ చెస్తే తనే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమంటాదు ...మ్మ్ మ్మ్....ఆఫీసు కివెళ్ళేప్పుడు కూడా నా ఫోన్ పట్టుకు పొతాడు. సరే గానీ ఐదు నిమిషాలతర్వాత నాన్న మొబైల్ కి కాల్ చేస్తావా? నెను డాబా మీదకొచ్చిమాట్లాదతాను?"

"సరే"

......
"హా ....చెప్పు చిన్నా... ఏంటి సంగతి? ఎలా ఉన్నావు?"

"ఏమని చెప్పనురా! రోజూ సూటిపోటి మాటలు, అమ్మనీ, నాన్ననీ, ఇంట్లొఅందర్నీ పేరు పేరునా పచ్చి బూతులు తిడతాడు. అక్కనైతే మరీతిడతాడు, కులం తక్కువ వాడిని కట్టుకుంది, నువ్వు కూడా ఎవర్నో ఒకడినిచూసుకోవాల్సింది అని...అప్పుడప్పుడూ బెల్ట్ తో కూడా కొడతాడు..
..మొన్నామధ్య ఎదురు తిరిగి నేను కూడా కర్ర పట్టుకునెసరికి కొట్టడంమానేసాడు కానీ... తిట్లు మాత్రం మానడం లేదు. నేను కూడా ఇక వాగితెవాగాడు లే మొరిగి ఆడె ఊరుకుంటాడు అని వదిలేసా. కానీ రోజు రోజుకీభరించడం కష్టం అవుతోంది"

"మొగుడిని భరించాలీ అంటే, అసహ్యం తో కూడిన విరక్తి అయినా ఉండాలిలేదా అవ్యాజమైన ప్రేమైనా ఉండాలి.నీకు మొదటిది ఉన్నట్టుంది. భరించడానికి అలవాటు పడ్డావ్ కదా? ఇంకెం కష్టం ఉంది?"

నాకు చచ్చిపోవాలని ఉందన్నయ్యా............."
"ఓ కే"
"ఓ కే ఏంట్రా సచ్చినోడా! చచ్చిపోవాలని ఉంది అంటుంటే"
"ఏమీ లెదు...అది statement aa ? లేక ఎలా చచ్చిపోవాలి అని నన్నుఅడుగుతున్నావా? అని ఆలోచిస్తున్నా"

"ఒరేయ్? ఒరేయ్!! ఏమైంది రా నీకు? నేను చచ్చిపోడమంటె నీకునవ్వులాట గా ఉందా?"

"ఓరేయ్, నాకు ఏడుపొస్తోందిరా........మ్మ్...మ్మ్. అలా అంటావేంటి? నాకుభరించే ఓపిక పోయింది. పండు దానికోసం బతుకుతున్నా తప్పితే, నాకుబతకాలని లేదు"

"చచ్చిపోడానికి భయపడేవాళ్ళంతా...ఇంక మరెవరికోసమోబ్రతుకుతున్నామనే అదోరకమైన సంత్రుప్తి తో చావుల్ని వాయిదా వేసేస్తూబ్రతికేస్తూ ఉంటారు. ఇందులొ సిగ్గుపడాల్సిందీ, బాధపడాల్సిందీ ఏమీ లేదు. సో.. బ్రతికేసెయ్యి." అయినా చావులు దేనికీ పరిష్కారం కానే కావు చాలామంది చచ్చిపోడానికి ధైర్యం కావాలి అనుకుంటారు కాని! నిజానికి ధైర్యం, బ్రతకడానికి కావాలి.

"ఓరేయ్! ఇలా మాట్లాడతావేంట్రా? కనీసం సానుభూతి కూడా లేకుండా?"

"సానుభూతులు ఓట్లు తెచ్చిపెడతాయేమో కానీ, కూడూ, గుడ్డా పెట్టవ్. సమస్యని పరిష్కరించనూ లేవు"

"ఓరేయ్! మా ఆయనికి ఎయిడ్స్ రా!"

"ఓ కే"

"ఈ ఓ కే ఏంట్రా సచ్చినోడా? నేనేవర్తొ చెప్పుకోవాలో తెలీక నీతోచెప్పుకుంటుంటే పందిరి గుంజ లాగా ఉలక్కుండా పలక్కుండా కనీసంఎమోషన్స్ కూడా లేకుండా?"

"టి.బి, కాన్సర్, గుండె పోటు....ఇలానే ఎయిడ్స్ కూడా ఒక జబ్బు. వొళ్ళుకొవ్వెక్కి తెచ్చుకుంటే ఏమీ చెయ్యలేం, అనుకోకుండా ఎదో అజాగ్రత్తలోదురద్రుష్ట వశాత్తూ అంటుకుంటె ఏమీ అనలేం. నువ్వు టెస్ట్చేయించుకున్నావా?"
"నేను టెస్ట్ చేయించుకున్నా, నాకు లేదు"
"మీరు శారీరకంగా కలిసి ఎన్నాళ్ళయింది?"
"కనీసం ఏడేళ్ళు అవుతుంది"
"మీ ఆయనకి ఎయిడ్స్ ఉందని ఎప్పుడు తెలిసింది?"
"మూడేళ్ళ క్రితం"
" ఈ సంగతి నాకు కాక ఇంకెవరికి తెలుసు?"
"నాన్నకి మాత్రమే తెలుసు, అమ్మకి కూడా తెలీదు"
"మెడికల్ టెస్ట్స్ ఎక్కడ చేయిస్తున్నారు?"
"నాన్న స్టూడెంట్ రాఘవన్ ఉన్నాడు కదా!అతనొ పెద్ద సర్జెన్ ఇప్పుడు. నాన్నరాఘవన్ చేతులు పట్టుకుని, బాబూ ఈ సంగతి ఇంకెక్కడా చెప్పకుఅంటే, మీరు ఇంతలా చెప్పాలా మాష్టారూ, నాకు తెలీదా నన్ను మీకొడుకనుకోండీ అన్నాడు. ప్రతీ నెలా అతని దగ్గరికె మెడికల్ టెస్ట్స్ కివెళుతున్నాం"

"మరి నాన్న ఇంతవరకూ నాతో ఎప్పుడూ చెప్పలేదేంటి?"
"నన్ను కూడా ఎవ్వరితోనూ చెప్పొద్దన్నారు, ముఖ్యం గా నీతో అస్సలుచెప్పొద్దన్నారు"
"మరెందుకు చెప్పావు?"
"నాకు నువ్వైతేనే సరైన మార్గం చెబుతావు అని అనిపించిందిరా"
"పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నీకు మీ ఆయన్ని వొదిలివొచ్చెయ్యాలనిపించలేదా?"
"అప్పుడప్పుడూ భరించలేని లో ఒచ్చెయ్యాలనిపిస్తుంధి. కానీ చూస్తూచూస్తూ సాటి మనిషికి పైగా మొగుడికి బాగోక పోతే నెను కాక ఇంకెవరు సేవచెయ్యగలరు అనిపిస్తుంది. రొజూ బ్లడ్ కౌంట్ పెరగడానికి, ఆకుకూరలు పిస్తాబాదం అన్నీ పెట్టాలి కదా? ఇవన్నీ ఎవరు చేస్తారు?"

"ఎప్పుడైనా ఇంతటి భరించలేని విసుగుతో విరక్తి తో ఎక్కడికైనాపారిపోవాలనిపించలేదా?"
"అనిపిస్తుంది రా!....మ్మ్....మ్మ్...కానీ ఇంటి పరువు తీసినదానినిఅవుతానేమో అనే భయం, బాధ. ఒకసారి నాన్నని కూడాఅడిగా, వచ్చెయ్యనా అని"
"మరేమన్నారు?"

"నీ ఇష్టం, వస్తే వొచ్చెయ్యి కానీ ఒకటి ఆలోచించుకో, నీ అన్నదమ్ములైనాఇంకెవరైనా నేను ఉన్నంత కాలమే సరిగా చూసుకుంటారు. ఆ తర్వాతిసంగతి కూడా ఆలొచించుకో అన్నారు"
" అంటే మేమెవ్వరం చూసుకొమేమో అనా?"

"అలా కాదురా, నాన్న చెప్పింది కూదా నిజమె కదా?! ఇంత మంచి పేరున్ననాన్న కి నా వల్ల చెడ్డ పేరు రావడం ఎందుకు?"

"పరువులేమన్నా జాతీయ జెండాలా? వాటికే దిక్కు లేదు. ఇంతకీ ఏ పరువుకోసం వెంపర్లాడుతున్నాం మనమిక్కడ?"

"ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి సమస్యలు వాళ్ళవి, ప్రతీ ఒకే రకమైనసమస్యకీ ఒకే రకమైన పరిష్కారాలుండవు. అయినా మేము చూస్తామాచూడమా అన్నది కాదు ముఖ్యం. నువ్వు నీ కొసం మాత్రమే ఏం చెయ్యగలవుఅనేది ముఖ్యం. ఇప్పుడు నీ ముందున్న మార్గాలు రెండు. ఒకటి: సతీసావిత్రి లా యముడి లాంటి మీ ఆయన కోసం జీవితాన్ని త్యాగం చేసేసిమిధ్యలైన ఎండమావుల్లాంటి పరువుల్ని వెతికి పట్టుకుని నిలబెట్టుకోవడం.
రెండు: ఇక కాపురం చేసింది చాలురా మగడా నీ చవు నువ్వు చావు, నాదారిన నేను పొతా అని పెట్టేబేడా సర్దుకుని వొచ్చెయ్యడం."

"అదేంటిరా! పాపం చచ్చి పోతాడు"

"మీ ఆయనేమన్నా మహాత్ముడా?ఎప్పుడైనా పోవాల్సిందే కదా? ఇప్పుడుకొంచెం త్వరగా పోతాడు.ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మన అమ్మానాన్నా చివరికి పెళ్ళికి ఒప్పుకునే అమ్మాయి కూడా చేసుకొబొయేవాడికిమందు, సిగరెట్లు, పేకాటా, మెరక వీధి పచార్లు అలవాటున్నాయా? జీతంఎంత? ఆపై ఒచ్చే పైకంఎంత? ఆస్తులెంత? అప్పులెంత? అందమెంత? వాడికున్న పరపతిమందమెంత అనే ఆలోచనలే తప్పితే, వాడికున్న మానసిక అవలక్షణాలగురించి ఎవడూ పట్టించుకోడు. మీ ఆయనలో ఉన్న అసలు జబ్బు ఎయిడ్స్కాదు. అపరిమితమైన అనుమానం, ఆత్మన్యూనతా భావం, వీటిల్లోంచితన్నుకొచ్చే శాడిజపు పైశాచికత్వమే అసలు జబ్బులు. మీ ఆయనచచ్చిపొయేలోపు ఎయిడ్స్ కి విరుగుడు మందు ఎవరైనా కనిపెట్టిబతికించేసినా ఆ మధ్య లొ వాడి బాధలకి నువ్వు చచ్చిపొవన్న గ్యారంటీలేదు. నువ్వు ఎదురు తిరిగి ఒరేయ్ ఎదవా! నేను ఇంకా నీ దగ్గరే ఉండి నీకుసేవ చెయ్యడం ఒక వరం లా భావించాలి అంతే గానీ చీటికీమాటికీ నన్నుహింస పెడితే భరించేది లేదు, అన్నం లొ ఎండ్రిన్ కలిపి చంపేస్తా అనినిక్కచ్చిగా చెప్పగలిగితే దాన్ని అతను సరైన భావనలోనే తీసుకుని చక్కగానువ్వు చెప్పినట్లె ఉంటాడన్న గ్యారంటీ కూడా లేదు. ఒకవేళ ఈ చేతకానిఉక్రొషం లో ఏ గుండు సూదో నీకు గుచ్చెస్తే?
"...........మ్మ్....మ్మ్........"
"ఇక నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం అంటావా? చేతిలో మాస్టర్స్ డిగ్రీఉంది, ఎక్కడో ఒక చోట ఉద్యోగం దొరక్క పోదు. అసలు ఉద్యోగం చెయ్యాల్సినఅవసరం కూడా లేదు. కానీ చెయ్యాలి. అదొక డైవెర్షనరీ యాక్టివిటీ. గాయాల్నిమర్చిపోడానికి ఉపయోగ పడుతుంది. పండుదాన్ని అంటావా? మేముచూసుకుంటాం."

" మరి నాన్న ఏమంటారోరా?"

"నాన్నది సామాజిక పరువు భూతంలోంచి తొంగి చూసే పిరికితనమేకానీ, నిన్ను వొస్తా అంటే రావొద్దని అనరు, అయినా నేను మాట్లాడతాలేనాన్నతొ.."

"అయితే ఏం చెయ్యమంటావ్ నన్నిప్పుడు?"

"ఏముంది? ఇంటికెళ్ళి చెప్పేసి వొచ్చే ధైర్యం ఉంటే చెప్పి వొచ్చెయ్, లేదా పండుఫంక్షన్ పేరు మీద వొచ్చెయ్యి. కానీ వొచ్చేప్పుడు చీరలు నగల సంగతితర్వాత, సర్టిఫికేట్స్, మార్క్స్ మెమో లు మర్చిపోకు"

"సరేరా! నేను బయల్దేరతా, ఫంక్షన్ పేరు తో వచ్చి ఉండిపొతా"

"సరె అయితే, నేను ఈ మధ్య లొ నాన్న తో మాట్లాడతా, ఉండనా మరి?"

"సరే అన్నయ్యా" BYE.
 
@EkaLustYa

బాగా చెప్పారు గురువర్యా!
ఒక మనిషి జీవితంలో పురోగతిని ఆపుతూ, మనశ్శాంతి లేకుండా చేసే అనవసరమైన భయాల్ని, విషయాలని ఒక సంభాషణలో అబ్బురంగా అమర్చి భోదించారు

కొన్ని మనసుని నొప్పించేలా అనిపించినా అవి మనిషి గ్రహించాల్సిన అక్షర సత్యాలు
నిజం చెప్పాలంటే నాకు కూడా మీరు ప్రస్తావించిన కొన్ని రోగాలున్నాయి
వీటివల్ల నేనే లోపల కృంగిపోతా కానీ ఇతరుల్ని చాలా వరకూ బాధపెట్టాననుకోండి
ఆత్మన్యూనతా, ఎవరైనా నాకు దగ్గరైన వాళ్లు నాతో సరిగా లేకపోతే నా వెనక ఏదైనా జరుగుతుందా అనే పిచ్చి ప్రశ్నలు, నా గురించి ఎవరైనా లేనిపోనివి చెప్పడం వల్ల నన్ను దూరం చేస్తున్నారా అనే అనుమానాలు, ఆవేదనలు, ఆక్రందనలు, ఆర్తనాదాలు, ఆందోళనలు. ఇవే నాకున్న జబ్బులు

వీటన్నిటిని నాకు గుర్తుచేస్తూ, "ఇవన్నీ అందరికీ ఉండేవే, భయపడకు, అన్నీ నీకే అర్థమవుతాయి, పరిష్కారమవుతాయి ధైర్యం చేస్తే" అని మీరు భుజం తట్టి ప్రోత్సహించునట్టు తోచింది నా మనసుకు
 
Last edited:

Lol vaaanmo ee guryvarya evadu naaku hindi magabhaarath serial gurtochindhi . What I liked was - your effort and patience to read. Ika encouragement antaavaa, naa full support neeke- kummeyy!
 
Maybe this is my 2nd or 3rd time I read ur telugu written post completely...

Naku telugu chadavadam rayadam sariga radu..kani konni chadivinapudu manasuni gundeni kadilistai..konni ite nane drushtilo petukoni prathavistunai emo eh matalu anipistundi..chala baga rasaru...
Oka manishi ki sahanam, opika anevi jeevaitham anta undaalsina avasaram ledu konni sarlu thirugubatu cheste manchi jarugutundi ante ah sahanam pakkana petalsinde...

Thank you for enlightening us ❤️
 
ఆత్మన్యూనతా, ఎవరైనా నాకు దగ్గరైన వాళ్లు నాతో సరిగా లేకపోతే నా వెనక ఏదైనా జరుగుతుందా అనే పిచ్చి ప్రశ్నలు, నా గురించి ఎవరైనా లేనిపోనివి చెప్పడం వల్ల నన్ను దూరం చేస్తున్నారా అనే అనుమానాలు, ఆవేదనలు, ఆక్రందనలు, ఆర్తనాదాలు, ఆందోళనలు. ఇవే నాకున్న జబ్బులు
Evi ani andariki undeve, kani chepukoleru, chepukuna pichidi ani anukuntaru vichitram enti ante ah pichidi ani ane vallu kuda eh paristhithi lo untaru..haha
 
అవ్వడానికి ఇది కల్పిత కథే అయినప్పటికీ చాలా మంది జీవితాలలో ఇది నిజంగానే జరుగుతున్న దాఖలాలు కోకొల్లలు....
కానీ ప్రతీ ఒక్కరికీ ఇలా అర్థం చేసుకునే కుటుంబ సభ్యులు ఉండకపోవచ్చు. అర్థం చేసుకోరేమో అనే భయంతో లోపలే బాధను దాచిపెట్టిన స్త్రీ మూర్తులు మరి కొందరు.
సమాజం కోసం ఏమనుకుంటారో అని వెనకడుగు వేసే వారు కూడా ఉన్నారు... కానీ ఎలాంటి వారి కైనా కావాల్సింది ఒక్కటే ధైర్యం... అది ఇవ్వగలిగే అవకాశం వచ్చినప్పుడు మాత్రం మనం వెనకడుగు వేయకుండా వాళ్ళని వెనక్కు లాగకుండా ఉంటే చాలు... వాళ్లకు చాలా మేలు చేసినవారము అవుతాం.
 
Top