• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Heart Touching Lyrics from Telugu Songs

Tomato Fellow

Wellknown Ace
ఈ కలత... చాలే మామత
మరుపురాని. స్మృతులలోనే రగిలిపోతవా
మరలిరాని గతముగానే మిగిలిపోతవా !

వెంటరమ్మంటూ తీసుకేలతావు,
నమ్మి వస్తే, నట్టడవిలో విడిచిపోతావు...
జంట కమ్మంటూ ఆశ పెడతావు,
కలిమి ఉంచే, చెలిమి తుంచే కలహమవుతావు


©
Lyricist: Sirivennela Sitaramasastry
Song: Enduku Chentaku Vasthavo
Movie: Konchem Ishtam Konchem Kashtam
 
Last edited:
ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే

ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లా వినిపించే తడి గానం ప్రేమంటే

అణువణువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం

ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం

దాహం లో మునిగిన చిగురుకు చల్లని తన చెయందించీ

స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే

మేఘం లో నిద్దుర పోఇన రంగులు అన్ని రప్పించి

మాఘాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే


ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేది ఏదో గుర్తించేందుకు వీలుందా

ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదఇస్తుందో గమనించే సమయం ఉంటుందా

ప్రేమంటే ఎమంటే చెప్పేసే మాటుంటే ఆ మాట కి తెలిసేనా ప్రేమంటే

అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం

సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే

దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ వొరవడి పెంచిన తొలి చినుకేదంటే

సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే

మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెపుతుందే పదునుగా నాటే నాగలి పొటే చేసిన మేలంటే

తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే

తను కొలువైవుండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంతా తానై అడగక

దొరికే వరమే వలపంటే

జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా

రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా

Movie : Nuvvostanante Nenoddantana

Lyrics : Sirivennela

Music : Devi Sri Prasad

Singer : S P Balu
 
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లే కష్టమొస్తే
కళ్లనీళ్లు పెట్టుకుంటూ
కాళ్లు కడిగి స్వాగతించకూ
ఒక్క చిన్న నవ్వు నవ్వి
సాగనంపకుండా లేనిపోని సేవచేయకు
మిణుగురులా మిలమిల మెరిసే
దరహాసం చాలు కదా
ముసురుకునే నిశి విలవిలలాడుతూ
పరుగులు తియ్యదా
.
.
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగ
నిన్న రాత్రి పీడకల
నేడు తలచుకుంటూ
నిద్రమానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైనా
అందులోనే ఉంటూ
లేవకుండా ఉండగలమా
కలలుగన్నవి కలలే అని
తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిలకిలతో
తరిమెయ్యవే చిలకమ్మా

చిత్రం : చిరునవ్వుతో
రచన : సిరివెన్నెల
సంగీతం : మణిశర్మ
గానం : బాలు
 
ఈ కలత... చాలే మామత
మరుపురాని. స్మృతులలోనే రగిలిపోతవా
మరలిరాని గతముగానే మిగిలిపోతవా !

వెంటరమ్మంటూ తీసుకేలతావు,
నమ్మి వస్తే, నట్టడవిలో విడిచిపోతావు...
జంట కమ్మంటూ ఆశ పెడతావు,
కలిమి ఉంచే, చెలిమి తుంచే కలహమవుతావు


©
Lyricist: Sirivennela Sitaramasastry
Song: Enduku Chentaku Vasthavo
Movie: Konchem Ishtam Konchem Kashtam
 
గుండెల్లో ఈ సందళ్ళు
వచ్చాయే నీ వల్లేను
కన్నుల్లో ఈ వెన్నెల్లు
తెచ్చిందే నీ నవ్వేను...

ఏదో ఊసే చెప్పాలన్న
కల్లోలాలే రాబోతున్న
మైకం దాటి వింటుందా హృదయం
ఇలా నాతో నువుంటున్న
క్షణం ఎంతో బాగుందంటు
తనే ఆగి చూస్తుందా సమయం...

పడిగాపులో తలదాచుతూ
గడిచాయిలే ఇన్నిరోజులు
ఒక క్షణమునే ఒక యుగములా ప్రేమా
చెలి రాకతో చెలి మాటతో
మురిసాయిలే చిరునవ్వుల
ఎద తేలడం తొలిసారి చూసున్నా ఆ ఆ ఆ...

నిను చూసిలా, నా మనసిలా
తెగ పెంచుకున్నా ప్రేమని
ఈనాడిలా ఈ చెలిమిలో
తను పంచుతుందా సగమనీ...

Dear kavya...
 
Top