• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Chinna katha....

Reddy gari Abbai

Reality checker on ZoZo
Chat Pro User
ప్రేమకథలలో ఈ కథ ప్రత్యేకం, ఎందుకంటే ఈ కథలో ప్రేముంటుంది, కాని ప్రేమికులుండరు. ఇక కథలోకి వెళితే, ఎలాగో చిన్నప్పుడు

విన్న కథలులా అనగనగా అని కాకుండా., అనుకోకుండా అని కూడా కాదు. నేనే ఈ కథను అయ్యి చెప్పాలని అనుకుంటున్నాను. అందుకే ఈ కథ నాది కాకపోయినా నాది అన్నట్టుగా అనిపించేలా రాయాలనుకున్నాను.. అందుకే ఓయ్ నీకొక కథ చెప్పనా ... అని మొదలుపెడుతున్న.

ఇక నా కథలోకి వెళ్లాం. నేను నాలుగో తరగతిలోకి వెళ్లాను, అప్పటి దాక మూడో తరగతిలో ఉన్న నా క్లాస్మేట్ వాళ్ళ నాన్న పుణ్యమా అని వేరే ఊరికి తుర్రుమంది.. ఇంక నా పుస్తకంలో నా పేరు పక్కన తనపేరుని రబ్బరుతో తుడిపెశాను.

నాలుగో తరగతిలో నాలుగు ముక్కలు హిందీ నేర్పడానికి ఓ టీచర్ వచ్చింది. చూడటానికి కొత్త పెన్సిల్ లా ఉంది. నాకు అప్పట్లో ఆ ఫీలింగ్ ఏంటో తెలిదు ఎందుకంటే నేను చిన్నపిల్లోడిని కదా. కాని ఏంటో ఆ టిచర్ మాట్లాడుతుంటే నవ్వుతున్నట్టుగా అనిపించేది, నేను నవ్వే వాడిని. ఎందుకో ఆవిడ కొట్టినా ఇష్టమే, ఎందుకంటే కొడితే ఏడిచేవాడిని, అప్పుడు తను నాకిష్టమైన ఆశా చాక్లెట్ కొనిచ్చేది. దెగ్గరకు తీసుకొని ఒడిలో కూర్చోపెట్టుకొని బుజ్జగించేది. అది చూసి మా క్లాసు ఆడపిల్లలు కుల్లుకొనేవాళ్ళు. నేను రొజూ ఆవిడ కోసమే స్కూల్కి వెళ్ళేవాడిని,
ఎందుకంటే తను హిందీ చెప్తుంటే సంగీతం విన్నట్టుగా అనిపిస్తుండేది.ఒకరోజు మా టీచర్ అందరిని బొమ్మల్ని వెయ్యమనింది, నేను ఒక పువ్వు బొమ్మ వేసి పక్కన హిందీ టీచర్ అని రాశాను. అది చూసి తను నా బుగ్గపై ముద్దు పెట్టింది, నాకు సిగ్గేసింది ఆవిడ కూర్చున్న కుర్జి వెనుక దాక్కున్నాను.

పిల్లలందరు చెప్పట్లు కొట్టారు నాకు నేను హీరోలా అనిపించాను.

ఆవిడ అలా రెండేళ్ళు అంటే ఆరో తరగతి వరకు నాకు హిందీ

ఆ తరువాత రావడం మానేసింది, నాకు హిందీ అప్పటి నుండి నచ్చలేదు.ఎవరో ఒక కొత్త ఆవిడ వచ్చింది, కాని నాకు హిందీ చెప్పిన్నట్టుగాలేదు, ఏదో చైనీస్ బాషలా అనిపించేది. తర్వాత ఆవిడ ప్రధమికా తరగతులు చెప్తుందని విని, దానిలో వెళ్లి జాయిన్ అయ్యాను. ఎప్పుడూ ఆవిడ నవ్వుతూ ఉంటె నేను చూస్తూ ఉండేవాడిని. అంతకు మించి నాకు ఏమి తెలీదు. నాలో నేను నవ్వుకునేవాడిని, పరిక్షలైతే రాయలేదు కాని ఆవిడ కోసం వెళ్ళేవాడిని. అలానే మధ్యమ క్లాస్లో వెళ్లి కూర్చున్నాను, అప్పుడు ఆవిడ అనింది, నువ్వు ప్రాథమిక పాస్ అయ్యాకే మాధ్యమాకి రావాలి అని. అప్పుడు ఆవిడ కోపంగా చెప్పింది, అది నాకు నచ్చలేదు. ఎందుకో తర్వాత ఆవిడ కోసం వెళ్ళేవాడిని కాదు, అలానే నాకు స్కూల్ కుడా నచ్చలేదు. అంతే పట్టుపట్టి వేరే స్కూల్ జాయిన్ అయ్యాను.
అంతే, నా హింది ఆవిడ దగ్గరే ఆగిపోయింది. తను కోప్పడగానే, నాకు పెన్సిల్ విరిగినంత భాదేసింది. ఇక ఆ తర్వాత పెన్సిల్ కాస్త పెన్సు గా మారిందనుకోండి. ..... Ah katha malli chestha.... :p
 
Top