పిట్ట కథలు
చిన్నప్పుడు మా పాఠశాలలో గురువుగారు తరచూ పిట్ట కథలు చెప్పేవారు.
ఆ కథల్లో కొన్ని వినగానే నవ్వు పుట్టించేవి, మరికొన్ని మనసుకు తాకే ప్రేరణాత్మకమైనవి.
అలాంటి కథల్లో నేడు ఒకటి నాకు గుర్తుకొచ్చింది. దానిని మీతో పంచుకోవాలనిపించింది.
మన అందరికీ తెలిసిందే — తెనాలి రామకృష్ణుడు. ఆయన వికటకవి, చమత్కారవేత్త, జ్ఞానసంపన్నుడు.
ఆయన చేసే ప్రతి చర్యలో హాస్యమూ ఉంటుంది, హృదయార్థమూ ఉంటుంది.
అలాంటి ఒక కథను మా తెలుగు గురువుగారు మాకు చెప్పినారు.
ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు రాజసభలో సభికులనుద్దేశించి ప్రశ్నించారు –
> “మనస్ఫూర్తిగా ’"హమయ్యా "అని మనం ఎప్పుడు అనుకుంటాము?”
దానికి ఒక్కొక్క కవి ఒక్కొక్క సమాధానం ఇచ్చాడు.
ఒకరు — “అన్ని అప్పులు తీర్చేసినప్పుడు.”
ఇంకొకరు — “కూతురి పెళ్లి పూర్తయినప్పుడు.”
మరోకరు — “సొంత ఇల్లు కట్టించుకున్నప్పుడు.”
ఇంకొకరు — “ఇంటిపనులన్నీ ముగిసినప్పుడు.”
చివరగా తెనాలి రామకృష్ణుడు లేచి అన్నాడు —
> “ఏవీ కావు మహారాజా! మనం ఉదయం నిద్రలేచి, విసర్జన పూర్తి చేసిన తరువాతే నిజంగా ‘హాయ్!’ అని అనిపిస్తుంది.”
అది విని రాజుగారికి కోపం వచ్చింది.
“ఇంత అశ్రద్ధగా, వ్యంగ్యంగా ఎలా సమాధానం చెప్తావు!” అంటూ ఒకరోజు రాజసభకు ప్రవేశం నిషేధించారు.
దాంతో రామకృష్ణుడు రాజుగారికి ఆ మాట యొక్క నిజార్థం చూపించాలని నిర్ణయించుకున్నాడు.
తరువాతి ఉదయం, రాజుగారు నిద్రలేచే సమయానికి ముందుగానే ఆయన గదికి తాళం వేయించాడు.
రాజుగారు లేచి స్నానానికి వెళ్లదలచి తలుపు తెరిచే ప్రయత్నం చేశారు, కానీ తలుపు తెరుచుకోలేదు.
ఎంత అరిచినా ఎవ్వరూ వినలేదు.
కొంతసేపటికి పొట్ట ఉబ్బిపోతూ, అసహనం పెరుగుతూ వచ్చింది.
చివరికి తెనాలి తలుపు తెరిచాడు.
రాజుగారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లి, తన పని ముగించాక లోతుగా ఒక నిట్టూర్పు వదిలారు —
> “హమయ్యా"
అప్పుడే ఆయనకు అర్థమైంది —
తెనాలి రామకృష్ణుడు చెప్పినదే నిజమని, తన జ్ఞానం ఎటువంటి స్థాయిలో ఉందో.
దాంతో ఆయనను రాజుగారు అభినందించి, యోగ్యమైన బహుమానం ఇచ్చారు.
అలాంటి పిట్ట కథలే మన చిన్ననాటి జ్ఞాపకాలు —
నవ్వు, బోధ, బుద్ధి కలగలిపిన మధురానుభూతులు.
కానీ నేడు ఈ ఆధునిక సమాజంలో అలాంటి కథలు చెప్పేవారు కూడా లేరు, వినేవారు కూడా అరుదే.
మిత్రులారా, మీరు కూడా అలాంటి సత్యం చెప్పే, నవ్వు పుట్టించే తెలుగు పిట్టకథలు పంచుకోండి —
మన భాషలోనే, మన మధురమైన తెలుగు మాటల!!!