• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

సంతూర్ మమ్మీలు

మరీ సంతూర్ సబ్బు ప్రకటనలో వున్న అమ్మాయి అంత అందం కాకున్నా ,నాలుగు పదుల వయసులో లెగ్గింగ్స్ టాప్ లు వేసి బిగుతైన వస్త్రాలు వేస్తే మూడు పదుల వయసు యువతి లా కనపడేవారు ఎంతో మంది.అయినా మీరు అనేది కూడా నిజమేలే .ఎంత బిగుతైన వస్త్రాలు వేస్తే మాత్రం చూసే వాని మనసు మంచిది అయుండాలి కానీ పోకిరి వెధవలకి భయపడి వేసుకోడం మానేస్తామా అని కొందరు అంటుంటారు .మనసు ఎంత నిగ్రహం అయినా అది చెడు భావన కలగకుండా అడ్డుకుంటుంది ఏమో కానీ ప్రకృతి అందాలని చూడొద్దు అని అనదు కదా అని కొందరు అంటున్నారు .తిండిలో వచ్చిన మార్పులో లేక డైటింగ్ లు అంటూ వీళ్ళు చేసే ప్రయత్నాలో తెలీదు కానీ .కుర్ర కారు మదిని యువతుల కంటే ఈ సంతూర్ మమ్మీ లే దోచేస్తున్నారు .పెళ్లి చూపులలో తల్లీ కూతుళ్ళని పక్క పక్కన కూర్చోబెడితే పెళ్లి కొడుకు చూపులు తల్లి మీదనే వుంటాయేమో .పాత రోజుల్లో పెళ్లి కూతురికి అక్క చెల్లెల్లు ఎవరైనా ఉంటే పెళ్లి చూపులప్పుడు బయటకి రాకుండా దాచే వాళ్ళట.ఇప్పుడు తల్లిని దాచాల్సిన పరిస్థితి .కొడుకుకి స్నెహితులని ఇంటికి తీసుకురావాలంటే భయమాయె ఎక్కడ ఈ సంతూర్ మమ్మీ ని తప్పుగా చూస్తారేమో అని .స్నేహితుని తల్లిని సొంత తల్లిలా చూసే కాలమా ఇది .ఆంటీ అనే దిక్కుమాలిన పదం ఒకటి తగలెడిందిగా.కూతురుకేమో "బాయ్ ఫ్రెండ్ 'యువర్ మామ్ లుక్స్ యంగ్'' అంటే కడుపులో మంట పుట్టే . సరే ఏది ఏమైనా మన సమాజం లో అందరూ చెడ్డవారు కాదూ అలా అని అందరూ మంచి వారు కాదు .వ్యామోహాలు తెచ్చిన తంట ఇదంతా .సన్నని నడుముకి ఎతైన అధరాలు మనసు దోచకుండా ఉండేనా .వయసు తారతమ్యం లు మరిచిపోయి అందాలు చూసి ఆస్వాదించడం యువకులకు వున్న అలవాటే కానీ .ఆ అందాలు అనుభవించాలన్న వింత దరిద్రపు ఆలోచనలు, దాని కోసం పరితపించి ప్రయత్నాలు చేయడం నీ భవిష్యత్తుని తల క్రిందులు చేస్తుంది జాగ్రత్త సుమీ .

ఇక ఈ సంతూర్ ముమ్మీల గురించి చెప్పేది ఏముంది ఏ డ్రెస్ వేసిన గుండ్రంగా తిరిగి అద్దం ముందు చూసుకోడం మామూలే .అందగత్తెలకి వయ్యారం ,మెల్లిగా నడవడం ,అణుకువ, కాస్త పొగరు కూడా ఇవన్నీ ఆటోమేటిక్ గ వచ్చేవే . ఎవరైనా అందంగానే ఉండాలి అనుకుంటారు తప్పేమి లేదు .కానీ వీళ్ళు అందం కాపాడుకోడానికి తంటాలు పడాల్సి వస్తుంది .అందానికి వయసుతో సంబంధం ఉందా వున్న అందాన్ని కాపాడుకోకపోతేనే తప్పు అసలు . ఇంట్లో వాళ్లేమో ఇంకా కుర్ర పిల్లలా ఆ క్రీం లు పౌడర్లు ఏంటి అని అదొక గొడవ అయిపోయే .బయట వారంతా ఆమె అందానికి పరవశించిపోతుంటారు కానీ ఆమె మనసు ఆమె మంచి మాటలు ఎంత అందమైనదో ఆమె ఇంట్లో వారికి ఆమెతో సన్నిహితంగా వుండే వాళ్ళకే తెలుసు .నిజమైన సంతూర్ మమ్మీ అంటే అందం ఒక్కటే కాదు అందమైన మనసు కూడా ఉండాలి .ఇది అందరికి కూడా వర్తిస్తుంది అండోయ్ .స్త్రీ అందం చూడొద్దు అని నేను అనలేను ఎందుకంటే మునులకే సాధ్యపడని మాయ అది .కానీ ఆ అందం పొందాలని మునులు శాపగ్రస్తులు అయినట్టు నువ్వు తంటాలు తెచుకోకు అనేదే నా హెచ్చరిక .

బయట సమాజం లో ఇలానే వుంది అనుకుంటున్నా .తప్పు అయితే మన్నించి కామెంట్ పెట్టండి నా రచనలు సరిదిద్దుకునే అవకాశం కల్పించండి .
ధన్య వాదములు .
 
చాలా బాగా రాశారు!
ఇంతకీ మీ అభిప్రాయం చెప్పండి

నాలుగు పదుల వయసులో ఉన్న ఆడవారు అందం గా తయారు అవ్వచ్చా? అవ్వకుడదా?
 
చాలా బాగా రాశారు!
ఇంతకీ మీ అభిప్రాయం చెప్పండి

నాలుగు పదుల వయసులో ఉన్న ఆడవారు అందం గా తయారు అవ్వచ్చా? అవ్వకుడదా?
అందంగా ఎవరైనా తయారవొచ్చు అందులో తప్పేముంది .
 
Top