• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

రెండో పెళ్లి

రామయ్య ఊరిలో పెద్ద ఆసామి .ఆయనకీ పెళ్లి అయిన పిల్లలున్నారు .మనవడు లు వున్న వయసులో పెళ్లి చేసుకున్నాడు .అంత పని ఏమొచ్చింది అనుకుంటున్నారా ,కొడుకు కోడలు అమెరికా వెళ్లారు .కూతురు ఏమో అత్త మామలకే సేవలు చేయలేకపోతోంది ఇక భారం ఎందుకు అనుకున్నాడు .భార్య పోయి పదేళ్లు అయింది .ఇంతకీ ఆయన వయసెంతో తెలుసా 51 .ఇంకేం చాలా వయసు ఉందిగా ఆయనకీ అనుకుంటున్నారు కదా, నిజమే కానీ ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి వయసు 38 .ఈమెకి పెళ్లి అయిన కొన్ని రోజులకే భర్త పోయాడు .ఆమె ఇంకా తన భర్త జ్ఞాపకాలు మరిచిపోలేదు .ఎవరు సంబంధం కి వచ్చినా ఆమె అందం చూసి వచ్చే వాళ్ళే కానీ ఆమెని ప్రేమగా చూసుకుంటారు అనిపించలేదు .ఇక తనకంటూ ఒక తోడు కావాలి అనుకుంది.ఈ ముసలాయన అయితే వయసు అయిపోయింది నా మీదే ఆయన ఆధార పడాలి ఇంకో పదేళ్లలో అనుకుందో ఏమో కానీ ఒప్పుకుంది .మరి ముసలాయన వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా అంటే లేదు .పిల్లల ప్రేమకి పెద్ద వాళ్ళు ఎలా అడ్డు చెప్తారో వీళ్ళ ప్రేమకి కూడా అలానే అడ్డు చెప్పారు అసలు వీళ్ళ ప్రేమ ఎలా మొదలయిందో తరువాయి భాగం లో చూద్దాం .
 
ఇంతకీ రామయ్య పల్లవి ల పరిచయం ఎలా అయింది అనుకుంటున్నారా .ఆమె ఒక టీచర్ ట్రాన్స్ఫర్ మీద ఒక చిన్న పట్టణం కి వచ్చింది .ఒక్కతే ఉండడం కొంచెం భయమే అనుకుంది అందుకే కూతవేటు దూరంలో వున్న పల్లెటూరికి వచ్చి ఇల్లు వెతుకుతుంది .ఇంతలో ఆ ఊరు ప్రెసిడెంట్ గారు ఆమెని చూసి ఎవరమ్మా నువ్వు ఏ ఊరు మీది అన్నాడు .ఆమె మొత్తం చెప్పింది .టౌన్ లో హాయిగా ఉండక ఇక్కడెందుకు ,మా ఇల్లులే వున్నాయి టౌన్ లో ఎలాగో అద్దె కి చేరే వాళ్ళే లేరు మీరు తీసుకోండి అన్నాడు .ఆమె కొంచెం సంకోచిస్తుంది .ఇంతలో ప్రెసిడెంట్ గారు ఉండి ఎవరేవరుంటారు అన్నాడు .ఆమె నేను ఒక్క దానినే అన్నయ వదిన వాళ్ళు సిటీ వెళ్లారు ,నేను వితంతువుని అనింది ఆమె .సరే అర్ధం అయింది నాకు. మీకు పల్లెటూరే మంచిది అన్నాడు ప్రెసిడెంట్ .ఇంతలో ఒకామె వచ్చి ఎవరు మామ ఈ అమ్మాయి అనింది .ఈమె టీచర్ అంట ఇల్లు కోసం వచ్చింది ,మీ ఇంట్లో పైన రూము కాలీ గానే ఉందిగా అన్నాడు ప్రెసిడెంట్ .ఎక్కడ మామ ధాన్యం బస్తాలన్నీ వేసి వున్నాయి ,మన ఆసామి రామయ్య వాళ్ళ ఇల్లు కాలీ గానే ఉందిగా అనింది ఆమె .ఓసోసి నేను అసలు మరిచిపోయానే ఈ అమ్మాయిని ఆసామి దగ్గరకి తీసుకెళ్ళు అన్నారు ప్రెసిడెంట్ .ఇక ఆమె రామయ్య గురించి చెప్తుంది మనిషి చాలా మంచోడు .ఏం ఉద్యోగాల్లో ఏంటో కానీ పిల్లలు తల్లి తండ్రిని పట్టించుకోరు ఆయనకీ ఎంత ఆస్తి ఉంటే ఏమి ,ఆస్తి మొత్తం మూడు భాగాలు చేసి కొడుకు కూతురికి రెండు భాగాలు ఇచ్చి ఆయన ఒక భాగం ఉంచుకున్నాడు .పిల్లలు కూడా ఆయన్నే వుంచుకోమన్నారు అని చెప్తుంది ఆమె .ఇంతలో పల్లవి రామయ్య ఇంటికి రానే వచ్చింది .ఆమె రామయ్యకి అన్ని చెప్పి వెళ్ళమ్మా లోపలకి మన ఊరిలో నీకేం భయం లేదులే అని పల్లవితో చెప్పి వెళ్ళింది ఆమె .పల్లవి లోనికి వెళ్లి కూర్చుంది .ఆమె ముద్ద బంతి లాంటి ముఖం చూసిన రామయ్య ఆయనకీ తెలియకుండానే ఏదో మాయలోకి వెళ్ళాడు .ఆమె మాట్లాడుతుంటే రామయ్య ఆమె కళ్ళు పెదవులు చూస్తూ ఉంటే ఆయన ఒళ్ళు పులకరించి పోయింది .మరి ఆమె ఎతైన అదరములు సన్నని నడుము గురించి కాసేపు పక్కన పెడుదాం .ఎందుకంటే రామయ్య ఆమెని చూసే దృష్టి వేరే ,ఆమె అంత అంధ గత్తె అయినను రామయ్య మోహానికి గురి కాలేదు .ఆమె కళ్ళలోని మెరుపు రామయ్య మనసు దోచేస్తుంది .ఇక ఆమె కట్టు బొట్టు అసలే టీచర్ కదా ,ఏ మాత్రం నడుము కనపడకుండా ఆమె వెనక ఎత్తయిన అదరములు మీద ఎవరి చూపు పడకుండా ఆమె చీర పైటని వెనకగా అదరములని కప్పుతూ కొంగు ఆమె చేతితో పట్టుకుంది .ఆమెని అందరూ తోటి ఉపాధ్యాయురాలు అంతా మీరు పాత కాలపు మనిషిలా వుంటారు అనే వాళ్ళు .స్టూడెంట్స్ ఎవరికీ కూడా ఆమె మీద చెడు దృష్టి పడే అవకాశమే ఆమె ఇవ్వదు .రామయ్య కాలక్షేపం కి పుస్తకాలు చదువుతూ ఉంటాడు .మీరు ఇక్కడే వుండండి ఇప్పుడే వస్తా అన్నాడు రామయ్య .నేను ఆ గదిలో పుస్తకాలు చూడచ్చా అనింది పల్లవి .హా తప్పకుండా చూడొచ్చు అన్నాడు రామయ్య .పల్లవి ఈయన ఎవరో పుస్తకాల పురుగులా వున్నారు ఇంత పాత పుస్తకాలు ఎక్కడా దొరకవు ఏమో అనుకుంటుంది .ఇంతలో రామయ్య కాఫీ తీసుకొని వచ్చాడు .టీచరమ్మ ఇదిగో కాఫీ అన్నాడు .అయ్యో మీకెందుకు శ్రమ నేను వద్దని చెప్పే దాన్ని అనింది పల్లవి .పల్లవి కాఫీ తాగి ఉమ్మ్మ్ అద్భుతం గా వుంది కాఫీ అనింది .ఇంతలో రామయ్య పాలేరు భార్య రాములమ్మ భోజనం తెచ్చింది రామయ్యకి .రామయ్య పల్లవి గురించి చెప్పాడు .రాములమ్మ కింద కూర్చొని రామయ్య కి ,పల్లవికి భోజనం పెడుతుంది .అయ్యో వద్దు నేను బయట తినేస్తా అనింది .లేదు లేదు మా ఇంటికొచ్చి భోజనం తినకుండా వెళ్తారా తినాల్సిందే అన్నాడు రామయ్య .అమ్మా...... రామయ్య ఇంటికొచ్చి భోజనం తినకుండా వెళ్తే ఊళ్ళో నా పరువు ఏమై పోవాలి అన్నాడు రామయ్య .సరే అని పల్లవి తింటుంది .ఇంతలో పల్లవి నువ్వెందుకు కింద కూర్చున్నావ్ అనింది పాలేరు భర్య రాములమ్మని .మేము తక్కువొల్లం కదమ్మా అనింది రాములమ్మ .ఇంతలో రామయ్య నువ్వు ఊరుకోవే నేనేదో నిన్ను తక్కువగా చూస్తున్న అనుకుంటది పంతులమ్మ అన్నాడు .అదేమి లేదు అమ్మ మా అయ్య గారు చానా మంచోళ్ళు పొలం లో మాతో కూచొని తినే వాళ్ళు అనింది రాములమ్మ .సరే అదంతా నాకు తెలీదు నువ్వు కూడా ఆ కుర్చీ తెచ్చుకొని కూర్చో అనింది పల్లవి .హా పంతులమ్మ చెప్తే కానీ వినవా నువ్వు అని నావ్వాడు రామయ్య .మా రాములమ్మ కొడుకు పట్నం లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు ,నీకేం కర్మ ఇంట్లో తిని కూర్చోక అంటే ,పొలం పని ఎవరూ చేయక పోతే పంట పండేది ఎలాగా అనింది అన్నాడు రామయ్య .ఇక మీదట ఏమో కానీ అమ్మ ,మా తరం వరకు అయినా పొలం పని విడిచిపెట్టము అనింది రాములమ్మ .రాములమ్మా నువ్వు చేసిన కూరలు బావున్నాయి అనింది పల్లవి .మీకు కూడా నేనే వండిపెడుతాలే అమ్మ అనింది రాములమ్మ .ఇంతకీ సామాను ఎప్పుడు వస్తున్నాయి అన్నాడు రామయ్య .రేపు తెచ్చేసుకుంటా అని వెళ్ళిపోయింది పల్లవి .మరుసటి రోజు సామాను అంతా వచ్చేసాయి.ఇక సర్దడం తరువాయి .రెండు రోజులు సెలవు పెట్టి సర్ధే పనిలో వుంది పల్లవి .రాములమ్మ కూడా సాయం చేస్తుంది .ఇంతలో పల్లవి తన పెళ్లి ఫోటో తగిలించాలని చూస్తుంది .రామయ్య మేకు కొట్టి ఇక్కడ తగిలించుకోండి అన్నాడు .మీ ఆయన బలే వున్నారు దిష్టి తగిలేలా వుంది అనింది రాములమ్మ .హా ఆయన లేరులే దిష్టి తగలడానికి అని నవ్వుతూ చెప్పింది పల్లవి . క్షమించండి అమ్మ అనింది రాములమ్మ .దేనికి రాములమ్మ ఆయన ప్రాణాలతో లేరు కానీ నా మనసులో ఆయన జ్ఞాపకాలు బోలెడన్ని వున్నాయి అనింది పల్లవి .మీది గట్టి గుండె పంతులమ్మ అన్నాడు రామయ్య .మీరు నన్ను పంతులమ్మ అనకండి నా పేరు పల్లవి ,నన్ను అండి గిండి అని అనొద్దు అని తన రూములోకి వెళ్ళింది పల్లవి .చూసారా బాబు గారు పెనిమిటి లేడని లోపల బాధ పడుతూ పైకి కనపడకుండా ఎలా నవ్వుతు చెప్పిందో .మనిషి అంటే అట్టా ఉండాలి అనింది రాములమ్మ .అవునే నువ్వెప్పుడూ అంటుంటావే మేము తక్కువొల్లం అని ,నువ్వెక్కడ తక్కువ దానివే మనిషి మనసు చదివే పెద్ద దానివి అన్నాడు రామయ్య .సరే సరే బాబు గారు మా ఆయన పొలం కాడ ఉన్నాడుగా ,పోయి అన్నం ఇచ్చి వస్తా అని వెళ్ళింది రాములమ్మ .రామయ్య కూడా కిందకి తన గదికి వెళ్లి తన భార్య ఫోటో చూసుకుంటూ మురిసిపోతున్నాడు తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ .
 
ఇక రోజూ పల్లవి ఆటోలో స్కూల్ కి వెళ్లి వస్తూ ఉండేది .ఆటో వాడికి కూడా ఆమె అంటే ఎంతో అభిమానం .పిల్లలకి ఏమైనా కొనుక్కెళ్ళు అని అప్పడప్పుడు ఎంతో కొంత ఇస్తుండేది .ఆమె, రామయ్య ఇంటినుండి రోడ్ మీద వరకు నడుచుకుంటు వెళ్లే దారిలో రచ్చబండ వుంది అక్క్కడ అన్ని వయసుల మగాళ్లు అన్ని రకాల మనుషులు వుండే వాళ్ళు .మొదట్లో ఆమెని చూసి ఎవరికీ వాళ్ళే ,అబ్బా ఎవరి తాలూకా ఈమె అంత బావుంది అనుకునే వాళ్ళు .ఆమె పట్నం లో చదువు చెప్పే పంతులమ్మ అంటా రామయ్య ఇంట్లో దిగింది మొగుడు లేదంట అని ఒకళ్ళు అంటే ,మా ఆవిడ ఊరెళ్ళింది మా ఇంట్లో ఉండమని చెప్పే వాడిని అంటూ ఎకిలి నవ్వులు నవ్వే వాళ్ళు కొంతమంది .మా ఇల్లు కాలిగా వుందే తెలిస్తే నేనే ఇచ్చే వాడిని అని కొందరు .మీరందరు ఇలాంటోళ్ళు అనే ప్రెసిడెంట్ గారు రామయ్య ఇల్లు చూపెట్టాడు అనేవాళ్ళు కొంత మంది .ఆమ్మో ప్రెసిడెంట్ గారు తాలుకాన ఈమె మనకెందుకులే అని చాలా వరకు చెడ్డ వారు ఆమెకి దూరంగా వుండే వారు మంచి వాళ్ళు ఆమెని ఆప్యాయం గ పిలిచే వాళ్ళు .మొత్తానికి ఆ ఊరి ఆడవాళ్ళలో ఆమె ఒక భాగం అయింది .ఇక అమ్మలక్కలు ఊరికే వుంటారా రామయ్య ఒంటరివాడు ఆమె ఒంటరిది తప్పేముంది అని సూటిపోటి మాటలు అనే ఒకరిద్దరు లేకపోలేదు .మంచి వాళ్ళు ఎవరైనా వింటే తన్నబోతారు కనుక ఏ జాతి పక్షులు మాటలు ఆ జాతికి అర్ధం అయ్యినట్టు ,చెడు మాటలు మాట్లాడే వాళ్ళు పుకార్లు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకోడమే కానీ బయట పడితే తంతారు అని తెలుసు వాళ్లకి .అందుకే పైకి మంచి వాళ్ళలా నటిస్తారు ఆమె ముందు .రాములమ్మ పొద్దున్నే వచ్చి అన్నం కూరలు చేసి టీచర్ కి ఇబ్బంది లేకుండా చూసుకునేది .కానీ సాయంత్రం ఇంటికొచ్చాక మాత్రం రామయ్య పొలం నుండి వచ్చాక ఆయనకీ తినడానికి ఏమైనా చేసేది పల్లవి .ఇంకా కాఫీ ఇద్దరు కలిసి కూర్చొని ఆరుబయటే తాగేవాళ్ళు .ఇంతలో రామయ్య అవును పంతులమ్మ, ఇంకోలా అనుకోకు నీ వయసు 30 ఆ అన్నాడు రామయ్య .పల్లవి నవ్వి ఆహా నేను 30 దానిలా ఉన్నానా అనింది పల్లవి .హా అలానే వున్నావు అనే కదా అడిగాను అన్నాడు రామయ్య .నాకు 30 అయితే మీకు 40 ఆ అనింది పల్లవి .రామయ్య సిగ్గుగా నవ్వుతున్నాడు మీసం తిప్పుకుంటూ .అబ్బో రామయ్య గారికి సిగ్గు ఎక్కువే అని నవ్వుతుంది పల్లవి .నాకు 38 అండి అనింది పల్లవి .మరి రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు మీ ఆయన మీద నెల రోజుల్లోనే అంత ప్రేమ ఎలా పెంచుకున్నారు ,భర్త ఉండగానే పరాయి మగాడితో చేసే వాళ్ళు కూడా వున్న రోజులు ఇవి అలాంటిది పెళ్లి అయి నెల తిరగక ముందే పోయిన భర్త జ్ఞాపకాలతో బతుకడం అంటే గొప్పోల్లె అన్నాడు రామయ్య .కాలం మహా చెడ్డది మంచి మనుషుల సంతోషం చూడలేదు అన్నాడు రామయ్య .ఇప్పటికి మించింది లేదులే నేను చేసేస్తా ఘనంగా నీ పెళ్లి అన్నాడు రామయ్య. పల్లవి నవ్వింది పెద్దగా .నాకు మళ్ళీ పెళ్లి చేసే ఉద్దెశం మీకున్న చేసుకునే ఉద్దెశం నాకులేదులెండి .రెండో పెళ్లి చేసుకొని కట్టుకున్న వాడితో సెకండ్ హ్యాండ్ అనిపించుకునే కన్నా వితంతువుగా ఉండడమే నయం అనింది పల్లవి .నిజమే పెళ్లి రెండో సారి వరకు బానే వుంటది కానీ మూడో సారి అంటే కుదరదు .రెండో సారి మంచి వాడు రాకపోతే అల్లాడే కన్నా ఇదే నయం లే అన్నాడు రామయ్య .
 
రోజు సాయంత్రం రామయ్య కూతురు ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడేది .అది చూసిన పల్లవి నాకు ఎవరు లేరులే అలా మాట్లాడే వాళ్ళు అనుకునేది ,అయినా అంత సేపు ఎం మాట్లాడుకుంటారో ఏంటో అబ్బా కూతుళ్లు అనుకునేది పల్లవి .ఒక రోజు పల్లవి ఆరుబయట కాసేపు కూర్చుందాం అని కిందకి వచ్చింది .రామయ్య కొడుకు వీడియొ కాల్ చేసి తిన్నావా అది ఇది అని అడుగుతుంటే పల్లవి అలానే కొంచెం దూరం గ కూర్చొని వింటూ ,రామయ్య ఫోన్ పెట్టేసాక రామయ్య దగ్గరకి వచ్చింది పల్లవి ,పర్లేదు కొడుకు కూతరుకి నీ ప్రేమ ఎక్కువే అనింది పల్లవి .హా ఎంత ప్రేమ వున్నా మన ముందు ఉండాలంటే కుదరదుగా అన్నాడు రామయ్య .నాకు ఆ బాధ లేదులే నాకు ఎవరు లేరు అలా మాట్లాడే వాళ్ళు మీ లాగా బెంగ పెట్టుకోడానికి అనింది పల్లవి .ఊరుకో పంతులమ్మ ఎందుకు అలా బాధపడుతావు నిజానికి మనం ఇద్దరం ఒకే కోవకి వస్తాము తెలుసా .నేను పిల్లలున్న అనాధని మీరు పిల్లలు లేని అనాధ అంతే అన్నాడు రామయ్య .అంత పెద్ద మాటలు ఎందుకు కానీ పదండి వెళ్లి తినేసి పనుకుందాం అనింది పల్లవి .అవును పంతులమ్మ రేపు ఆదివారం ఒక్క దానివే ఎం చేస్తావు చెప్పు మా అరటి తోట ఇంకా పిల్ల కాలువలు కొబ్బరి తోటల అందాలు బలే ఉంటాయి ,నీకు చూడాలని లేదా అన్నాడు రామయ్య .చూడాలనే వుంది కానీ ఎవరితో వెళ్ళను,తోటి ఉద్యోగులు ఇంకా సరీగా పరిచయం కాలేదు .కొంత సమయం పడుతుందిలే అనింది పల్లవి .ఎందుకు రాములమ్మ ఉందిగా తీసుకెళ్తుంది లే అన్నాడు రామయ్య .నిజమే నేను ఆలోచించనే లేదు .రామయ్య గారు,, ఈ గ్రామంలో అందరూ పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారా అనింది పల్లవి .చాలా మంది ప్రైవేటు బడులకు వెళ్తారు .ఇక కొంత మంది పిల్లలు చదువులు అబ్బక మానేసి పొలం పనులకి వెళ్తున్నారు అన్నాడు రామయ్య .అయ్యో పిల్లలు కూడానా అనింది పల్లవి .పంతులమ్మ నువ్వు ఏ కాలం లో వున్నావు .మన గురించి ఆలోచించే తీరికే లేదు ,వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తాం చెప్పు అన్నాడు రామయ్య .అయ్యో అలా కాదండి అనింది పల్లవి .మరి ఎలా కాదు ఒక పది మంది దాకా వుంటారు పిల్లలు నువ్వు చదివించగలవా .సరే ప్రభత్వ బడే అనుకుందాం ఆ పిల్లలు వెళ్ళాలి కదా ,ఆడుతూ పాడుతూ ఊరిలో పని చేస్కోడమె వాళ్లకి ఇష్టం అన్నాడు రామయ్య .రామయ్య మాటలకి నిరాశగా ముఖం పెట్టింది పల్లవి .హా సరే సరే ఆ పిల్లలని నేను చూపిస్తాలే రేపు వెళ్దాము సరేనా అన్నాడు రామయ్య .హా పెద్ద మనసే, ఊరిలో అనుకుంటుంటే ఏమో అనుకున్న అని నవ్వింది పల్లవి .మరేం అనుకున్నావ్ పంతులమ్మ, రామయ్య ఇక్కడ అంటూ మీసం తిప్పాడు రామయ్య .ప్రెసిడెంట్ మాట అయితే వింటారని ఆయనకి చెప్తే ,ప్రెసిడెంట్ పొలం పనికి వెళ్తున్న పిల్లలు, వాళ్ళ తల్లి తండ్రిని అందరిని పంచాయితీ దగ్గరకి పిలిచాడు .పంతులమ్మఅందరికి ప్రభుత్వ పథకాలు పిల్లలకి ఏమున్నాయో ,చదువుకునే వాళ్లకి మధ్యాహ్న భోజనము పథకం అన్ని వివరం గ చెప్పింది. ప్రెసిడెంట్ కూడా వాళ్ళకి ఇక నుండి పిల్లలని బడికి పంపించండి టీచర్ తో పాటు అని చెప్పారు.రోజు ఆటో లో ఒక్కటే వెళ్లే పంతులమ్మ ఇప్పుడు పిల్లలతో బడికి వెళ్తుంది .ఒక రోజు ఆదివారం రాములమ్మ పల్లవి ని తీసుకొని రామయ్య వాళ్ళ అరటి తోటకి తీసుకెళ్లింది .అక్కడ చిలకల రాగాలు పిల్ల కాల్వలు పంతులమ్మని చిన్న పిల్లని చేసేశాయి .పిల్ల కాలువ గట్టున కూర్చొని చీర మోకాలు వరకు లాక్కుని కాళ్ళు నీళ్లలో ఆడిస్తుంటే ఆమె గజ్జెలు చప్పుడు ఇంకా ఆమె పాదాలు బంగారం వలే మెరుస్తున్నాయి . పంతులమ్మ చిన్న పిల్లలా అలా నీళ్ళల్లో కాలు ఊపుతుంటే, అమ్మా మీరు ఇలానే నవ్వుతు ఉండాలి అనింది రాములమ్మ .రాములమ్మా థాంక్ యు అని వాటేసుకుంది పంతులమ్మ .అబ్బా వదలండి అమ్మ ఏంటిది అనింది రాములమ్మ .అదేంటి రాములమ్మ అలా సిగ్గు పడుతున్నావ్ అని నవ్వింది పల్లవి .ఏమో అమ్మ మీ పట్నం వాళ్ళు చిత్రమైన పనులు చేస్తారు అనింది రాములమ్మ .అదేమి లేదులే ఊరికే నన్ను ఆప్యాయంగా చూస్తున్నావ్ అని ప్రేమగా కౌగిలి ఇచ్చా అంతే అనింది పల్లవి . నాకెందుకు తెలీదు అమ్మ బలేటోళ్లే, మీరు సల్లగుండాలె అనింది రాములమ్మ .పల్లవి కి ఆ ఊరు ఇంకా కల్మషం లేని మనుషులు బాగా నచ్చారు .ఇక రామయ్య కి ఈమె కీ మధ్య బంధం ముడి ఎలా పడుతుందో చూడాలి .అదే జరిగితే పాపం ఊరిలో ఆమె మీద మనసు పడిన వారి గుండెలు ఏమైపోతాయో ఏమో .హ హ హ హ
 
ఇక సంక్రాంతి పండగ రానే వచ్చింది .రామయ్య కూతురు తన ఇద్దరు పిల్లలతో వచ్చింది .మనకెందుకులే అన్నట్టు సైలెంట్ గా వుంది పల్లవి .పండుగ సెలవులు కనుక పల్లవి రాములమ్మని వద్దు అని చెప్పి పొద్దునే స్నానం చేసి పూజ చేసుకొని గుడికి వెళ్ళింది పల్లవి .మెరిసే పట్టు చీరతో వాళ్ళ ఆయన ప్రేమగా కొనిచ్చిన హారం మెడకు తగిలించుకొని ఒక దేవతల కనిపించింది అందరికి .ఊళ్ళో ఆమెని అలా చూసి చూడ ముచ్చటగా వుంది అనుకునే వాళ్ళు కొందరు అయితే కుళ్లుతో మొగుడు లేదు కానీ సోకులకు ఏమి తక్కువ కాదు అని కొందరు ఏది ఏమైనా పైకి అందరూ బానే పలుకరిస్తారుగా ,పైగా ఆమె పెద్గగా ఎవరితో మాట్లాడదు ఆయే, కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా ఆమెకి తెలియదు తెలిసినా పట్టించుకోదు .ఎలా అయితే ఏమి ఊరంతా ఆమెని ఊరిలో ఒక ఆడబిడ్డ లా భావించారు .ప్రెసిడెంట్ గారి భార్య అయితే చాలా ఆప్యాయంగా ఉంటుంది పల్లవితో .కొంత సేపటికి రామయ్య తన కూతురు మనువాళ్ళతో వచ్చాడు .రామయ్య కూతురు, ఓ మీరు ముందే వచ్చేసారా చెప్పొచ్చు కదా మేము కూడా వచ్చే వాళ్ళం అనింది .పల్లవి నవ్వి సైలెంట్ గా వుంది .ఇక రామయ్య చిన్న మనవడిని పల్లవి ఎత్తుకుంది .గుడిలో వున్న ఆడోల్లు ఒకరి చెయ్యి ఒకళ్ళు నెట్టుకుంటూ అటు చూడు రామయ్య పంతులమ్మ మొగుడు పెళ్ళాం లా ఎంత బావున్నారో అని ఒకరు .చి ఆమె వయసెంత ఆయన వయసెంత అని కొందరు .ఇదంతా పల్లవి రామయ్య మనవడిని ఎత్తుకోడం, పక్క పక్కన నిల్చోడం, పైగా రామాయ్య కూతురు కూడా పక్కన ఉండడం నిజం గా చూడ ముచ్చటగానే వుంది .ఇక తిరిగి ఇంటికి వెళ్లే దాకా రామయ్య మనవడు పల్లవి సంక దిగలేదు .నువ్వు నాకేం అవుతావు అని అడిగాడు ఆ బుడ్డోడు .నేను టీచర్ ని అనింది పల్లవి .అంటే అందరిని కొడతావా అన్నాడు వాడు .కొడతా కానీ నీలాంటి మంచి పిల్లలని కొట్టాను అనింది పల్లవి .వాడు ముద్దు పెట్టాడు పల్లవి బుగ్గ మీద .రామయ్య కూతురు కి కొంచెం అనుమానం వచ్చి రాములమ్మని ఆరా తీసింది పంతులమ్మకి రామయ్యకి మధ్య చనువు ఉందా అని .మీరు అనుకున్నట్టు ఏమి లేదు తల్లి అనింది రాములమ్మ .సరే నేను మా నాన్నని అనుమానించినట్టు నువ్వు నోరు జారకు సరేనా అనింది రామయ్య కూతురు .రామయ్యతో తన కూతురు నాన్న, ఆమె చాలా మంచిదిలా వుంది కదా అనింది రామయ్య కూతురు .అవును రా ఆమె కట్టు బొట్టు నడవడిక మాటలు మంచితనం నీకు చెపుతూ ఉంటా కదా అన్నాడు రామయ్య .వయసులో చిన్నది అయినా నాకు అమ్మని చూసినట్టు వుంది నాన్న అనింది రామయ్య కూతురు .నిజానికి నాకు అలానే అనిపించింది .ఆమెకి పెళ్లిచేదాం అనుకున్న కానీ ఇష్టం లేదంట అన్నాడు రామయ్య .ఎవరో ఎందుకు నాన్న నువ్వే చేసుకో అనింది రామయ్య కూతురు .చి చి ఆమెని నేను ఎంతో పవిత్రం గా చూస్తున్న ,భార్య గా చూడలేను అన్నాడు రామయ్య .పైగా ఆమె వయసెక్కడ నా వయసెక్కడ అన్నాడు రామయ్య .మనసులు ఒక్కటి అయితే వయసులు ఏముంది అనింది రామయ్య కూతురు .నీ గురించి ఆలోచించే సమయం కూడా లేదు నాకు నా ఉద్యోగం ,అత్త మామల ఆరోగ్య సమస్యలు పిల్లలు ఇవన్నీ ఒక్క దానినే చూసుకుంటున్న నాన్న ,మీ మీద నాకు బెంగగా ఉంటుంది తిన్నారో లేదో అని .అందుకే నేను రాములమ్మని పెట్టింది అసలు .కానీ రాములమ్మ ఇంటి మనిషి కాదుగా అనింది రామయ్య కూతురు .బాగా ఆలోచించు నాన్న ,నీ ఇష్టం తన ఇష్టం ఇక అనింది రామయ్య కూతురు .ఏమో రా ఆమె మీద నాకు ఏదో అభిమానం అన్నాడు రామయ్య .ఇక నుండి నీతో పాటు ఆమెకి కూడా ఫోన్ ఇవ్వు ఆమె బాగోగులు చూడడానికి ఈ కూతురు వుంది. అని నవ్వుతు వెళ్ళింది రామయ్య కూతురు .రామయ్య ఎంతలా ఆలోచించినా పంతులమ్మని అలా ఊహించుకోలేక పోతున్నాడు .వెళ్తూ వెళ్తూ రామయ్య చిన్న మనవడు పల్లవి ని చూసి ,బాయ్ టీచర్ అన్నాడు .రామయ్య కూతురు వెనక్కి తిరిగి చూసి టీచర్ కాదురా అమ్మమ్మ అని పిలువు అనింది .వాడు బాయ్ అమ్మమ్మ అన్నాడు .వెళ్ళొస్తాను' మా 'అని కార్ ఎక్కింది రామయ్య కూతురు .పల్లవి అయోమయం లో వుంది ఏమి అర్ధం కాక ,ఈ అమ్మాయి ఏంటి అమ్మ అంటుంది సరేలే ఆమెకి నేను పెద్ద వయసు దానిలా కనిపించాను ఏమో అనుకుంది .మరుసటి రోజు స్కూల్ కి రెడీ అవుతున్న పల్లవి అద్దం ముంది నిల్చొని ముఖం తడుముకుంటుంది .ఏంటమ్మా అలా చూసుకుంటున్నారు అనింది రాములమ్మ . ఏమి లేదు రామయ్య గారు అమ్మాయి నిన్న వెళ్తూ బాయ్ అమ్మ అనింది .నేను అంత ముసలి దానిలా కనపడుతున్నానా అనింది పల్లవి .అలా అన్నారా మీరు ఆమెకి అక్కలా వుంటారు అలా ఎందుకు అనిందో కానీ అనింది రాములమ్మ .పొగిడింది చాల్లే కానీ అన్నం బాక్స్ లో పెట్టావా అనింది పల్లవి . ఈ మాత్రం దానికి నన్ను అడగడం ఎందుకో అయినా ఉన్న మాటే కదా అన్నాను గుండ్రంగా బానే వుంటారులే అని నవ్వింది రాములమ్మ .నిన్ను ............అని కొట్టబోయింది రాములమ్మని పల్లవి నవ్వుతూ .
 
సాయంత్రం రామయ్య కూతురు ఫోన్ చేసింది .రామయ్యతో మాట్లాడి అమ్మకి ఇవ్వు ఫోన్ అనింది .ఏయ్ అమ్మ ఏంటి అమ్మ ,తాను వింటే బాధ పడుతుంది అన్నాడు రామయ్య .సరే ఆమెకి ఫోన్ ఇవ్వు అనింది రామయ్య కూతురు .రామయ్య పంతులమ్మ అని పిలిచి ఫోన్ ఇచ్చాడు .ఎలా వున్నారు అనింది పల్లవి .బావున్నా'' మా'' అని, అమ్మమ్మకి హాయ్ చెప్పండి అని పిల్లలని చూపిస్తుంది వీడియొ కాల్ లో రామయ్య కూతురు .నేను అమ్మ లా ఉన్నానా నీకు, అనింది పల్లవి .ఏమో మిమ్మల్ని చూస్తే మా అమ్మని చూసినట్టే వుంది అనింది రామయ్య కూతురు .ఏయ్ ఏంటి ఎవరిని పడితే వాళ్ళని అనొచ్చా అన్నాడు రామయ్య .నిన్ను ఎవరు అనమన్నారు నేను అంటా. నీకేమైనా ఇబ్బందా పంతులమ్మ గారు అనింది రామయ్య కూతురు .పల్లవి నవ్వి సైలెంట్ గ వుంది .మా అమ్మ కూడా అంతే నవ్వుతోనే అంగీకారం చెప్తుంది అనింది రామయ్య కూతురు .పల్లవి పెద్దగా ఆలోచించలేదు దీని గురించి కానీ రామయ్యకి కొంచెం ఇబ్బందిగానే వుంది .మరుసటి రోజు స్కూల్ కి రెడీ అవుతూ ,రాములమ్మా మీ రామయ్య గారి ఆవిడ నా లా ఉంటుందా అనింది పల్లవి .ముఖం ఒక్కటే మార్పు కానీ లక్షణాలు అన్ని ఇంచుమించు అంతే అమ్మ ,కాకపోతే మీరు బిడియం లేకుండా నలుగురిలో తిరగగలరు ఆమె ఇంట్లోంచి బయటకి రాదూ అదొక్కటే తేడా అనింది రాములమ్మ .ఇంతకీ ఎందుకు అడిగారు అమ్మ అనింది రాములమ్మ .ఏమి లేదు రామయ్య వాళ్ళ అమ్మాయి నిన్న ఫోన్ లో నన్ను అమ్మ అంటెను అనింది పల్లవి .హా తప్పేముందిలే అమ్మ మీకు నలబై ఉంటాయా అనింది రాములమ్మ .ముప్పై తొమ్మిదే రాములమ్మ నువ్వు ఒకటి పెంచకు అని నవ్వింది పల్లవి .హా గుండ్రంగా తిరిగి అద్ధం ముందు చూసుకున్నది చాల్లే, నా దిస్తే తగిలేట్టు వుంది అని నవ్వింది రాములమ్మ .హ హ హ హ సరే సాయంత్రం నువ్వే దిష్టి తీదువులే అని బడికి వెళ్ళింది పల్లవి .ఓహో చిన్నమ్మ గారు రామయ్య బాబు గారిని పంతులమ్మని కలపాలని చూస్తున్నారా కానీ వయసు చాలా తేడా ఉంటుందే ,అయినా బాబుగారు కుర్రాడిలానే వుంటారు అనుకో ,సర్లే మనకెందుకు మనకి ఎం తెలియనట్టే ఉండాలి .ఇంటి గుట్టు బయట పెడితే ఎలా అని మనసులో అనుకుంది రాములమ్మ .రాములమ్మ కిందకి వెళ్లి రామయ్యతో ,అయ్యా పంతులమ్మ బలే మంచోళ్ళు కదా అనింది .హా అవును రాములమ్మ అందం అణుకువ నవ్వు ముఖం, మంచి మనసు కూడా అన్నాడు రామయ్య .అబ్బో కథల పుస్తకాలే అనుకున్న పంతులమ్మ గారిని కూడా చదివేసారే అనింది రాములమ్మ .రామయ్య నవ్వాడు .సరే బాబు గారు నేను వెళ్తున్న అని నవ్వుకుంటూ వెళ్తుంది రాములమ్మ .బాబు గారి మనసు లో పంతులమ్మ ఫోటో అయితే పడింది .మరి పంతులమ్మ మనసు లో బాబు గారి ఫోటో పడిందో లేదో సాయంత్రం పంతులమ్మ వచ్చాక మాటల్లో పెట్టి కనుక్కోవాలి అని ఆలోచిస్తుంది రాములమ్మ .
 
సాయంత్రం పల్లవి ఇంటికి వచ్చిన రాములమ్మ ,అమ్మా మా అయ్య గారు బలే మంచోళ్ళు కదా అనింది రాములమ్మ .ఏ..... మీ అయ్య గారి గురించి నీకు తెలియదా అనింది పల్లవి .(ఆమ్మో పంతులమ్మ మామూలు మనిషి కాదు తెలివైనదే అనుకుంది రాములమ్మ ).హా అది కాదమ్మా ఊరికే అడుగుతున్న దాదాపు సంవత్సరం అవుతుంది మీరు వచ్చి, మా అయ్య గారు గురించి ఏమనుకుంటున్నారా అని అని అనింది రాములమ్మ .అనుకోడానికి ఏముంది మీరు అనుకునేదే మంచి మనిషి సరదా మనిషి ఇక కొత్తగా నేను చెప్పడానికి ఏముంది అనింది పల్లవి .(ఆమ్మో ఈమె ఒకవేళ లోపల వున్నా బయట పడను కాక పడదు ఎంత తెలివి ,,నేనేమైన అనుకుంటా అని కాబోలు అనుకుంది రాములమ్మ ).సరే కానీ మీ అయ్య గారు రోజు కాలునొప్పి అంటున్నారు గ ,ఈ ఆయింట్మెంట్ తీసుకెళ్లి రాయి కొంచెం అనింది పల్లవి .లేదమ్మా నేను ఇంట్లో వంట చేయకుండా వచ్చా అదేదో మీరే రాయండి అనింది రాములమ్మ .ఓయ్ రాములమ్మ ఇదిగో వుండు కనీసం ఇచ్చేసి అయినా వెళ్ళు అని పల్లవి అంటుంటే ఇప్పటికే ఆలస్యం అయిందమ్మా ఏమనుకోకండి మా ఆయనని ఆకలేస్తుంటది వెళ్లి వంట చేసుకోవాలి అని వెళ్ళిపోయింది రాములమ్మ .ఇప్పుడెలా అని సంకోచిస్తూ ,రామయ్య గారు ఇదిగోండి ఆయింట్మెంట్ అనింది పల్లవి .అక్కడ పెట్టు పంతులమ్మ నేను తర్వాత రాసుకుంటాలే అన్నాడు రామయ్య .హా బలే రాసుకుంటారులే మీరు ఇక పక్కన పడేస్తారు అయినా మోకాలు నొప్పి అంటూ ఆ పొలం లో తిరగకపోతే ఏం ఇంకా ఎంత సంపాదించాలో అనింది పల్లవి .ఓపిక ఉన్నంత వరకు అన్నాడు రామయ్య .మీకు తోడు కూడా ఎవరు లేరు జాగ్రత్త ,డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యం అంటూ ఆయింట్మెంట్ తీసి రామయ్య మోకాలికి రాస్తుంది పల్లవి .అయ్యో పంతులమ్మ మీకెందుకు శ్రమ నేను రాసుకుంటా అన్నాడు రామయ్య .ఏమి కాదులే పెద్దవారేగా మీరు మీరేమైనా ఇంకా వయసులో వున్నారా ఏంటి అనింది పల్లవి .ఇదిగో పంతులమ్మ నాకు మొన్ననే యాభై ధాటి యాభై ఒకటిలో అడుగు పెట్ట అన్నాడు రామయ్య .హా అవునా నేనింకా మొన్ననే ఇరవై వచ్చాయి అనుకున్నానే అని నవ్వింది పల్లవి .నవ్వితే బావుంటావ్ పంతులమ్మ నువ్వు ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి అన్నాడు రామయ్య .నేను ఒక్క దానినే కాదు మీరు కూడా మీ పిల్లలకి దూరం అయిన దిగులు నుండి బయటకు రండి .అవును మీరు నాకో సాయం చేయాలి నేను కార్ కొనుక్కుందాం అనుకుంటున్నా మరీ అంత పెద్దది వద్దు అంత చిన్నది వద్దు నాకు వాటి గురించి అంతగా తెలియదు ,మొన్న మీ అమ్మాయి వచ్చిన కారు నాకు నచ్చింది అది ఎంత ఉంటుంది అనింది పల్లవి .ఒక తొమ్మిది లక్షల దాకా ఉండొచ్చు అన్నాడు రామయ్య .సరే అయితే అదే తీసుకుందాం అనింది పల్లవి .మొత్తం కట్టేస్తావా అన్నాడు రామయ్య. లేదు EMI లో తీసుకుంటా ఎలాగో టాక్స్ కట్టడం ఎందుకు ఊరికే అదేదో కార్ అయిన లోన్ తీసుకుంటే బావుంటుంది అని అనింది పల్లవి .అవును పంతులమ్మ ,,,,,నీ జీతం సగం EMI కే పోతుందిగా అన్నాడు రామయ్య .హా పోనివ్వండి నేను ఒక్క దాన్నే కదా నాకు ఖర్చులు ఏమి లావుగా అనింది పల్లవి .అవును పంతులమ్మ ఇంతకీ నీకు కార్ తోలడం వచ్చా అన్నాడు రామయ్య .హా పెళ్లి అయిన కొత్తలో మా ఆయన నేర్పించారులే ,తర్వాత చాలా సార్లు అన్నయది నడిపేదాన్ని అనింది పల్లవి .అవును మీ అన్నయ్య నిన్ను పట్టించుకోడా అన్నాడు రామయ్య .పట్టించుకునేవారు కానీ మా వదిన అంటే భయం .నేనేదో ఉద్యోగం చేయబట్టి నా కాళ్ళ మీద నేను నిలబడబట్టి కానీ లేదంటే ఎప్పుడో నాకు ఇష్టం లేని ఇంకో పెళ్లి చేసేసేవాళ్ళు అనింది పల్లవి .నిజమే పంతులమ్మ ఆడది ఎవరి దయా దాక్షణ్యాలతో బతక కూడదు అన్నాడు రామయ్య .మీ అమ్మాయి ఒక పక్క జాబ్ ,పిల్లలు ,ఇంకా వాళ్ళ అత్త మామలకి ఆరోగ్య సమస్యలు అంట కదా ఇవన్నీ ఎలా నెట్టుకొస్తుందో అని అనింది పల్లవి .రామయ్య కూతురు అంటే ఏమనుకున్నావ్ మరి దానిని నా భుజాలపై ఎత్తుకొని తిప్పా .చిన్నప్పుడు అది కాళ్లతో నా గుండెల పై ఎక్కి తొక్కేది. ఎవరూ వేలెత్తి చుపియకుండా పద్ధతిగా పెంచా గారాబంగా ,నేనే ఆశ్చర్యపోయా ,మా ఇంట్లో ఒక్క పనీ చేయదు పెళ్లి అయ్యాక ఇంత ఓపిక ఎలా వచ్చిందో సంసారం ఇంత బాగా ఎలా నెట్టుకొస్తుందో అని నేనే ఆశ్చర్యపోయా అన్నాడు రామయ్య .ఆడదాని బాధ్యత అంటే అంతే ,తల్లి తండ్రి దగ్గర గారాబం ,అత్త గారి ఇంటికి వెళ్ళాక బాధ్యత తప్పదు అనింది పల్లవి .అవునూ మీ అత్త మామలు పట్టించుకోలేదా నిన్ను తర్వాత అన్నాడు రామయ్య .వాళ్ళు నన్ను కాదని కూతురు దగ్గరకి వెళ్లారు .సరే నేనేం పాపం చేసానో దేవుడు నాకు అందరిని దూరం చేసాడు అని కళ్ళలో నీళ్లు తిరుగుతున్న నవ్వుతు మాట్లాడుతుంది పల్లవి .ఇదిగో అమ్మాయి ఇదేం బాలేదు నట్టింట్లో ఆడపిల్ల ఏడవకూడదు .నీకు మేము ,ఈ ఊరు లేదా ఎందుకు ఏడుపు, ఇంకెప్పుడు ఏడవకూడదు నువ్వు ఇలా ఏడిస్తే నేనేదో చేసాను అనుకుంటారు అమ్మాయ్ అన్నాడు రామయ్య నవ్వుతూ ,చి చాల్లే ఆపండి మీ గురించి తెలిసి బుద్ధున్న వాళ్లెవరు అలా అనుకోరు అనింది పల్లవి. .
 
ఇక సాయంత్రం రామయ్య కూతురుతో మాట్లాడుతూ పంతులమ్మకి నీ కార్ నచ్చింది అట అలాంటిదే కావాలట అన్నాడు రామయ్య .ఏంటి ఆమె కారు కూడా నడుపుతుందా అనింది రామయ్య కూతురు ఆశ్చర్యంగా . హా నడుపుతుంది అట నాకు ఈ మధ్యనే తెలిసింది అన్నాడు రామయ్య .వావ్ సూపర్ మామ్ అయితే అనింది రామయ్య కూతురు .ఆమెకి ఇవ్వు నేను మాట్లాడుతా అనింది .పంతులమ్మ పంతులమ్మ ఇదిగో మా అమ్మాయి ఫోన్ అన్నాడు రామయ్య .పల్లవి ఫోన్ తీసుకుంది హాయ్ నానా బావున్నావా అనింది .హా '' మా '' కార్ కావాలి అన్నావు అట కదా ,నేను కొనిస్తాలే కాదనకు అనింది రామయ్య కూతురు .అయ్యో లేదు లేదు నేను కొనుక్కుంటేనే నాకు తృప్తి అనింది పల్లవి .రామయ్య కూతురుకి బాగా తెలుసు ఈమె గట్టి మనిషే ఈమెకి దేని మీద ఆశ ఉండదు అని అందుకే తన నాన్న కి ఈమె మంచి జోడి అనుకుంది .ఇక పల్లవి ఎలాగో వినదు కనుక సరే నీ ఇష్టం మా అనింది రామయ్య కూతురు .పల్లవి వెళ్లి ప్రెసిడెంట్ గారు ఇంకా వాళ్ళ భార్యని రమ్మని చెప్పడం తో మన కార్లోనే వెళదాం షోరూం కి అన్నాడు ప్రెసిడెంట్ .ఇక కారులో రామయ్య, ప్రెసిడెంట్ ,ముందు కూర్చుంటే ,పల్లవి ,ప్రెసిడెంట్ గారి భార్య వెనెక కూర్చున్నారు .షో రూమ్ కి వెళ్లి కార్ చూసిన పల్లవి పన్నెండు లక్షలలో కార్ తీసుకుంది .ప్రెసిడెంట్ భార్యని ఎదురు రమ్మని చెప్పింది పల్లవి .పల్లవి కార్ స్టార్ట్ చేసి ఇక ప్రెసిడెంట్ గారి భార్యని పక్కన కూర్చోబెట్టుకొని ,రామయ్యని ఇంకా ప్రెసిడెంట్ గారిని వెనక కూర్చోమంది .ఆమ్మో పల్లవి నాకు భయమేస్తుంది నీకు నిజంగా కారు వచ్చా అని భయం గ అడిగింది ప్రెసిడెంట్ భార్య .నాకు అదే భయంగా ఉందమ్మా అన్నాడు ప్రెసిడెంట్ .పల్లవి పెద్దగా నవ్వి హ హ హ హ నాకు బానే వచ్చులే మీరు కంగారు పడకండి అని కారు రోడ్ ఎక్కించి వేగం గా బానే నడుపుతుంది .పంతులమ్మ మామూలుది కాదు అన్నాడు రామయ్య .ఎంత ముచ్చటేస్తుందో నిన్ను చూస్తే నా బంగారు తల్లి అనింది ప్రెసిడెంట్ భార్య .ఏవండీ ఇక నుండి గుడికి తీసుకెళ్లమని మిమ్మల్ని విసిగించనులే అనింది ప్రెసిడెంట్ భార్య .హా అవును అవును పంతులమ్మ బడికి వెళ్లడం మానేసి నిన్ను గుళ్ళకి తిప్పుతుంది అని నవ్వాడు ప్రెసిడెంట్ .అబ్బా ఆంటీ మీరేం పట్టించుకోకండి ప్రతి ఆదివారం మీరు ఎక్కడికి అంటే అక్కడికే అనింది పల్లవి .సరిపోయింది పో ఇద్దరికి అని సైలెంట్ అయిపోయాడు ప్రెసిడెంట్ .ఇక గుడికి వెళ్లి పూజ చేయించుకున్నారు .పంతులు గారు దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు పల్లవి ని ఇక పల్లవి మూడ్ అంతా పాడైపోయింది .అయ్యో పంతులు గారు దీర్గాయుష్మాన్ భవ అనండి అనింది ప్రెసిడెంట్ భార్య .ఇంతలో ఎవరో స్వామీజీ వచ్చి లేదు త్వరలో అంగరంగ వైభవం గ పెళ్లి జరగబోతుంది పదండి ఇక అన్నాడు .అది విని పల్లవి మూడ్ అంతా పాడైపోవడంతో ,,ఇలా ఇవ్వు రా ఆయన మాటలేం పట్టించుకోకు అని పల్లవి దగ్గర కార్ తాళాలు తీసుకొని ప్రెసిడెంట్ గారే నడుపుతున్నారు .ప్రెసిడెంట్ గారి భార్య నాకెందుకో పల్లవికి పెళ్లి జరుగుతుందేమో అనిపిస్తుంది అండి ఆయన చెప్తే జరుగుతుంది అనింది .నోరు ముయ్యవే ఇంకా ఏ కాలం లో వున్నావు ఒక పక్కా ఆ పిల్ల నాకు పెళ్లి వద్దు మొర్రో అంటుంటే నువ్వు పెళ్లి అంటావు అన్నాడు ప్రెసిడెంట్ .అయ్యో ప్లీజ్ మీరెందుకు గొడవ పడుతున్నారు అనింది పల్లవి .నలుగురు ఒక రెస్టారెంట్ కి వెళ్లి కబుర్లు చెప్పుకుంటూ హాయిగా తినేసి నవ్వుకుంటూ ఇంటికి పయనమయ్యారు .ఈ సారి పంతులమ్మే నడిపింది కారు .ఆ ఊరిలో కారు నడిపే ఆడోల్లు ఇద్దరే రామయ్య కూతురు ,పల్లవి పంతులమ్మ .ఆమ్మో ఏమో అనుకున్న చాలా త్వరగా తీసుకొచ్చావు ఇంటికి అనింది ప్రెసిడెంట్ భార్య .ఇదిగో అమ్మాయి పల్లవి స్కూల్ కి కార్ లోనే వెళ్తావా అన్నాడు ప్రెసిడెంట్ .లేదు లేదు ఇది ఊరికే సెలవులలో బయటకి వెళ్ళడానికి అనింది పల్లవి .ఈ మాత్రం దానికి కారు ఎందుకు ,నా కూలింగ్ కళ్లద్దాలు ఇలా తీసుకు రావే అన్నాడు ప్రెసిడెంట్ ఆమె భార్యని .ఆమె తెచ్చి ఇచ్చింది .ప్రెసిడెంట్ అవి పల్లవి కళ్ళకి పెట్టి ,ఇప్పుడు ఇప్పుడు కల వచ్చింది ..చూడవే పంతులమ్మ ఎలా ఉందొ ఇప్పుడు అన్నాడు ప్రెసిడెంట్ తన భార్యతో ..నా దిష్టే తగిలేలా ఉందండి అనింది ప్రెసిడెంట్ భార్య .నిజానికి ఆ కళ్లద్దాలు ప్రెసిడెంట్ కూతురు అమెరికా నుండి తెచ్చింది .ప్రెసిడెంట్ ఎలాగో వాడడు కనుక పల్లవి కి ఇచ్చాడు .ఆ కూతురు నాకిచ్చింది ఈ కూతురు లాంటి పిల్లకి ఇచ్చా అన్నాడు ప్రెసిడెంట్ .ప్రెసిడెంట్ కూతురు అమెరికా వెళ్లి పదేళ్లు అయింది ఫోన్లో మాట్లాడుకోడమే కానీ ఇంటికి రాలేదు అసలు .అందుకే కాబోలు పంతులమ్మని కూతురు లా అనుకున్నాడు .రోజు అప్పలమ్మలాగా కనపడే పంతులమ్మ కూలింగ్ అద్దాలతో కారు దిగుతుంటే కొందరి కళ్ళు మంటలెక్కాయ్ .కొందరి కళ్ళు మాత్రం కళకళలాడాయి .ఎవరో కాదు మా ఊళ్ళో వుండే పంతులమ్మే ఎంత అందంగా వుంది కళ్ళద్దాలతో అని ఆనంద పడ్డారు ఆమెని అభిమానించే వాళ్ళు.పైకి సింపుల్ గా కనపడుతుందే కానీ ఆమె కారు దిగే పద్ధతి అది అసలు పెద్ద ఆఫీసరు లా కనపడింది అందరికి అసలు .ఇదిలా ఉంటే ఊరంతా పంతులమ్మ కారు బలే వుంది ప్రెసిడెంట్ భార్య గొప్పలు చెప్పుకుంటుంది ఆమెని తీసుకెళ్లింది కొనేప్పుడు అని ఊళ్ళో అప్పలమ్మలు చెప్పుకుంటూ ,హా ఆమెకేమీ ఏమైనా కొంటుంది ఒక్కతే కదా మొగుడా పిల్లలా అని గుసగుసలాడేవాళ్లు వున్నారు .ఎదరుగా అంటే ఊళ్ళో తంతారు అని తెలుసు కనుక దొంగ చాటు గుసగుసలాడడం సహజమే .
 
పల్లవి ఇంటికెళ్లి, తన అన్నయ్యకి కార్ కొన్నాను అని చెప్పడానికి ఫోన్ చేసింది .కానీ తన అన్నయ మాత్రం నేను రేపు మాట్లాడుతాను అన్నాడు .ఎందుకు అన్నయకి వదిన అంటే ఇంత భయం ,నేనేమి అన్నయ కి చెల్లిని కాదా అనుకుంటూ దిగాలుగా కూర్చుంది .అయినా నా పిచ్చి కానీ అసలు ఫోన్ చేయడమే దండగ ,ఉండి ఉండలేక ఫోన్ చేస్తే ఇప్పుడు చూడు ఏమైందో అని ఆలోచిస్తూ డాబా మీద వుంది .రామయ్య పంచ ఊపుకుంటూ స్టైల్ గా సిగెరెట్ వెలిగించి, కూని రాగాలు తీస్తూ అటు చూస్తే పంతులమ్మ వుంది .ఏంటో ఈ రోజు అంత హుషారు అనింది పల్లవి .అదేం లేదు రోజు అంతే ,ఆ చుక్కలు ఆ చందమామ వున్నాడు చూసావా నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇక ఈ సిగెరెట్ వుంది చూసావా ఈ పొగలోంచి కాసేపు మా ఆవిడ జ్ఞాపకాలు అలా బయటకి పంపిస్తుంటా కానీ అవి మల్లి గాలితో పాటే లోనికి వచేస్తుంటాయ్ అన్నాడు రామయ్య .పర్లేదు యాభై ఏళ్ళు వచ్చినా జ్ఞాపకాలు పదిలంగా వున్నాయి అన్నమాట అనింది పల్లవి .అవును కాసేపు బయట తిరగొచ్చు కదా అనింది పల్లవి .ఎందుకు ఆ రచ్చబండ దగ్గరకి పోతే వాడి పెళ్ళాం ఇట్టా వీడి కోడలు ఇట్టా అని కారు కూతలు కూసే వాళ్ళు వుంటారు నాకు నచ్చదు అలా అన్నాడు రామయ్య .ఓ మన టైపు ఏ నా అనింది పల్లవి . రోజుకి ఎన్ని కాలుస్తారు ఏంటి అనింది పల్లవి .ఒక అయిదు వరకు అన్నాడు రామయ్య .ఇక నుండి ఒక్కటే అది కూడా సాయంత్రం లేదంటే నా మీద ఓట్టే అనింది పల్లవి . చి చి చి నీ మీద ఒట్టు ఏంటి నీ దుంప తెగ నేనేం అన్యాయం చేసాను అని ఇప్పుడు ,ఇలా పగ పెట్టావు అన్నాడు రామయ్య .పల్లవి నవ్వుతు అబ్బో నీ ఆరోగ్యం కోసం చెప్తే పగ పట్టడమా అనింది పల్లవి .ఇదిగో నేను ఇక సిగరెట్ తాగను కానీ నువ్వు ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టు అన్నాడు రామయ్య .నేను పెట్టనుగా నాకు మీ మీద నమ్మకం లేదుగా అని నవ్వుతుంది పల్లవి .అయ్యో పెద్ద చిక్కొచ్చి పడిందే ఇప్పుడు అన్నాడు రామయ్య .సరే నాకు ఈ సెగరెట్ వద్దు ఏమొద్దులే అని ప్యాకెట్ విసిరేసాడు రామయ్య .ఓ కిందకి వెళ్ళాక తీసుకుందాం అనా అనింది పల్లవి . అలా చూడు పంతులమ్మ కాలువలో పడ్డాయి నీకు నా మీద అస్సలు నమ్మకం లేకుండా పోతుంది అన్నాడు రామయ్య .నాకు నమ్మకం లేకుంటే అసలు మగాళ్లతో ఎందుకు మాట్లాడతాను అనింది పల్లవి .సరే కానీ ముఖం ఏంటి వాడిపోయింది మీ అన్న ఫోన్ ఎత్తలేదా అన్నాడు రామయ్య .మీకెలా తెలుసు అనింది పల్లవి .విన్నానులే హలొ అన్నయ అనడం అని అన్నాడు రామయ్య .హా రేపు చేస్తా అన్నారు లే అనింది పల్లవి .ఇప్పుడేంటి నీకు కారు కొన్న సంతోషం లేదు అంతే కదా ,నువ్వు రేపు సెలవు పెట్టు చెప్తా అన్నాడు రామయ్య .సెలవునా ఎందుకు అనింది పల్లవి .నువ్వు సెలవు పెట్టు పంతులమ్మ నేను చెప్తా కదా ఎందుకో అన్నాడు రామయ్య .రాములమ్మ రాములమ్మ అని కేక పెట్టాడు రామయ్య .బాబు చెప్పండి అనింది రాములమ్మ .పంతులమ్మ ని తీసుకొని పక్క ఊరు జాతరకు పోయి వద్దామా అన్నాడు రామయ్య .మీ మధ్యలో నేనెందుకండి బాబు గారు అని సిగ్గు పడుతుంది రాములమ్మ .మా ఇద్దరి మధ్యలో ఉండడానికే తీసుకెళ్తుంది నిన్ను అన్నాడు రామయ్య .పల్లవి నవ్వుకుంటుంది .అర్ధం అయ్యింది బాబు గారు ఊర్లో అమ్మలక్కలకి భయపడేగా ఇదంతా ,పదండి తప్పుతుందా అనింది రాములమ్మ .పల్లవి పక్కన రామయ్య కూర్చున్నాడు వెనక రాములమ్మ కూర్చుంది .అమ్మ గారు మలుపులున్నాయి కూసింత సిన్నగ పోనీయండమ్మా అనింది రాములమ్మ .రామయ్య నవ్వుతు ఇదేం చూసావు నువ్వు అసలు మొన్న కార్ కొన్న రోజు తోలింది ,నేను కూడా అలా తోలలేదు తెలుసా అన్నాడు రామయ్య .ఊరికే పంతులమ్మ అయిపోతుందేటి మరి అని అనింది రాములమ్మ .జాతర లో విన్యాసాలు అన్ని చూస్తూ వున్నా పల్లవిని రామయ్య రమ్మని పిలిచి పల్లవి వద్దు అని అనిన కూడా వినకుండా జెయింట్ మిల్ ఎక్కించాడు రామయ్య .పల్లవి కి కాసేపు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి .గారాబం గ పెంచిన తండ్రి బుజం ఎక్కి జాతర చూసిన జ్ఞాపకం గుర్తొచ్చింది .జ్ఞాపకం తీపి గా వున్నా ,ఆయన లేరు అనే భాధ చేదునే మిగుల్చుతుంది .ఇక వెళదాం పదండి అనింది పల్లవి .అయ్యో ఇప్పుడేం అయింది ఎందుకు అలా వున్నావు అన్నాడు రామయ్య .ఏమి లేదు ఇదిగో తాళం కారు తీయండి అనింది రామయ్యని .రామయ్య కారు తీస్తున్నాడు .అమ్మా ఏమైంది అమ్మా అనింది రాములమ్మ .పల్లవి గట్టిగా వాటేసుకొని ఏడుస్తుంది .రామయ్య వచ్చి సైలెంట్ గా నిల్చున్నాడు .బాబు గారు ఏమైందో అడగకుండా అలా చూతారేంటి అనింది రాములమ్మ .హా ఏడవనివ్వు చాలా రోజుల నుండి గుండెలో దాచుకున్న బాధ కదా ఏడిస్తేనే కుదుట పడుతుంది అన్నాడు రామయ్య ,పల్లవి రాములమ్మని వాటేసుకుంటే రాములమ్మకు తన సొంత మనిషిలా కనిపించింది పల్లవి .అమ్మా ఊరుకోండి ఏంటి చిన్న పిల్లలా అని పైట కొంగుతో రాములమ్మ పల్లవి కళ్ళు తుడిచింది .మా నాన్న గుర్తొచ్చారు అనింది పల్లవి .హా అలా అయితే మా నాన్న రోజూ గుర్తొస్తాడు నాకు అన్నాడు రామయ్య ..ఇదిగో ఈ పీచుమిఠాయి తిను చిన్న పిల్లలా అన్నాడు రామయ్య అప్పుడు కొంచెం నవ్వింది మెల్లిగా పల్లవి .ఈ పిల్ల సమాజం లో ఎలా బతుకుతుందో ఏంటో అంటూ కార్ పోనించాడు రామయ్య .ఇదిగో అమ్మాయి నువ్వు ఇలా ఉంటే కుదరదు. జ్ఞాపకాలు అన్ని మరిచిపోయి ఏ రోజు కి ఆరోజే కొత్త జ్ఞాపకాలు తెచ్చుకోవాలి అలా అయితేనే బతకగలం .అన్నాడు రామయ్య .బోరున ఏడుస్తుంటే నాకు కాలు చెయ్యి ఆడలేదు అమ్మ ఇంకెప్పుడు ఆలా ఏడవకండి నా మనసు కూడా బాగోదు మీరు బాధ పడితే అనింది రాములమ్మ .హా నీకు రాములమ్మ వుంది నేనున్నాను ఇంకా మా అమ్మాయి మేమంతా లేమా అన్నాడు రామయ్య .ఇంకా ప్రెసిడెంట్ గారు అయితే వాళ్ళ అమ్మాయిల అనుకున్తున్నాడు నిన్ను అన్నాడు రామయ్య .
 
అదుగో ఇదుగో అనేలోపు వేసవి సెలవులు వచ్చేసాయి .పంతులమ్మ తన అన్నయ ఇంటికి వెళ్ళాలి అనుకుంది .అది రామయ్యతో చెప్తే రామయ్య ,లేదు లేదు నేను ఒక్కదానిని పంపీయను ఎలాగో హైదరాబాద్ అంటున్నవ్ గ మా అమ్మాయి ఇంటికి వెళదాం .తర్వాత మా అమ్మాయితో పాటు వెల్దువు అన్నాడు రామయ్య .అయ్యో తనకి ఎందుకు ఇబ్బంది అనింది పల్లవి .హా చాల్లే పైకి గంభీరంగా బానే నటిస్తున్నావ్ కానీ ఊరికే ఏడుస్తావ్ నా మాట విను అక్కడ మీ వదిన ఏమైనా అంటే ఎలా అన్నాడు రామయ్య .సరే సరే అనింది పల్లవి .కారులో వెళ్తున్నారు రామయ్య పల్లవి .పంతులమ్మ కాసేపు నేను నడపనా కారు అన్నాడు రామయ్య .ఎందుకు రేపటికి చేరుకోడానికా అని నవ్వింది స్నేహా .హా నువ్వు అంటే కుర్ర పిల్లవి కనుక స్పీడ్ గ నడుపుతావు ఆ మాత్రం దానికే అంత హేళన చేయాలనా నన్ను అన్నాడు రామయ్య .రామయ్య కూతురు ((హానీ ))ఇంటికి వెళ్లి స్నేహ కారు దిగుతుంటే రామయ్య చిన్న మనవడు వావ్ అమ్మమ్మ సూపర్ కార్ అన్నాడు .రామయ్య మనవడు అమ్మా ఇది మనదేనా అన్నాడు రామయ్య హానీ తో .మనది కాదు నానా అమ్మమ్మది అనింది హానీ .ఇంతలో పల్లవి రామయ్య మనవడిని ఎత్తుకొని ఇది నీదే నాని అనింది .హా నాకు ఇంత పెద్ద కారు ఎందుకు ఆడుకోడానికి బుల్లి కారు కోనివ్వు చాలు అన్నాడు వాడు .బుల్లి కారు కొనిస్త కానీ నువ్వు బాగా చదువుకొని మంచి స్థాయిలోకి వచ్చి దీని కంటే పెద్ద కారు కొంటా అని చెప్పు నీకు బోలెడన్ని బొమ్మలు కొనిస్త అనింది పల్లవి .హూ అంతేనా.... మా మంచి అమ్మమ్మ అలాగే నేను బాగా చదువుకొని పెద్ద కారు కొనుకుంటా అన్నాడు వాడు .ఎంతైనా టీచర్ కదా మంత్రం బానే వేస్తుంది అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటుంది హానీ .ఇంతలో హానీ భర్త వచ్చాడు .బావున్నారా అత్తయ్య అన్నాడు .((పల్లవి కొంచెం షాక్ అయింది కానీ ,ఏమోలే ,హానీ అమ్మ అంటుందిగా అనుకోని అనుకుంది ,)) అత్తయ్య కాదు అక్క అని పిలువు అనింది పల్లవి నవ్వుతు .హా ఆయనకీ అక్క సరే కానీ నేను మాత్రం ''మా'' అనే పిలుస్త అనింది హానీ .అలాగే నానా అనింది పల్లవి .ఇక మరుసటి రోజు హానీ ఇంకా పల్లవి కలిసి పల్లవి వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్లారు .హా పెద్ద ఇల్లే బాగా వున్న వాళ్లేనా మీ అన్నయ వాళ్ళు అనింది హానీ .హా నా పేరు మీద కూడా సిటీ లో మూడు సైట్ లు వున్నాయ్ తెలుసా అనింది పల్లవి .ఓ మీ నాన్న వాళ్ళు ఇచ్చారా అనింది హానీ .హా అవును అనింది పల్లవి .ఏమో అనుకున్న పైకి సింపుల్ గా ఉంటావు కానీ ,నువ్వు కూడా రిచ్ ఏ అనింది హానీ .బెల్ కొడితే పల్లవి వాళ్ళ వదిన ((రేఖా)) తలుపు తీసి ఏవండీ మీ చెల్లి వచ్చింది అంటూ చిరాకుగా లోనికి వెళ్ళింది .ఆమె ఏంటి అలా వెళ్తుంది అనింది హానీ .ఏం లేదు వాళ్ళ తమ్ముడిని నాకు రెండో పెళ్లి చేసి అంటగట్టాలని చూసింది వాడొక సోంబేరి ఇంకా మా అన్నయ ఇంట్లో కూర్చొని తింటాడు వాళ్ళ అక్క ని అడ్డు పెట్టుకొని నేను వాడిని రెండో పెళ్లి చేసుకోను అన్నాను అని కోపం అనింది పల్లవి .పల్లవి వాళ్ళ అన్నయ్యతో తన భార్య రేఖా ,, చెల్లెలు వచ్చింది కదా అని ఊరికే కబుర్లు చెప్పకుండా ఏంటో కనుక్కొని పంపించండి అనింది .హా పోక ఉంటామా ఏంది అనింది హనీ .ఓయ్ ఎవరు నువ్వు మధ్యలో దూరుతున్నావ్ అనింది రేఖ .ఏయ్ హనీ నువ్వు ఊరుకో అనింది పల్లవి .పల్లవి ఒక పది నిమిషాలు తన అన్నతో మాట్లాడి బయటకి వచ్చేసింది .ఇంతలో పల్లవి వదిన వాళ్ళ తమ్ముడు((శీను)) ఎదురయ్యాడు. ఏం పల్లవి ఇంకా పెళ్లి చేసుకోలేదు అంట నువ్వు ఓకే అంటే ఇప్పుడైనా నేను రెడీ అన్నాడు శీను .చెప్పు తెగుతాది ఇది మా అమ్మ ఇక మూసుకొని పో అనింది హానీ .హవ్వ పెళ్లి చేసేస్కున్నావా మీ అన్నకి కూడా తెలియకుండా అన్నాడు శీను పల్లవితో .ఓ పెద్ద అన్నయ్య లే పెళ్ళాం చెప్పు చేతల్లో ఉంటాడు .పోయి పని చేసుకో మా మామయ్య ఇంట్లో పడి తినకుండా అనింది హానీ ,ఏయ్ ఎవరే నీకు మామయ్య మా బావ ని పట్టుకొని అన్నాడు శీను .ఇది నా అమ్మ అయితే దీని తమ్ముడు నా మామయ్య కదరా మట్టి బుర్ర ఇక చాలా ,పోయి పని చేస్కో అనింది హానీ .వాడు పైకి వెళ్లి అక్క అక్క అంటూ రేఖని పిలిచి పల్లవి పెళ్లి చేసేసుకుంది అంట, ఆ పిల్ల పల్లవిని అమ్మ అంటుంది .అమ్మ అనడమే కాదు బావ నిన్ను మామయ్య అంటుంది అని పల్లవి అన్నతో అన్నాడు శీను.అంతే కాదు నన్ను అనరాని మాటలు అనింది అక్క అని రేఖ తో అన్నాడు శీను .ఏమని అనింది రా అనింది రేఖ .బావ నీ చెప్పు చేతల్లో ఉంటున్నాడు అని ఓ గొప్ప అన్నయలే అని వెటకారంగా అనింది ఇంకా మా మామయ్య ఇంట్లో పడితినకు అని కూడా అనింది అన్నాడు శీను .ఏంటండీ మీరేం అనరా అది అన్ని మాటలు అనింది అట నా తమ్ముడిని అనింది రేఖ . వున్న మాటే కదా అన్నాడు అని లేచి వెళ్ళిపోయాడు పల్లవి అన్నయ .ఒక పక్క పల్లవి నిజంగా పెళ్లి చేసుకుందా చేసుకుంటే నాకు చెప్తుందిగా ,ఆ పిల్ల ఎవరో కానీ నన్ను బానే తిట్టిందిలే అయినా పెళ్ళాం బెదిరిస్తుంటే నేనేం చేయగలను ,ఒక వేళ పల్లవి పెళ్లి చేసుకొని హాయిగా ఉంటే నాకంటే ఎక్కువ ఎవరూ సంతోష పడరు అని ఆనందం గా వున్నాడు పల్లవి అన్నయ .ఇక కార్ పార్కింగ్ దగ్గర ఒక పదిహేడేళ్ల కుర్రాడు అలానే చూస్తున్నాడు పల్లవిని .పల్లవి అత్తయ్య అని చిరునవ్వుతో ఆమెనో కాదో అని అనుమానంగా చూస్తున్నాడు .హా పల్లవి అత్తయనే దా అని చేతులు చాపితే వాడు వాడి చెల్లిని పిలిచి డాడీ చెప్తుంటారు కదా ఈమె మన అత్త అని చెప్పాడు ఇక అన్న చెల్లెల్లు ఇద్దరు చెరోవైపు హత్తుకున్నారు పల్లవిని .పల్లవి ఏడుస్తుంది .వాళ్ళకి ముద్దు పెడుతూ .అత్థయ్య ఏడవకు మాకు ఏడుపు వస్తుంది అన్నారు వాళ్ళు ఇక పల్లవి ఏద్వడం లేదు నేను హ్యాపీ గ వున్నాను బాగా చదువుకోండి అని చెప్పి వచ్చేసింది పల్లవి .
 
ఇది కథ లేక నవల అండి? ఇంకా ఉందా ..
 
రామయ్య ఊరిలో పెద్ద ఆసామి .ఆయనకీ పెళ్లి అయిన పిల్లలున్నారు .మనవడు లు వున్న వయసులో పెళ్లి చేసుకున్నాడు .అంత పని ఏమొచ్చింది అనుకుంటున్నారా ,కొడుకు కోడలు అమెరికా వెళ్లారు .కూతురు ఏమో అత్త మామలకే సేవలు చేయలేకపోతోంది ఇక భారం ఎందుకు అనుకున్నాడు .భార్య పోయి పదేళ్లు అయింది .ఇంతకీ ఆయన వయసెంతో తెలుసా 51 .ఇంకేం చాలా వయసు ఉందిగా ఆయనకీ అనుకుంటున్నారు కదా, నిజమే కానీ ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి వయసు 38 .ఈమెకి పెళ్లి అయిన కొన్ని రోజులకే భర్త పోయాడు .ఆమె ఇంకా తన భర్త జ్ఞాపకాలు మరిచిపోలేదు .ఎవరు సంబంధం కి వచ్చినా ఆమె అందం చూసి వచ్చే వాళ్ళే కానీ ఆమెని ప్రేమగా చూసుకుంటారు అనిపించలేదు .ఇక తనకంటూ ఒక తోడు కావాలి అనుకుంది.ఈ ముసలాయన అయితే వయసు అయిపోయింది నా మీదే ఆయన ఆధార పడాలి ఇంకో పదేళ్లలో అనుకుందో ఏమో కానీ ఒప్పుకుంది .మరి ముసలాయన వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా అంటే లేదు .పిల్లల ప్రేమకి పెద్ద వాళ్ళు ఎలా అడ్డు చెప్తారో వీళ్ళ ప్రేమకి కూడా అలానే అడ్డు చెప్పారు అసలు వీళ్ళ ప్రేమ ఎలా మొదలయిందో తరువాయి భాగం లో చూద్దాం .
True
 
నిజంగానే పల్లవి పెళ్లి చేసుకుందేమోనని పల్లవి వాళ్ళ అన్నయ్య పల్లవి కి ఫోన్ చేశాడు కానీ పల్లవి అదేం లేదన్నయ్యా ఈ అమ్మాయి మా ఇంటి ఓనర్ గారి అమ్మాయి తనకి అమ్మ లేదు కనుక నేను వాళ్ళ అమ్మ లాగే ఉంటాను అంట అందుకని నన్ను అమ్మ అంటుంది అనింది పల్లవి . సరే నీకు పెళ్లయిపోయిందేమోనని ఇక్కడ కొంతమంది ఏడుస్తున్నారు నువ్వు సంతోషంగా ఉంటే తట్టుకోలేని వాళ్లు, వాళ్లని అలాగే ఉండనిద్దాం .ఈ అన్నయ్యని క్షమించు .ఆ అమ్మాయి మంచి మాట అనింది నేను ఒక అన్నయ్య నేనా అని నాకు గుర్తు చేసింది అన్నాడు పల్లవి అన్నయ . అయ్యో అన్నయ్య తానేదో ఊరికే అనింది అని అనింది పల్లవి .లేదు లేదు తాను అన్నదానిలో తప్పేమీ లేదు నువ్వు వేరేలా అనుకోకు తాను నిజమే చెప్పింది కానీ నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు నాకు ఈ అన్నయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోకు అని అన్నాడు పల్లవి అన్నయ్య. నీ ఇబ్బందులు నీకు ఉన్నాయి కదా అన్నయ్య ,నేను అలా ఎందుకు అనుకుంటాను ఇంకా నా మేనల్లుడు నా మేనకోడలు కూడా చూసే అదృష్టం దక్కింది ఈరోజు అని అనింది పల్లవి. అవును నేనే వాళ్ళకి మేనత్త ఉందని వాళ్ళ అమ్మకి నువ్వంటే అంటే ఇష్టం లేదని పిల్లలకి నేనే చెప్పాను .నువ్వు వాళ్ళని కలిసి ఏడవ పోయావని కూడా చెప్పారు వాళ్ళు .నీ మేనల్లుడు నీ మేనకోడలు దృష్టిలో నువ్వు ఎప్పుడూ మంచిదాని గానే ఉంటావు లే నువ్వేమీ దిగులు పడకు అని అన్నాడు పల్లవి అన్నయ్య. ఇక ఇంతలో పల్లవి హనీ ఇద్దరు హనీ వాళ్ళింటికి చేరారు . పల్లవి ....హనీ అనిన మాటలన్నీ రామయ్య కి చెప్పి అందరూ సరదాగా నవ్వుకున్నారు అలా వాళ్ళింట్లోనే రెండు రోజులు గడిపి రామయ్య మనవుల్లతో బాగా బయటకు వెళ్లి జూ, పార్కులలో వాళ్లని ఆడించి వాళ్లతో కలిసిపోయింది పల్లవి. ఇక రామయ్య పల్లవి తిరుగు ప్రయాణమయ్యారు. వేసవి సెలవులు అవడంతో హనీ ఇంకా తన భర్త ఆఫీసుకు వెళ్లాలి ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారని ,నేను తీసుకెళ్తాను ఎండాకాలం సెలవులు అయిపోయిన దాకా పిల్లలని నా దగ్గర ఉంచుకుంటాను అనింది పల్లవి .హనీ చిన్న కొడుకు ,, అమ్మమ్మ...... మళ్లీ స్కూల్ పెట్టేవరకు నేను నీ దగ్గరే ఉంటానా అన్నాడు .అవున్రా నా బంగారం. నువ్వు నా దగ్గరే ఉంటావు అనింది పల్లవి. ఇక పల్లవి రామయ్య మనవల్లతో ఊరికి పయనమయ్యారు పల్లవి రామయ్య కలిసి వెళ్లడంతో ఊరంతా ఒకటే గుసగుసలు రెండు రోజులపాటు ఎక్కడికి వెళ్లారు అని అంటే కూతురు దగ్గరికి వెళ్లారని కొంతమందికి తెలుసు కానీ ఏదో ఒకటి మాట అనాలి కాబట్టి ఎక్కడికెళ్లారో ఏంటో అని ఒకటే గుసగుసలు .కొంతమంది మాట అట్టుంటే, రామయ్య మనవళ్లతో కలిసి పల్లవి కారు దిగడంతో మురిసిపోయారు కొందరు. ఇక రామయ్య మనవల్లని తీసుకొని వెళ్లిన పల్లవి,పిల్లలు ఎండకి తట్టుకోలేకపోతుంటే అప్పటికప్పుడే రామయ్య తో వెళ్లి రామయ్య కి ఒక ఏసి పల్లవికి ఒక ఏసి కొని కొనింది .అవును పంతులమ్మ ఎసి కి అలవాటు పడితే నేను అసలు బయట తిరగ్గలనా అన్నాడు రామయ్య. ఆ ఎందుకు తిరగకూడదు రోజంతా పగలు ఎండలో పని చేసి అలిసిపోయి రాత్రి హాయిగా నిద్ర పోవడానికి చల్లని గాలిలో పనుకోవచ్చు. అంతేకానీ పగలంతా ఏసి వేసుకొని ఉండమని కాదు అని అనింది పల్లవి .ఇక నీ మనవళ్లను చూడు పాపం స్కూల్లో కూడా వాళ్లకి ఏసి ఇప్పుడేమో ఈ వేడికి తట్టుకోలేకపోతున్నారు వీడికి ఇప్పుడే లక్షన్నర ఫీజు అవసరమా అసలు. వీటిని నాతో పాటే స్కూల్ తీసుకెళ్తా ప్రభుత్వ స్కూల్ అయినా కూడా మేము మంచి టీచర్లమేనండి రామయ్య గారు అనింది పల్లవి. హా నేనేమీ కాదన్నానా వాళ్లు పట్నంలో సంపాదించుకుంటున్నారు లక్షల లక్షల ఫీజు కట్టుకోగల స్థోమత ఉంది నేనేం చెప్పగలను వాళ్ళకి అని అన్నాడు రామయ్య .వీడు చదివేది రెండో తరగతి .వీడికి ఫీజు లక్షన్నారంటే ఒక సాదాసీదా బడిలో మన ఊరు పిల్లలు నలుగురు చదువుకోవచ్చు . పెట్టండి ఏ తల్లిదండ్రులు అయినా పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు వాళ్లని నేను కాదనను కానీ ఈ పిల్లాడికి లక్షన్నర ఫీజు ఎందుకు ఏంటో నాకు అసలు అర్థం కాదు. అదేమంటే బడిలో స్విమ్మింగ్ పూల్ ఇంకా గేమ్స్ ఆడుకోవడానికి బొమ్మలు అవి ఇవి ఉంటాయి అంటారు. ఇంకా ఇకపోతే ఇకపోతే ట్యాబ్లు ఒకటి ఇస్తారు ఆ టాబ్లు ఇప్పుడు మా దగ్గర కూడా ఉన్నాయి లే .ఒకవేళ లేకపోయినా నా బుజ్జి మనవాళ్ళకి నేను కొని పెట్టుకుంటాలే అని అనింది పల్లవి. పట్నంలో పెరిగిన వాళ్లు కనుక అమ్మ నాన్న ఎప్పుడూ వాళ్ళని స్కూల్లో వదిలిపెట్టక ఒక ఆదివారం మాత్రమే వాళ్ళతో కలిసి ఉండటంతో ఎప్పుడు స్కూలు బస్సులో వెళ్లడం బస్సులో రావడం సాయంత్రం అయిపోతుంది .ఇంటికి వచ్చాక కూడా రామయ్య కూతురు కొడుకు లాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటారు .కనుక పిల్లలు హానీ మీద బెంగ కూడా ఏమి పెట్టుకోలేదు . ఒకరోజు హనీ పల్లవి కి ఫోన్ చేసింది అమ్మ ,,,పిల్లల్ని నువ్వే చదివిస్తానంటున్నావు కదా ,సరే నువ్వే తీసుకువెళ్ళు వాళ్ళని బడికి .ఇక్కడ నాకు ఎలాగో మా అత్త మామయ్య ఆరోగ్య సమస్యలు ఇంకా నా ఉద్యోగం తీరికలేదు నువ్వే బాగా చూసుకుంటావు నీతో పాటే బడికి తీసుకెళ్ళు నా పిల్లలు ప్రభుత్వ బడిలో చదివినందువల్ల నాకు నష్టమేమీ లేదు అందులో నువ్వు ఉన్నావు కాబట్టి నాకు అసలు ఎలాంటి దిగులు లేదు అని అనింది హానీ .
 
Top