• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

"బోన్ సాయ్ బ్రతుకు"

EkaLustYa

Eternal Optimist of ZoZo
Senior's
Chat Pro User
[ Note: This story is not written by me. I just typed it into Telugu font from an award-winning book (Kendra Sahitya Academy: Naa Maargam by Abburi ChayaDevi). There is no copy write infringement, it's just that I am reproducing without her consent (as I don't know who and how to contact). My only idea is that - it should reach out to greater readers. This book is a collection of 28 stories, but this story is the shortest yet a powerful one. I took utmost precaution on not to have any typos. Will post English translation of this story at a later point of time]

IMG_6127.jpeg
ఆఫీసునుంచి ఇంటికొచ్చేసరికి గుమ్మంలో ఎదురుగా ఉత్తరాలు కనిపిస్తే ఏదో చెప్పలేనంత ఉత్సాహం పుట్టుకొస్తుంది.

ఆత్మీయులు ఎదురై ఆప్యాయంగా పలకరించినట్లే అనిపించి ఆఫీసు పనివల్ల కలిగిన అలసట అంతా ఇట్టే మాయం చేసినట్లు హాయిగా ఉంటుంది మనసుకి. ఆఫీసు నుంచి రాగానే ఈదురోదేముడా అంటూ వంటింట్లోకి అడుగుపెట్టేందుకు బదులు కూనిరాగం తీస్తూ కులాసాగా కాఫీ చేసుకుని తాగబుద్ది అవుతుంది. అందులోనూ పరిచితమైన దస్తూరితో ఇన్ లాండ్ లెటర్స్ గాని కవర్లు గాని వస్తే చకచకా పకోడీలో బజ్జీలో చేసుకుని తినేటంత ఓపిక, ఉత్సాహం పుట్టుకొస్తాయి. ఉత్తరాలు రాయటానికి బద్దకం అనిపించినా ఎక్కడినుంచైనా రోజూ ఉత్తరాలు రావాలనే ఆశ మాత్రం ఉంటుంది.

అనుకోని ఉత్తరం అది. అక్కయ్య ఏనాడూ ఉత్తరం రాయనిది ప్రత్యేకంగా రాసిందంటే ఏదో విశేషం ఉండి తీరాలి. ఉత్తరం విప్పుతుంటే కొంచెం భయంలాంటిది వేసింది- ఏమైనా దుర్వార్త కాదు కదా అని. అవును మరి. అంతా సవ్యంగా ఉంటే ఒక్కళ్ళూ ఉత్తరం ముక్క రాయరు.

అమ్మలూ,

నా ఉత్తరం నీకు చాలా ఆశ్చర్యం కలిగించిందనుకుంటాను. నేనూ మీ బావగారూ అక్కడికి మీ ఊరికి రాబోతున్నామని చెబితే మరింత ఆశ్చర్యపోవచ్చు. కాశీ, హరిద్వారం వెళ్లాలని ఎన్నాళ్లనుంచో అనుకుంటున్నాము. ఈనాటికి వీలు చిక్కింది. మేము రావటం వల్ల మీకు ఏ విధమయిన ఇబ్బందీ కలగదనుకుంటాను...'

"ఏమండీ, మా అక్క, బావగారూ వస్తున్నారట ఇక్కడికి" అన్నాను ఉత్సాహంగా.

"నిజంగానా! ఎప్పుడు? ఏదీ, ఉత్తరం ఇలాతే" అంటూ నా చేతిలోంచి ఉత్తరం లాక్కున్నారాయన. నేను వంటింట్లోకి వెళ్ళాను కాఫీ వగైరాలు రెడీ చెయ్యడానికి.

నా పెళ్ళైన తరువాత మొట్టమొదటిసారిగా ఈ ఊరికి మా ఇంటికొస్తున్నారు మా అక్క, బావగారూ. ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూసిన సంగతి. ఎప్పుడూ ఆ పల్లెటూరు వొదిలి కదలరు వాళ్ళిద్దరూ. పిల్లా పీచు గొడ్లూ గోతం పంటలూ, కోతలూ అంటూ ఏవో వంకలు పెట్టి వాళ్ళు ఊరు వొదిలి ఎక్కడికీ వెళ్ళరు. అటువంటిది వాళ్ళు ఈ మహాపట్నానికి మా ఇంటికొస్తున్నారు ఈనాటికి.

అక్కయ్య నాకుమల్లే చదువుకోలేదు. చదువుకోలేదంటే - దాన్ని అయిదో క్లాసుతోటే చదువు మానిపించేశారు మా నాన్నగారు. ఆడపిల్లకి చదువేమిటి? చాకలిపద్దు రాయగలిగితే చాలదా అనుకునే రోజులవి. ఒక దశాబ్దం తరువాత పుట్టిన నా నాటికి ఆడపిల్లకి చదువు అవసరమా అనవసరమా అనే మీమాంస తగ్గిపోయింది. కాలంతోపాటు నాన్నగారు కూడా మారటం నా అదృష్టం. నన్ను కాలేజీలో చేర్పించడానికి కూడా వెనుకాడలేదు. పెద్ద చదువు చదివినతర్వాత పెళ్ళి చేసుకుని ఇల్లూ వాకిలీ చూసుకుంటూ కేవలం గృహిణిగా ఉండిపోవడానికి ఏ ఆడపిల్లకీ మనస్కరించదు. చదివిన చదువు సద్వినియోగం చేసుకోవాలనీ, జీవితంలో స్వయంగా ఏదో సాధించాలనే తపన బయలుదేరుతుంది. అదేవిధమైన తపన నాలోనూ రేగింది. ఆయన మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ నేనూ ఉద్యోగంలో చేరాను.

అక్కకి చదువు లేకపోవడంతో పల్లెటూరి సంబంధం కుదిరింది. బావగారు చదువుకున్నవాడే అయినా ఆదర్శభావాలతో వ్యవసాయాన్నే వృత్తిగా ఎన్నుకుని సొంత పొలాన్ని పండించుకుంటూ పల్లెటూరిలోనే మకాం స్థిరపరచుకున్నారు. అక్కయ్య ఆ పల్లెటూరికే అలవాటు పడిపోయింది.

అక్కయ్య వచ్చేటప్పుడు దోసకాయలూ, గోంగూర, ములక్కాడలూ, అప్పడాలూ, వడియాలూ, కొబ్బరి ఉండలూ లాంటివెన్నో తెచ్చింది. " ఏమిటోనే, కుచేలుడిలాగ పట్టుకొచ్చాను ఇవన్నీ. మీకు నచ్చుతాయో లేదో " అంది మొహమాటపడుతూ.

"అయ్యో, అదేం మాటే! సరిగ్గా మాక్కావల్సిన వస్తువులన్నీ తెచ్చిపెట్టావు. మాకు ఇక్కడ దొరకని వస్తువులివన్నీ. మీ మరిదికి గోంగూర పులుసూ, దోసకాయపప్పు, ములక్కాడ చారు ఉంటే చాలు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినట్లు సంబరపడతారు. నాకు ఆఫీసు పని తోటి అప్పడాలు వడియాలు పెట్టడం అసలే పడదు. ఒకవేళ తీరిక దొరికినా అటువంటి పనులు చెయ్యాలంటే బద్దకం నాకు. నా సంగతి నీకు తెలుసుగా!" అన్నాను నవ్వుతూ.

"అవును మరి, ఆఫీసు నుంచి వచ్చేసరికి ప్రాణం సోలిపోయి ఉంటుంది. ఇక అప్పడాలూ వడియాలూ పెట్తాలి, ఇడ్లీలు దోసెలూ వెయ్యాలి అంటె మాటలేమిటి! అసలు ఎలా నెట్టుకొస్తున్నావో ఇంటిపనీ ఆఫీసు పనీను" అంది అక్కయ్య ఓదార్పుగా.

" ఏమిటో, వెధవ ఉద్యోగం- ఒక్కొక్కప్పుడు మానెయ్యలనిపిస్తుందే అక్కా. ఇంట గెలిచి రచ్చగెలవమన్నట్లు - ఇల్లూ వాకిలీ సరిగ్గా చూసుకోకుండా ఆఫీసులో వ్యవహారాలు చూడబోవడం ఆడదానికి తలకి మించిన పనే" అన్నాను స్వానుభవం మీద.

"అలా అనుకునేవ్ అమ్మలూ, నువ్వెంత అదృష్టవంతురాలివి. - అనకూడదు గాని. హాయిగా చదువుకుని మగవాడితో సమానంగా ఉద్యోగం చేసి చేతి నిండా సంపాయిస్తున్నావు. "దేహి" అని ఒకళ్ళని అడగాల్సిన పని లేదు దేనికీ. మాకుమల్లే కరివేపాకుకీ, కాణీ డబ్బు దగ్గర్నుంచీ మొగుడిమీద ఆధారపడకుండా దర్జాగా బ్రతగ్గలవు" అంది అక్కయ్య.

"దూరపుకొండలు నునుపు" అనుకున్నాను మనసులో. "మీ పాప ఏం చదువుతోందే ఇప్పుడు?" అన్నాను ధోరణి మార్చటానికి.

"స్కూలు ఫైనలు చదువుతోంది. దేవుడి దయవల్ల గట్టెక్కితే కాలేజీలో చేర్పించాలనే నా పట్టు. పొరుగూరు పంపించి హాస్టల్లో ఉంచటం ఆయనకి అంత ఇష్టం లేదు. అయినా ఆడదాన్ని చదువులేకుండా ఇంట్లో కూర్చోబెట్టటం నాకిష్టం లేదే. నే పడుతున్న పాట్లు చాలవూ? ఆడదానిక్కూడా ఈ రోజుల్లో ఓ డిగ్రీ చేతిలో లేకపొతే ఎందుకూ కొరగాదు. లేకుంటే మగవాడి చెప్పుకింది తేలులాగ పడి ఉండాల్సిందే " అంది ఉద్రేకంతో.

అక్కయ్యకి మొదటి నుంచీ చదువంటే ఇష్టం. కానీ నాన్నగారు దానికి చదువు చెప్పించలేదు. ఏదో నోటి లెక్కకి ఠక్కున సమాధానం చెప్పలేకపోయిందని " ఆ... ఆడదానికి దీనికి చదువెలా వస్తుంది" అని నాన్నగారు అక్క చదువు ఆపించేసి అన్నయ్య మీదే అత్యంత శ్రద్ధ చూపించారు. అక్కయ్యకి చదువు లేకపోబట్టే ఆ పల్లెటూరు సంబంధం చేసుకోవాల్సి వచ్చిందనీ, ఇంట్లో పాడి చూసుకోవటం, పొయ్యి అలుక్కోవటం, నూతిలోంచి నీళ్ళు తోడుకోవటం- అలా గొడ్డు చాకిరీ చెయ్యాల్సి వస్తోందని అమ్మ కూడా ఎప్పుడూ అక్కయ్య గురించి బాధపడుతూ ఉంటుంది. గతమంతా తలుచుకుని అక్కయ్య బాధపడుతోందని గ్రహించి, దాన్ని కాస్తమరిపించాలని " అలా అవతలకి పోయి కూచుందాం రావే అక్కా" అంటూ బాల్కనీకి తీసుకువెళ్లాను.

అక్కడ పూలకుండీల్లో మొక్కలు చూడటం మొదలుపెట్టింది అక్కయ్య. తను తీసుకొచ్చిన దోసకాయలూ, ములక్కాడలూ, గోంగూర - అన్నీ వాళ్ళ పెరట్లోవేట, ఈ సారి ఎవరైనా ఇటువైపు వస్తూంటే కాసిని గోంగూర విత్తనాలు పంపించమన్నాను.

"అవునుగాని అమ్మలూ, ఇదేమిటే, ఈ తురాయి చెట్టునీ, దానిమ్మ చెట్టునీ పూలకుండీల్లో వేశావు! ఎట్లా మరుగుజ్జుల్లా తయారయినాయో చూడు! నిక్షేపంలా క్రింద పెరట్లో పెరగాల్సిన చెట్లని పూల కుండీల్లో వేస్తే ఇక అవి ఎట్లా పెరుగుతాయే!" అంది ఆశ్చర్యపోతూ, ఆ చెట్ల కోసం బాధపడిపోతూ.

నేను పకపకా నవ్వాను. అక్కయ్య తెల్లబోతూ నావంక చూసింది.

"కావాలనే వేశానక్కా, అదొక స్పెషల్ పద్ధతి. దాన్ని 'బోన్ సాయ్' అంటారు జపాను దేశంలో. మర్రిచెట్టులాంటి మహావృక్షాన్ని కూడా పూలకుండీలో పెంచవచ్చు- ఊడలు కూడా దిగేట్టు పెంచవచ్చు. చిన్న పూలతొట్టెలో దానిమ్మ మొక్కని ఎప్పటికప్పుడూ కొమ్మలు కత్తిరిస్తు మధ్యమధ్య తొట్టె మారుస్తూ చిన్న సైజు చెట్టుని చేసి కాయలు కాయనిస్తే చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుందనుకున్నావ్!ఎంత జాగ్రత్తగా పెంచాలో తెలుసా ఈ చిన్న వృక్షాన్ని? "బోన్ సాయ్" ఒక గొప్ప కళ" అన్నాను.

అక్కయ్య నా మాటల్ని మెచ్చుకున్నట్లు కనిపించలేదు. " ఏమిటో ఈ మేడంత ఎత్తు పెరగాల్సిన తురాయి చెట్టుని ఈ కుండీలో బంధించావు" అంది నిట్టూర్చుతూ.

అక్కయ్యని నా "బోన్ సాయ్" తో మెప్పించలేకపోయినందుకు నిరుత్సాహపడుతూ నీరసంగా కుర్చీలో చతికిలపడ్డాను. నేను నేర్చుకున్న "కళ" అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని నీరుకారిపోయాను. అంతలోనే పెద్ద గాలిదుమారం రేగింది. విసురుగా ఇసుక వచ్చి మా మొహాల్ని కొట్టింది. అక్క రెక్క పుచ్చుకుని గదిలోకి లాక్కు వెళ్ళాను. గబగబా కిటికీలూ తలుపులు మూసేసాను.

క్షణాలమీద జరిగిందంతా చూసి అక్కయ్య నిర్ఘాంతపోయింది.

"అదేమిటి? ఇంతవరకు మామూలుగానే ఉంది. అంతలోనే ఆ దుమ్మూ, గాలీ ఎక్కణ్ణుంచి వచ్చాయే? తారురోడ్లు కూడాను?" అంది.

"ఈ మహాపట్నంలో ఇంతేనే తల్లీ. చూస్తూచూస్తుండగానే రాజస్థాన్ ఎడారిలో ఉన్న ఇసుకంతా లేవదీసుకొచ్చి మా మొహాన కొట్టి పోతుంది గాలిదుమారం" ఇంకా నా మాటలు పూర్తికాలేదు. అవతల టపటపమని వానచినుకుల చప్పుడైంది. నేను తలుపు తెరిచి బాల్కనీలో ఉన్న బోన్ సాయ్ చెట్లకుండీలనీ, పూలకుండీలనీ లోపలికి చూరు క్రిందకి లాగాను. గాలివాన మొదలయింది. అక్కయ్య ఒక కిటికీ రెక్క తెరిచి వీధిలోకి చూసింది- భారత రాజధాని వాతావరణాన్ని.

"చూడు అమ్మలూ, అటుచూడు" అంది. అక్కయ్య గొంతులో ఏదో నూతనోత్సాహం తొంగిచూచినట్లనిపించింది. నేను కుతూహలంగా కిటికీలోంచి వీధివైపు చూసాను. అర్ధం కాలేదు. అక్కయ్య మొహంలోకి చూశాను అంతుపట్టక " ఏమిటే " అన్నాను.

" ఆ చెట్టు చూడు - దారిపక్కన ఎంతమంది తలదాచుకున్నారో తడిసిపోకుండా" అంది. అదేదో వినూత్న విషయమైనట్లు. నాకు మాత్రం అది అతి సామాన్యమైన సంగతిలా తోచింది. తన మనస్సులోని భావాన్ని నేను గ్రహించలేదని తెలుసికుందిలా వుంది. తనే మళ్ళీ అంది.

" ఆ తురాయి చెట్టు ఎంత పెద్ద చెట్టు అయిందో చూడు- బయట విశాలంగా ఉన్న చోట స్వేచ్చగా పెరిగింది కదూ - ఎంతటి గాలిదుమారం వచ్చినా అది కించిత్తు చలించలేదు. పైగా అంతమంది జనానికి ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఆసరాగా నిలిచింది. ఎండవేళల ఎంత మంది దాని నీడలో సేద తీర్చుకుంటూ ఉంటారో!"

"అందులో వింత ఏముందే!" అన్నాను.

"వింత ఉందని కాదు అమ్మలూ. నువ్వు అపురూపంగా పెంచిన నీ బోన్ సాయ్ చూడు! చూట్టానికి కుదురుగా ముచ్చటగానే ఉంది సంసార పక్షపు స్త్రీలాగ. కానీ ఎంత సుకుమారమో చూడు. నువ్వు వెయ్యి కళ్ళతో కాపాడాలి దాన్ని- కాస్త తుఫానుకి కూడా తట్టుకోలేదు. తనే ఒకరిమీద ఆధారపడినప్పుడు మరొకరికి నీడ కూడా ఏమివ్వగలదు? మగవాడికీ ఆడదానికీ పెంపకం లో ఉన్న తేడా వల్లనే కదుటే ఆడదాని బ్రతుక్కూడా " బోన్ సాయ్" మాదిరి అయింది!" అంది.

అక్కయ్య మాటలకి నా మనస్సు ఆర్ధ్రమయింది. పంజరం లో బంధించిన చిలకని విడిచిపెట్టి స్వేచ్చా విహంగాన్ని చేసినట్లుగా నా "నా బోన్ సాయ్" చెట్లకి పూలకుండీల్లోంచి విముక్తి కలిగించాలన్న ఆవేశం కలిగింది నాలో.
IMG_6128.jpeg
 
View attachment 373096

View attachment 373097
Guruji:heart1::hearteyes:
 
Elanti thread mi Valle , mire post cheygalaru guru ji
 
Top