• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

తెలుగింటి వదినలు

ఉత్తరాదిన కొంచెం వయసు మీద పడినా చూడడానికి అందం గ వున్నముద్దుగుమ్మని ముక్కు మోహం తెలియని వాడు ఎవడైనా ఆంటీ అంటే అసలు ఒప్పుకోదు .ఆంటీ ఎవరు నీకు భాభీ అను అంటారు .భాభీ అంటే ఏంటి అనుకుంటున్నారా ,మనం తెలుగులో పవిత్రం గ పిలుచుకునే పిలుపు వదిన ని హిందీలో భాభీ అంటారు .మరిదిని దేవర్ అంటారు .నీలి చిత్రాల దాకా ఏమో కానీ యూట్యూబ్ లో భాభీ దేవర్ అని కొడితే చాలు అడ్డమైన చెత్త అంతా వస్తుంది .
కానీ మన దక్షిణాదిన వదిన అంటే అమ్మతో సమానం .దారినిపోయే వాళ్ళు ఎవరైనా అక్క అంటే అయినా బాగుంటది ఏమో కానీ ,వదిన అంటే ఆ పిలుపు పరాయి వాళ్ళ నోట వినడానికే బాగోదు .వరసకి అన్న పెళ్ళాం అయితే తప్ప వదిన అని పిలవము మనము .అప్పటి దాకా కలిసున్న అన్నా తమ్ముళ్లు ఇక పై ఎలా వుంటారో ఈమె పైనే ఆధారపడి ఉంటుంది .మరిది ఆమె కంటే బాగా చిన్న వాడు అయితే తల్లి ప్రేమ కొంచెం అందిస్తుంది ,వదిన మరిదికి పెద్ద వయసు వత్యాసం లేకుంటే తానెవరో తెలియనట్టే ఉంటుంది ఎందుకంటే ఆమెకి తెలుసు ఎవరితో ఎలా ఉండాలో. ఆఖరికి మరిది బండెక్కి కూడా వెళ్ళలేదు లోకులు కాకులు కదా .అదే మరిది వయసు తక్కువ ఉంటే చిన్న వాడే కదా అన్నట్టు ఉంటుంది .అలా అని పూర్తిగా తల్లిగా ఏం చూసుకోదు .ఎంత వరకో అంత వరకే .అసలు వదిన అంటేనే విచిత్రమైన క్యారెక్టర్ .ప్రేమగా మాట్లాడుతుంది చిరాకుగా ఉంటుంది తిడుతుంది అన్నయ పై చాడీలు కూడా చెబుతుంది .కానీ అన్నయ ఏమైనా పని చేస్తుంటే మాత్రం ,మీ అన్నయకి కొంచెం సాయం చేయొచ్చుగా అంటుంది .ఆమెకి అన్నయ అంటే అంత ఇష్టం .చక్కని మా అన్నకి చిక్కిన ఈ చిలకమ్మా వచ్చింది ఇంటికి అన్నట్టు .నిజంగా ఆమెవి చిలక పలుకులే .ఇంట్లో పనులు చేసుకునేప్పుడు ఆమె చుట్టూ పక్కల మగాళ్లు ఉంటే చెడ్డ చిరాకు .పాపం మరిది ఏమో హాలులో కూర్చొని ఉంటాడు ఎప్పుడూ ,ఆమె అందాలు చూస్తాడేమో అని ఆమెకి అదొక అనుమానం . ఈమె వయసులో వుంది ఆయన వయసులో వున్నాడు ఏదో మొగుణ్ణి కట్టుకుంటే వచ్చిన మరిదే కానీ చిన్ననాటి నుండి ఏమైనా తెలుసా ఆమెకి .మరిది ఇంట్లో మనిషి అయినా పరాయి మగాడే అన్నట్టు వుంటది .అలా అని ప్రేమ లేదు అనుకునేరు .వదిన ప్రేమ మరిది మీద ఆధార పడే ఉంటుంది .అన్నయకి మర్యాద ఇవ్వాలి అండోయ్ .అన్నయ్యతో గొడవ అయిందా ఇక వదిన తో తెగ తెంపులే .మీ అన్నయ్యని మీరు ఒక మాట అంటే మీ అన్నయ్య అయినా మర్చిపోతాడు కానీ ఈమె అసలుకే మర్చిపోదు జీవితాంతం సాధిస్తుంది .ఆమె మొగుడిని అంటే ఒప్పుకుంటుందా .ఇంట్లో ఎంత బోర్ కొట్టినా మరిదిని సమయానికి భోజనానికి పిలుస్తుందే తప్ప ,మరిదితో కబుర్లు అసలే చెప్పదు .అన్నయ మీద చాడీలు చెప్పాల్సినవి ఉంటే మాత్రం చెప్పక మానదు .తన కంటే అంద గత్తె మరిదికి పెళ్ళాం గ వస్తే అదొక అసూయ .
అసలు వదిన అంటే అమ్మ లాంటిది అని ఎందుకు అన్నారు .ఎందుకు అంటే అమ్మ తరువాత ఇంటి బాధ్యతలు చక్కపెట్టేది ఆమె కనుక .మరిది పెళ్లి కానీ పిల్లాడు అయితే వాడి పెళ్లి బాధ్యత వాడి అన్నయ్యతో పాటు ఆమె కూడా తీసుకుంటుంది కనుక . అన్న తమ్ముళ్ల బంధం ఆమె గుప్పెట్లో వుంది కనుక .పెద్ద కోడలు కనుక అత్త మామయ్యని కూడా ఆమె చూసుకుంది కనుక .మీకే ఆశ్చర్యంగా వుంది కదా వదిన ఇన్ని చేస్తుందా అని .ఇవి చాలా తక్కువ .మంచి వదిన మీ ఇంటికొస్తే తల్లి ప్రేమ మరిచిపోవడమే ఇక అంత బాగా చూసుకుంటుంది.

మరి మరిదితో రాసలీలలు చేసే వాళ్ళ మాటేమిటి అనుకుంటున్నారా .ఈ రోజుల్లో అవన్నీ చూసుకుంటే ఎలా .ఆమె ఎలా వున్నా భర్త పిల్లలని కుటుంబ బాధ్యతలని తన భుజాలపై సక్రమంగానే మోస్తుంది కదా . అన్నయ్య తమ్ముడి పెళ్ళాం పై మనసు పడితే లేని తప్పు వదినకి వచ్చిందా .అందరం సంతోషంగా ఉండాలంటే కోరి గొడవలు తెచ్చుకోకుండా ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నడిపించుకుంటే అదే పదివేలు ఈ రోజుల్లో .

ఇక మగవాళ్ల విషయానికొస్తే వదిన చనువుని తప్పుగా అర్ధం చేసుకునే ప్రమాదం వుంది .చనువుగా ఉంటుంది అంటే తాను నిన్ను తన ఇంట్లో మనిషిగా చూసుకుంటుంది అని సంబర పడాలే కానీ ఆమెకి మోహం వుంది అనుకుంటే ఎలా .ఆమెకి ఇష్టం ఉంటే స్పర్శించి తాపం తీర్చడం తప్పేమి కాదు కానీ ,నీకు ఆమెపై మోహం కలగడమే ఇప్పుడొచ్చిన తంటా .మీ అన్నయ కి నీకు వున్న బంధం పాడైపోతుంది ఇక ఒక్క స్పర్శ తో నీ తొక్కలో మోహం ఏమో కానీ .

తల్లి తండ్రి ని విడిచి అన్నయ కోసం మన ఇంటికి వచ్చింది కనుక అన్నయ వదిన కలిసుండాలని కోరుకోవాలి కానీ ,అన్నయ స్థానం ఆక్రమించాలన్న ఆలోచనే తప్పు .సరే ఇక మోహం అంటారా ,ఇది అసలే కలి కాలం,ఏమి చేస్తాం అందాలు ఎదురుగా ఉంటే మది రెచ్చగొట్టకుండా ఉండదు ఏదో కొత్త వ్యామోహం తనువు కోరుకుంటానే వుంటది .ఈ వ్యామోహం కళ్ళతో చూడడం తో సరిపెట్టి ,తనువుని చన్నీటి స్నానం తో చల్ల బరుచుకోడమే ఉత్తమం .

అన్నయ ని కుటుంబాన్ని మంచి గాడిలో నడిపిస్తున్న నా తెలుగింటి వదినలు అందరికి నా పాదాభి వందనాలు .
 
Top