• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

చివరి దీపం !

MonsterHulk

Newbie
పల్లెటూరి అంచున ఉన్న చిన్న ఇల్లు అది. సాయంత్రం అయ్యిందంటే ఆ ఇంటి ముందు దీపం తప్పకుండా వెలిగేది.
ఆ దీపం వెలిగించేది లక్ష్మమ్మ.


లక్ష్మమ్మ భర్త చాలాకాలం క్రితమే చనిపోయాడు. పిల్లలు ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్లిపోయారు.
“నువ్వూ మా దగ్గరకి రా అమ్మా” అని ఎంత చెప్పినా,
“ఈ ఇల్లు, ఈ మట్టే నాకు ఊపిరి” అని నవ్వుతూ ఉండిపోయేది.


ప్రతి రోజు సాయంత్రం దీపం వెలిగించి రోడ్డువైపు చూస్తూ కూర్చునేది.
ఎవరి కోసం?


అది ఎవరికీ తెలియదు.


ఒకరోజు ఊరిలో కొత్త టీచర్ వచ్చాడు.
సాయంత్రం స్కూల్ నుంచి వస్తూ ఆ దీపాన్ని గమనించాడు.
చీకట్లో ఒక్క దీపం… చాలా ఆశగా కనిపించింది.


ఒక రోజు ధైర్యం చేసి అడిగాడు:
“అమ్మా, ఈ దీపం ఎవరికి?”


లక్ష్మమ్మ కళ్ళు తడిచాయి.
“నా పిల్లలు ఎప్పుడైనా తిరిగి వస్తే…
చీకట్లో దారి తప్పకూడదని” అంది.


కొన్ని రోజులకు లక్ష్మమ్మ అనారోగ్యంతో పడిపోయింది.
ఒక సాయంత్రం… దీపం వెలగలేదు.


ఆ రోజు ఊరి వాళ్లందరూ కలిసి ఆ ఇంటి ముందు దీపం వెలిగించారు.
ఎందుకంటే వాళ్లందరికీ అర్థమైంది—


ఆ దీపం కేవలం పిల్లల కోసం కాదు… ఆశ కోసం.... ప్రేమ కోసం.... వేచిచూపు కోసం.!!


లక్ష్మమ్మ కాలం చేసిండి.... కానీ ఆమె వెలిగించిన దీపం… ఊరి హృదయాల్లో శాశ్వతంగా వెలిగిపోయింది. ☺
 
Top