hyd-soul-rider
Newbie
ఓ నిషాదమ నీ బిడి కవుగిలో అందరు కలిసిపోవాల్సిందే,పున్నమిలో, సూర్యుని వెలుగులో చీకటి ఉండదని భ్రమలో ఉంటాం, నిజం ఏంటంటే ఆ సూర్యుడు ఉన్నది ఈ చీకటి విశ్వమ్ లోనే , సూర్యుడికీ భయం కాబోలు, చీకటిలో తననీ తాను చూసుకోవడానికి, ఎందుకంటే నీ వెలుగులు ఆరి చీకటిలోకి వెళ్ళినప్పుడు కనిపించినవన్నీ కబళించే నీ ప్రచండ విశృంఖల విశ్వ రూపాన్ని చూసుకొని నీకు నువ్వే బయపడిపోతావ్ గా, ఆ బయ్యం నుంచి బయట పడటానికే గా, కొన్ని కోట్ల సంవత్సరాలుగా, నిన్ను నువ్వు దహించుకొని,నీకు కావలసిన వెలుగును నింపుకుంటున్నావ్,నిన్ను చుస్తే జాలివేస్తుంది, నేను బయపడి కొవ్వొత్తి మాత్రమే వెలిగించ, కానీ నీ భయం తో నువ్వు కనుచూపు మేరలో చీకటి లేకుండా వెలుగుని నింపుకొంటున్నావు, ఆహ్హా, ఇప్పుడు అనిపిస్తుంది నీకన్నా నేను ఎన్ని రేట్లు బలవంతుడినో, ధైర్యవంతుడినో అని, కానీ నువ్వు అనుకుంటున్నట్టు ఈ నిషాదము చెడ్డది కాదు, మనకు నచ్చనిదాన్ని ఒక్క క్షణమ్ కూడా భరించలేని మనం ఎక్కడ, తననీ హరిస్తుంది అని తెలిసి నీలాంటి కొన్ని వేళా కోట్ల సూర్యులను తనలో ఇమిడికృతం చేసుకుంటుంది, ఇప్పుడు చెప్పు వెలుగు గొప్పదా, చీకటి గొప్పదా,ఒకటి నిజం ప్రతి జీవి జీవించడానికి వెలుగు తోడు ఉంటుందేమో,కానీ ఆ జీవి పుట్టడానికి ముందే తల్లి గర్భం లోనే, నేను చీకటిని తోబుట్టువుల ఉన్నాను,అప్పుడే కాదు నీ మరణం తరువాత కూడా,నీ తో పాటు వెలుగు రాకపోవచ్చు కానీ నేను వస్తాను నీ చివరి మజిలో భూగర్భం లో కూడా నీతో తూడుగా ఉంటాను,నేను నీ తోబుట్టువును నువ్వు లేకుండా బ్రతకలేను,విశ్వమంతా నిండిన నాకు నీవంటే ఎంత ప్రేమో తెలుసా,నువ్వు నన్ను చూసి భయపడిన, నానుండి దూరం గా పారిపోయిన, నా తోబుట్టువు నువ్వు,నిన్ను వదిలి ఉండలేను.చీకటినెను, నువ్వు అనుకునే అంత చెడును మాత్రం కాను,