❣❣❣❣❣❣❣❣
మనసులోని భావాలెన్నో
మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో
మధురమయిన క్షణాలెన్నో
కవ్వించే కబుర్లెన్నో ...
మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో
ఆశ్చర్యపరిచే అద్భుతాలెన్నో
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు
మరువరాని జ్ఞాపకాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...
మనిషి జీవితంలో
మరువలేనివి ఇంకెన్నో ఇదే జీవితం...
దీనిని అనుభవించు
అనుక్షణం...
సప్త వర్ణాల సారం నీవే,
శ్వేత కిరణాల వెలుగైనావే...
మౌన పరిభాష దారుల్లోన నీవే...
సడి నీవే..
కడలి కెరటాల పైన సాగే చిలిపి చిరుగాలి నీవే
నిండు గోదారి నీడల్లోన
పసిడి పైరువేయ్
నీవే మారుత మయమైన
మది ఊహలకై
అరుణ కిరణమై కావీ
సొలసి పోయినా
నా కన్నులకే స్వప్న గీతమై రావే...
❣❣❣❣❣❣❣❣❣
Last edited:














em chepali ipudu chadhina ani cheppala chadhavale ani cheppalaa
