• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

World students day 2023‍‍‍‍‍‍

Nellore Nerajana

Epic Legend
VIP
Posting Freak
images - 2023-10-14T230356.396.jpeg
 
మన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జన్మదినం (అక్టోబర్ 15వ తేదీ) సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. రామేశ్వరంలో పేపర్ బాయ్ నుండి రాష్ట్రపతిగా.. ఎదిగిన కలామ్ సేవలను గుర్తు చేసుకుంటూ.. ఆయన చేసిన సేవలకు ప్రతీకగా 2010లో యునైటెడ్ నేషన్స్ డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ దినోత్సవాన్ని ప్రతి ఏటా వరల్డ్ స్టూడెంట్స్ డే గా జరుపుకోవాలని నిర్ణయించింది.
 
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఆయన సాధించిన విజయాలు మరియు శాస్త్రీయ మరియు రాజకీయ కెరీర్లో ఉత్తమ ఉపాధ్యాయుడి పాత్రను గౌరవించారు. ఈయన జయంతి సందర్భంగా ప్రపంచంలోని ప్రముఖలందరూ, మన దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అబ్దుల్ కలామ్ కు నివాళులు అర్పిస్తారు. అదేవిధంగా పాఠశాలలు, మరియు కళాశాలల్లో వేడుకలు జరుగుతాయి.
 
అబ్దుల్ కలాం చేసిన క్రుషి, చిత్తశుద్ధి, వినయం మరియు సానుకూలత కారణంగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో విద్యార్థులు ఇప్పటికీ స్ఫూర్తిదాయకమైన రోల్ మోడల్ గా భావిస్తున్నారు.
 
1939 సంవత్సరంలో అక్టోబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రం రామేశ్వర్వంలో జన్మించిన డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ చిన్ననాటి నుండే విద్య పట్ల బలమైన నిబద్ధతతో ఉండటం వల్ల అతను విద్యావేత్త గా మారేలా చేసింది. ఆయన సిద్ధాంతాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. సగటు విద్యార్థిగా ఎదిగేందుకు, కేవలం పాఠ్యపుస్తక పరిజ్ణానం మాత్రమే సరిపోదని, తన సిద్ధాంతాలను చదవడం మరియు వాటి ఆచరణాత్మక అనువర్తనాలను అర్థం చేసుకోవడం వంటి అన్ని ఎంపికలను అన్వేషించాలి.
 
తన రాజకీయ మరియు శాస్త్రీయ జీవితమంతా డాక్టర్ కలాం తనను తాను ఉపాధ్యాయుడిగా భావించారు. అందుకే అతను విద్యార్థులనుద్దేశించి మాట్లాడేటప్పుడు చాలా సంతోషంగా ఉండేవారు. తను విద్యార్థులకు బోధన మరియు స్ఫూర్తిదాయకం పట్ల చాలా ఆసక్తి చూపేవాడు. ఆయన ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ పదవిని విడిచిపెట్టిన తర్వాత, అతను టీచర్ గా మారాడు. తన జ్ణానం, రచనలు, ప్రేరణాత్మక సందేశాలు యువతకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయి.
 
Top