• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Dedicated to All Aavakaaya Lovers

Risikumar Reddy

Epic Legend
ఆవకాయ 'నవగ్రహ' స్వరూపం

ఆవకాయలో ఎరుపు--- "రవి"

ఆవకాయలోవేడి, తీక్షణత---"కుజుడు"

ఆవకాయలో వేసే నూనె, ఉప్పు---"శని"

ఆవకాయలో వేసే పసుపు,మెంతులు---
"గురువు"

మామిడిలో ఆకుపచ్చ---"బుధుడు"

మామిడిలో పులుపు---"శుక్రుడు"

ఆవకాయ తినగానే కలిగే , అలౌకికానందం---"కేతువు"

తిన్న కొద్దీ తినాలనే ఆశ---"రాహువు"

ఆవకాయ కలుపుకునే అన్నం---"చంద్రుడు"

ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూల వేసుకుని నవగ్రహ స్తోత్రం చెప్పుకొని, తింటే,
సమస్త గ్రహ దోషాలు ఔట్, హాం ఫట్.

శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,
టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ ఆవకాయను
సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!

ఊరిన ముక్కను కొరకగ,
ఔరా! అది ఎంత రుచిని అందించునయా,
కూరిమితొ నాల్గు ముక్కలు
నోరారా తినని నోరు నోరవ్వదుపో!

బెల్లము వేసిన మధురము,
పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,
వెల్లుల్లి వేయ మధురము,
పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!
〰〰〰〰〰〰

ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:
చెక్కందురు, డిప్పందురు,
ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.
డొక్కందురు,
మామిడి
పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!
〰〰〰〰〰〰

ఆవకాయ ఉపయోగాలు:
ఉదయమె బ్రెడ్డున జాముకు
బదులుగ ఇదివాడిచూడు బ్రహ్మాండములే,
అదియేమి మహిమొ తెలియదు,
పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!

ఇందువలదందు బాగని
సందేహము వలదు;
ఊట సర్వరుచిహరం ఎందెందు కలపి చూసిన,
అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!
〰〰〰〰〰〰

ఆవకాయ అవతరణ:
“చప్పటి దుంపలు తినుచును,
తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో గొప్పగు మార్గం బొక్కటి చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”

ముక్కోటి దేవులందరు
మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా
చక్కనిది ఆవకాయన ముక్క తిననివాడు కొండముచ్చై పుట్టున్!!!

చారెరుగనివాడును,
గోదారిన తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు, తెలుగువాడు కాడోయ్!!!

images-22.jpeg
 
Bayata hooruna varsham

Full chali gaali, current poindi.

Amma appude cooker ninchi teesina vedi vedi pogalu kakke annam steel plate lo pedtundi.

Current ledu kabatti a couple of candles are lit up.

Ah annam lo 3 chemchala neyyi, and ee aavakaya.

You are tempted to quickly eat it but you know that minimum 30 seconds aina kalapaka pote ah kick undadu ani.

The longest 30 seconds of the day are done

and you finally get that aavakaya mudda to your mouth.

Your sense of smell is fighting against the sense of taste.

Begging you to let it smell for a few more seconds but now it is beyond your control.

That avakaya mudda finally touches your tongue and you are bettedu dooram from Swargam


417ajs9z73y61.png



 
Last edited:

“ఆవకాయ మన అందరిదీ” అంటే మీరేమంటారు? కాదంటారా?? వేసవి కాలం వస్తుందనగానే ఆవకాయ తయారీ గురించిన ఆలోచనలు మొదలవుతాయి. నడివేసవిలో తెలుగువారినెవరిని పలకరించినా ఆవకాయ మాట రాకుండా ఉండదు.​

ఈ ఆవకాయ లేకుండా ఆంధ్రుల భోజనం పూర్తికాదు. అంతగా మన జీవితాలలో పెనవేసుకొని పోయింది.మామిడికాయ తో రకరకాలు పచ్చళ్ళు పెడతారు కానీ నాకు ఈ ఆవకాయ ఇలా చేస్తేనే ఇష్టం.ఇప్పుడు నేను చెప్పే కొలతలు కొత్తగా నేర్చుకునే వాళ్లకు కూడా సులభంగా అర్థం అవుతుంది.


తెలుగు లోగిళ్లలో ఆవకాయపచ్చడికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఆవకాయ పచ్చడిలేని ఇల్లు తెలుగు రాష్ట్రాల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు. వేసవి వచ్చిందంటే మామిడి సీజన్‌ మొదలవుతుంది. ఈ సీజన్‌ మామిడి పచ్చడికే ప్రత్యేకం. ‘మాగాయే మహా పచ్చడి.. పెరుగేస్తే మహత్తరి.. అది వేస్తే అడ్డ విస్తరి.. మానిన్యాం మహా సుందరి’అంటూ ఓ సినీ గేయ రచయిత మామిడి పచ్చడి గురించి వర్ణించారంటే దీని విశిష్టత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఆవకాయ తయారుచేసే విధానాన్ని తెలుగువారే మొదట కనిపెట్టారు. ఊరగాయల వాడకం ప్రాచీనకాలం నుంచి ఉందనడానికి అనేక రుజువులున్నాయి. అయితే, వీటిని ఆయా ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా తయారు చేస్తారు. తీపి ఆవకాయ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేకం. ఆంధ్ర ఆవకాయంటే గుర్తుకొచ్చేది గోదావరి జిల్లాలు. ఈ ప్రాంతంలో అవకాయ తయారీ ఓ పరిశ్రమలా ఉంటుంది.


ఆవకాయ పచ్చడి రెసిపీ గురించి​

ఈ ఆవకాయ లేకుండా ఆంధ్రుల భోజనం పూర్తికాదు. అంతగా మన జీవితాలలో పెనవేసుకొని పోయింది.మామిడికాయ తో రకరకాలు పచ్చళ్ళు పెడతారు కానీ నాకు ఈ ఆవకాయ ఇలా చేస్తేనే ఇష్టం.ఇప్పుడు నేను చెప్పే కొలతలు కొత్తగా నేర్చుకునే వాళ్లకు కూడా సులభంగా అర్థం అవుతుంది.

కావలసినవిసర్వింగ: 10

  1. పుల్లగా వుండే మామిడికాయముక్కలు 4 గిన్నెలు
  2. కారం ఒక గిన్నె
  3. ఉప్పు ముప్పావు గిన్నె
  4. ఆవపిండి ముప్పావు గిన్నె
  5. మెంతిపిండి 2 స్పూన్స్
  6. పసుపు 2 స్పూన్స్
  7. వెల్లుల్లి రెబ్బలు ఒక కప్
  8. నువ్వుల నూనె లేదా పల్లీలు నూనె కేజీ

33992881_10156501685669168_3311871663020179456_n.jpg

సూచనలు​

  1. ముందుగా మామిడి కాయలు కడిగి టవల్ తో తుడిచి తడిలేకుండా ఆరబెట్టుకోవాలి.
  2. తరువాత ముక్కలు చేసుకోవాలి.
  3. ఇక్కడ నేను పది కాయలు తీసుకున్నాను . అన్ని పచ్చివే వేసాను ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి, నూనె వేటిని వేడి చేయలేదు.అన్ని పచ్చిగా వాడాను .
  4. ముక్కలు ఒక గిన్నెతో కొలుచుకోవాలి.నాలుగు గిన్నెలు ముక్కలు ఐతే అదే గిన్నెతో కారం ఒక గిన్నె,ఉప్పు ముప్పావు గిన్నె ,ఆవపిండి ముప్పావు గిన్నె,నూనె ఒక గిన్నె తీసుకోవాలి .ఇలా కొలతలు చూసుకోవలి. నూనె తక్కువ ఐతే వేసుకోవచ్చు.
  5. ఇప్పుడు పెద్ద బేసిన్ లో మామిడి ముక్కలు వేసి 2 స్పూన్ నూనె వేసి 2 స్పూన్ పసుపు వేసి బాగా కలిపి అరగంట సేపు ఉండాలి.
  6. తరువాత ఉప్పు,కారం, ఆవపిండి, మెంతిపిండి వేసి అంతా ముక్కలకు కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత నూనె ,వెల్లుల్లి వేసి బాగా కలిపి మూత పెట్టి 2 డేస్ ఉండాలి.
  7. రెండురోజుల తరువాత పచ్చడి మళ్ళీ అంతా బాగా కలిపి శుభ్రమైన జాడీలో తీసుకోవాలి. తడి ఎక్కడా తగలకూడదు. మిక్సీలో ఆవపిండి వేసేటప్పుడు తడి లేకుండా ఉండాలి.
  8. మంచి సువాసనతో మామిడికాయ ఆవకాయ సిద్ధం .తడి తగలకుండా కొంచెం కొంచెం వేరే గిన్నెలో తీసుకుంటూ వాడుకుంటే సంవత్సరం వరకు చెడిపోదు. ఉప్పుకారం అన్నీ చూసుకోవాలి.ఉప్పు అస్సలు తక్కువ కాకూడదు.
 
Last edited:
అమ్మ, ఆవకాయ అస్సలు బోరు కొట్టవు అని ఏదో సినిమాలో అన్నట్టు నిజంగా ఆవకాయ అస్సలు బోర్‌ కొట్టదు. ఆవకాయ రుచిని ఆస్వాదించడానికి ఆంధ్ర , తెలంగాణ అనే తారతమ్యాలు ఉండవు, చిన్న పెద్ద అనే బేధం అస్సలే ఉండదు. పేదవాడికీ, ధనికుడికీ అందరికీ బంధువు ఈ ఆవకాయ. వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరూ పచ్చళ్ళు పెట్టే బిజీలో ఉంటారు. కానీ రుచిగా, సంవత్సరం వరకూ నిల్వ ఉండే పచ్చడి పెట్టడం అందరికీ సాధ్యం కాదు.
 
ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది
మాగాయ పేరిన నేయ్యితో మంతరిస్తుంది
మెంతికాయ మోజు పెంచేస్తుంది
తొక్కుడుపచ్చడి జిహ్వను తోడేస్తుంది
కోరు తొక్కుడుపచ్చడి ఆకలి పెంచేస్తుంది
బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది
పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది
పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది
చింతకాయ చింతించినా చూడరు
ఉసిరికాయ ఉసూరుమన్నా ఊరుకుంటారు
గోంగూరపచ్చడి ఘొల్లుమన్నా ఓదార్చరు
కొరివికారం కొరకొర చూసినా చలించరు
టమాటా టక్కుటమారాలు చేసినా పడరు
నిమ్మకాయ పచ్చడి నిక్కినీలిగినా
అల్లం పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు
వంకాయ బండపచ్చడి బాధపడినా
నువ్వు పచ్చడి నువ్వులేక నేను లేనన్నా
దోసావకాయ దోరగా నవ్వినా
నారింజకారం కవ్వించినా
కొత్తిమీరపచ్చడి కొంటెగా విజిలేసినా
పుదీనా పచ్చడి ప్రాణం పెడతానన్నా
క్యాబేజి పచ్చడి ఘుమఘుమలాడినా
కొబ్బరిపచ్చడి కూతపెట్టి పిలిచినా
బీరకాయ పచ్చడి బీరాలు పోతున్నా
కన్నెత్తయినా చూడని ఋష్యశృంగుడిలా
వేసవికాలమంతా వేడి ఆవిర్లు కమ్ముతున్నా
వడగళ్ల జడివానలు కురుస్తున్నా
చల్లని హేమంత శీతగాలులు వణికిస్తున్నా
అన్ని ఋతువుల అమృతమనుచు
మామిడికాయ తో కలిపిన ఆవకాయలకే
అగ్ర తాంబూలమిచ్చే తెలుగువారికి
ఎన్నెన్ని రుచులు ఇల లో ఉన్నా
కంటికింపుకాదు నోటికి రుచికాదు
మనసుకి తృప్తికలుగదన్నది నిక్కమని

అమ్మలా ఎప్పుడయినా ఆదరించేదావకాయ!..
 
ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది
మాగాయ పేరిన నేయ్యితో మంతరిస్తుంది
మెంతికాయ మోజు పెంచేస్తుంది
తొక్కుడుపచ్చడి జిహ్వను తోడేస్తుంది
కోరు తొక్కుడుపచ్చడి ఆకలి పెంచేస్తుంది
బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది
పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది
పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది
చింతకాయ చింతించినా చూడరు
ఉసిరికాయ ఉసూరుమన్నా ఊరుకుంటారు
గోంగూరపచ్చడి ఘొల్లుమన్నా ఓదార్చరు
కొరివికారం కొరకొర చూసినా చలించరు
టమాటా టక్కుటమారాలు చేసినా పడరు
నిమ్మకాయ పచ్చడి నిక్కినీలిగినా
అల్లం పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు
వంకాయ బండపచ్చడి బాధపడినా
నువ్వు పచ్చడి నువ్వులేక నేను లేనన్నా
దోసావకాయ దోరగా నవ్వినా
నారింజకారం కవ్వించినా
కొత్తిమీరపచ్చడి కొంటెగా విజిలేసినా
పుదీనా పచ్చడి ప్రాణం పెడతానన్నా
క్యాబేజి పచ్చడి ఘుమఘుమలాడినా
కొబ్బరిపచ్చడి కూతపెట్టి పిలిచినా
బీరకాయ పచ్చడి బీరాలు పోతున్నా
కన్నెత్తయినా చూడని ఋష్యశృంగుడిలా
వేసవికాలమంతా వేడి ఆవిర్లు కమ్ముతున్నా
వడగళ్ల జడివానలు కురుస్తున్నా
చల్లని హేమంత శీతగాలులు వణికిస్తున్నా
అన్ని ఋతువుల అమృతమనుచు
మామిడికాయ తో కలిపిన ఆవకాయలకే
అగ్ర తాంబూలమిచ్చే తెలుగువారికి
ఎన్నెన్ని రుచులు ఇల లో ఉన్నా
కంటికింపుకాదు నోటికి రుచికాదు
మనసుకి తృప్తికలుగదన్నది నిక్కమని

అమ్మలా ఎప్పుడయినా ఆదరించేదావకాయ!..
:tso::rock:
 
Pickles are always the main item in the menu of any Indian meal. A meal is never complete without a pickle and Mangoes are always everyone's favourite. If you are looking for a quick tasty meal then Pickles are the alternative, it makes simple meal super tasty.

Come summers, Mangoes are grown in abundance and Avakai is made in the households to last for almost a year.

There are specific varieties of mangoes used for making these mouthwatering pickles. Chinna Rasalu and Tella Gulabeelu are the main types which are generally used.

Andhra is synonymous with Avakai and the pickles they make are so tasty here. The process of making, storing, and serving it is considered to be a ritual of its own. Ava means mustard and kai means raw fruit and hence, the name. The mustard is powdered along with fenugreek and mixed with red chilli powder, turmeric powder, rock salt, and cups of pure sesame oil. There are also other variants to this such as Bellam Avakaya (Sweet Mango Pickle) and Avakaya / Mango Pickle with out Garlic


avakaya-pachadi-500x500.jpg

Some add garlic pods to this and if you want a non garlic version, you can simply avoid that. The Mangoes are cut into small cubes after being washed and wiped dry. Then cut mango is pickled with powdered mustard and fenugreek seeds, followed by turmeric powder, red chilli powder, and rock salt. After it is marinated well it is kept to rest for the spices to soak into the mangoes for almost 4 weeks. There is also a Tamil Nadu version of the same recipe which uses chick peas as one of the ingredients and is added along with the spices. The chickpeas, though not cooked, tends to become soft as it gets soaked in the oil for weeks together. It adds a special taste to the pickle. Avakai tastes excellent with curd rice and hot rice with ghee and mudda pappu or pigeon dal.

Let it be a simple meal or a quick meal that you would like to have, Andhra Avakai is always the first choice of taste. With a pinch of Ghee, hot rice and delicious avakaya, you can turn your fast meal into a panchabaksha paramannam. There is another variant of south Indian mango pickle called maagai or mamidi kaya thokku pachandi that can be purchased online at Sitara Foods.
 
Top