క్రికెట్ లో ఒక్క బంతికి 22 పరుగులు చేయాలి. మీరు చదువుతోంది నిజమే. క్రికెట్ చరిత్రలోనే అదో వండర్. కాకపోతే అదో చెత్త నిర్ణయం అని కూడా అంటారు. అసలేమిటీ కథా అని చూస్తే.. 1992 వన్డే ప్రపంచకప్ ను గుర్తుచేసుకోవాల్సి ఉంటుంది. ఆనాడు ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య పోరు జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ ఇంగ్లండ్ దే కావడంతో ఆరు వికెట్లు కోల్పోయి.. 252 పరుగులు చేసింది. తరువాత సౌతాఫ్రికా బ్యాటింగ్ కు దిగింది. కానీ ఆ టీమ్ ను ఎప్పటిలాగే బ్యాడ్ లక్ మాత్రం వెంటాడింది.

ఆరోజు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జోరుగా ఆడింది. మంచి ఫామ్ లో ఉండడంతో ఇక ఆ మ్యాచ్ గెలిచేస్తుంది అనుకున్నారు. ఎందుకంటే 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉంది. అంటే ఓవర్ కు కనీసం 11 పరుగులు చేస్తే చాలు. ఇక మ్యాచ్ కొట్టేసినట్టే అనుకున్న టైమ్ లో వర్షం పడింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. ఓ పది నిమిషాల తరువాత వర్షం ఆగిపోవడంతో ఆట మళ్లీ మొదలైంది. అప్పటికే సౌతాఫ్రికా ఆటగాళ్లు బ్రియాన్ మెక్ మిలన్, డేవిడ్ రిచర్డ్ సన్.. ఇద్దరూ బ్యాటింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక టార్గెట్ ను బద్దలుకొట్టడమే ఆలస్యం అనుకునేలోగా.. అంపైర్లు తీసుకున్న నిర్ణయం వారిని షాకయ్యేలా చేసింది. ఎందుకంటే వర్షం వల్ల బంతులను కుదించిన అంపైర్లు పరుగులను మాత్రం తగ్గించలేదు. దీంతో ఒక్క బంతికే 22 పరుగులు చేయాల్సి వచ్చింది. అయినా ఒక్క బంతికీ 22 పరుగులు ఎలా చేయాలో.. ఆ ఆటగాళ్లకు కాని, సౌతాఫ్రికా టీమ్ కు కాని, అసలు క్రికెట్ అభిమానులకు కాని ఎవరికీ అర్థం కాలేదు. దీంతో ఆ ఒక్క బంతినీ ఆడి.. గెలవకుండానే ఇంటిబాట పట్టింది దక్షిణాఫ్రికా జట్టు.
అయినా పది నిమిషాలు వర్షం పడితే 12 బంతులను తగ్గించిన అంపైర్లు.. పరుగులను మాత్రం ఎందుకు తగ్గించలేదు? అప్పట్లో అంపైర్ల నిర్ణయం పై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఆ నిబంధనను ఐసీసీ తొలగించింది. తరువాత డక్ వర్త్ లూయిస్ పద్దతిని తీసుకువచ్చింది. అలా 30 ఏళ్ల కిందట తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికీ క్రికెట్ అభిమానులను విస్మయానికి గురిచేస్తుంది