• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

❀✨✾అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం✾✨❀

Nihaaa

✨❤ The Sunshine of zozo❤✨
VIP
Posting Freak
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం (ఆంగ్లం: International Mother Language Day) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది.
IMG_20240221_101628.jpg
UNESCO1999 ఫిబ్రవరి 21 న అంతర్జాతీయ మాతృభాష దినంగా ప్రకటించింది. 2000 ఫిబ్రవరి 21 నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.బంగ్లాదేశీయులు (అప్పటి తూర్పు పాకిస్తానీయులు ) చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతి ఏట ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 1947 లో భారత దేశం, పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ రెండు భౌగోళికంగా వేర్వేరు భాగాలు ఏర్పడింది. ఒకటి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్ అని పిలుస్తారు) రెండవది పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుతం పాకిస్తాన్ అని పిలుస్తారు). సంస్కృతి, భాష మొదలైన వాటిలో రెండు ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉండేవి. ఈ రెండు భాగాలను భారతదేశం వేరు చేసింది.తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్తాన్ (ఇప్పుడు పాకిస్తాన్ ) కలిపి మెజారిటీ ప్రజలు బెంగాలీ లేదా బంగ్లా భాష ఎక్కువగా మాట్లాడేవారు.1948 లో అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూను పాకిస్తాన్ జాతీయ భాషగా ప్రకటించింది. దీనికి తూర్పు పాకిస్తాన్ ప్రజలు అభ్యంతరం తెలిపారు.తూర్పు పాకిస్తాన్ జనాభాలో ఎక్కువ భాగం బెంగాలీ మాట్లాడతారు. ఉర్దూతో పాటు బెంగాలీ కూడా జాతీయ భాషలలో ఒకటిగా ఉండాలని వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను తూర్పు పాకిస్థాన్‌కు చెందిన ధీరేంద్రనాథ్ దత్తా 1948 ఫిబ్రవరి 23 న పాకిస్తాన్ రాజ్యాంగ సభలో లేవనెత్తారు. తూర్పు పాకిస్తాన్ ప్రజలు (ప్రస్తుతం బంగ్లాదేశ్) నిరసనలు చేపట్టారు.భాష సమాన హోదా కోసం ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం 144 సెక్షన్, ర్యాలీలు, మొదలైనవి ఢాకా నగరంలో నిషేధించింది.ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు, సాధారణ ప్రజల సహకారంతో భారీ ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేశారు.1952 ఫిబ్రవరి 21 న ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సలాం, బర్కాట్, రఫీక్, జబ్బర్, షఫియూర్ మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. చరిత్రలో ఇది చాలా అరుదైన సంఘటన, ప్రజలు తమ మాతృభాష కోసం ప్రాణాలను అర్పించారు.పోలీసుల దాడికి నిరసనగా ముస్లిం లీగ్అదే రోజు పార్లమెంటరీ పార్టీకి రాజీనామా చేశారు. ఉద్యమం పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం చివరకు దిగి వచ్చింది. 1954 మే 8 న పాకిస్తాన్ రాజ్యాంగ సభలో బెంగాలీని రాష్ట్ర భాషలలో ఒకటిగా స్వీకరించారు. 1956 లో పాకిస్తాన్ మొదటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ఆర్టికల్ 214 లో బెంగాలీ ఉర్దూలను పాకిస్తాన్ రాష్ట్ర భాషలుగా పేర్కొంది. 1971 లో బంగ్లాదేశ్ స్వతంత్రమైనప్పుడు, బెంగాలీ ఏకైక రాష్ట్ర భాషగా ప్రవేశపెట్టబడింది. యునెస్కో బంగ్లా భాషా ఉద్యమం, మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని 1999 ఫిబ్రవరి 21, న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రకటించింది.
 
International Mother Language Day is a worldwide annual observance held on 21 February to promote awareness of linguistic and cultural diversity and to promote multilingualism. First announced by UNESCO on 17 November 1999, it was formally recognized by the United Nations General Assembly with the adoption of UN resolution 56/262 in 2002. Mother Language Day is part of a broader initiative "to promote the preservation and protection of all languages used by peoples of the world" as adopted by the UN General Assembly on 16 May 2007 in UN resolution 61/266, which also established 2008 as the International Year of Languages.
The idea to celebrate International Mother Language Day was the initiative of Bangladesh. In Bangladesh, 21 February (1952) is the anniversary of the day when the Bengalis i.e. East Pakistani Bengali people (now Bangladeshi Bengali people) of the Pakistani province of East Bengal (now independent state of Bangladesh) fought for recognition of their Bengali language.
It is also observed by the Indian Bengalis of the Indian states of West Bengal, Assam, Jharkhand, Tripura and the Union Territory of Andaman and Nicobar Islands.
 
నా తెలుగు గొప్పదనం
మిలో పరిమళ 'పద కుసుమం'
విశాల జగత్తులో ప్రశాంత 'భావ సంద్రం'
హర మనోహర 'మది వర్ణం'
మధులను విఖితం కమనీయ నాదనం.
మన హృదయ సంధాన 'భాషా వనం'
సొగసైన రాగం..
రమణీయ శ్రవణం...
మన ఎద పలికే 'సాహిత్య గంధర్వ గానం!:
ఇదే నే తెలుపగలిగిన 'నా తెలుగు గొప్పదనం'
 
✨
తెలుగు భాష గురించి..
* తెలుగు భాష క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల
నుండి వాడకంలో ఉంది.
* తెలుగు భాషను మొదట తెనుంగు లేదా
తెలుంగు అని పిలిచేవారు
* 2012లో నిర్వహించిన ఒక సర్వేలో ప్రపంచంలోనే
రెండో ఉత్తమ లిపిగా తెలుగు భాష ఎన్నికైంది
* ఏకాక్షర పద్యముల్ అంటే తెలుగులో ఒకే
అక్షరంతో ఉన్న పద్యం
* శ్రీలంకలోని జిప్సీ ప్రజలు ఎక్కువగా
తెలుగు మాట్లాడుతారు
* సామెతలు ఎక్కువగా ఉన్న భాషగా
తెలుగు గుర్తింపు పొందింది.
✨
 
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం (ఆంగ్లం: International Mother Language Day) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది.
View attachment 207128
UNESCO1999 ఫిబ్రవరి 21 న అంతర్జాతీయ మాతృభాష దినంగా ప్రకటించింది. 2000 ఫిబ్రవరి 21 నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.బంగ్లాదేశీయులు (అప్పటి తూర్పు పాకిస్తానీయులు ) చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతి ఏట ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 1947 లో భారత దేశం, పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ రెండు భౌగోళికంగా వేర్వేరు భాగాలు ఏర్పడింది. ఒకటి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్ అని పిలుస్తారు) రెండవది పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుతం పాకిస్తాన్ అని పిలుస్తారు). సంస్కృతి, భాష మొదలైన వాటిలో రెండు ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉండేవి. ఈ రెండు భాగాలను భారతదేశం వేరు చేసింది.తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్తాన్ (ఇప్పుడు పాకిస్తాన్ ) కలిపి మెజారిటీ ప్రజలు బెంగాలీ లేదా బంగ్లా భాష ఎక్కువగా మాట్లాడేవారు.1948 లో అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూను పాకిస్తాన్ జాతీయ భాషగా ప్రకటించింది. దీనికి తూర్పు పాకిస్తాన్ ప్రజలు అభ్యంతరం తెలిపారు.తూర్పు పాకిస్తాన్ జనాభాలో ఎక్కువ భాగం బెంగాలీ మాట్లాడతారు. ఉర్దూతో పాటు బెంగాలీ కూడా జాతీయ భాషలలో ఒకటిగా ఉండాలని వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను తూర్పు పాకిస్థాన్‌కు చెందిన ధీరేంద్రనాథ్ దత్తా 1948 ఫిబ్రవరి 23 న పాకిస్తాన్ రాజ్యాంగ సభలో లేవనెత్తారు. తూర్పు పాకిస్తాన్ ప్రజలు (ప్రస్తుతం బంగ్లాదేశ్) నిరసనలు చేపట్టారు.భాష సమాన హోదా కోసం ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం 144 సెక్షన్, ర్యాలీలు, మొదలైనవి ఢాకా నగరంలో నిషేధించింది.ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు, సాధారణ ప్రజల సహకారంతో భారీ ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేశారు.1952 ఫిబ్రవరి 21 న ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సలాం, బర్కాట్, రఫీక్, జబ్బర్, షఫియూర్ మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. చరిత్రలో ఇది చాలా అరుదైన సంఘటన, ప్రజలు తమ మాతృభాష కోసం ప్రాణాలను అర్పించారు.పోలీసుల దాడికి నిరసనగా ముస్లిం లీగ్అదే రోజు పార్లమెంటరీ పార్టీకి రాజీనామా చేశారు. ఉద్యమం పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం చివరకు దిగి వచ్చింది. 1954 మే 8 న పాకిస్తాన్ రాజ్యాంగ సభలో బెంగాలీని రాష్ట్ర భాషలలో ఒకటిగా స్వీకరించారు. 1956 లో పాకిస్తాన్ మొదటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ఆర్టికల్ 214 లో బెంగాలీ ఉర్దూలను పాకిస్తాన్ రాష్ట్ర భాషలుగా పేర్కొంది. 1971 లో బంగ్లాదేశ్ స్వతంత్రమైనప్పుడు, బెంగాలీ ఏకైక రాష్ట్ర భాషగా ప్రవేశపెట్టబడింది. యునెస్కో బంగ్లా భాషా ఉద్యమం, మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని 1999 ఫిబ్రవరి 21, న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రకటించింది.
images(82).jpg
 
Top