• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

స్త్రీ

ఈ సృష్టిలో ఎంత పొగిడిన తక్కువే అనుకునేలా ఏదైనా వుంది అంటే స్త్రీ అనే చెప్పాలి .స్త్రీ అనగానే కొందరికి ఏ బాపు బొమ్మో లేక రంభ ఊర్వశి మేనకలో గుర్తొస్తారు .కొంత మందికి పిల్లలకి పాలు ఇచ్చే తల్లి గుర్తొస్తుంది .ఎవరి మనసు లో భావం ఎలా ఉంటే అలానే గుర్తుకి రావడం సహజమే లే .

సరే, ఎప్పుడూ స్త్రీ లో అందాలని పొగడడమేనా ఆమె పుట్టుకే ఒక వింత .ఆమెని భగవంతుడు సృష్టి కార్యం కోసమే చేసాడో లేదా మగాడికి తోడు కావాలని చేసాడో తెలియదు కానీ స్త్రీ ని అయితే సృష్టి కి అందించాడు .సరే ఒక స్త్రీ వ్యధ ఏంటో చూద్ధం

. అమ్మ కడుపులోంచి వచ్చాను . మా ఇంటి మహా లక్ష్మి అన్నారు అమ్మ నాన్న ,అల్లారు ముద్దుగా పెంచారు .కొంచెం వయసుకొచ్చాక స్నేహితులతో ఆడుతుండగా పొత్తికడుపులో తట్టుకోలేని బాధ నా కాళ్ళ వైపు చూస్తే రక్తం కారుతుంది .స్నేహితురాలు ఇంట్లో చెప్తే నాన్న నన్ను ఇంటికి తీసుకెళ్లారు .నాకు ఏదో ఫంక్షన్ చేస్తున్నారు .అమ్మ ఏమో ఇక నువ్వు మగ పిల్లలతో చనువుగా ఉండకూడదు అనింది .చిన్న దానినే అయినా సమాజం లో చూసి చూసి తెలుసుకున్న అబ్బాయి అమ్మాయి దూరంగా ఉండాలి ఏమో అని .అప్పటి నుండి నా శరీరం లో చాలా మార్పులు వచ్చాయి .ఇక ప్రతి నెలా రుతుస్రావం అని కలుక్కు కలుక్కు అంటూ వచ్చే నా కడుపు నొప్పి, పోతున్న నా రక్తం ఇంకా జననాంగం శుభ్రం చేసుకునేప్పుడు దుర్వాసన ఆడదానిగా పుట్టాక తప్పుతుందా .అద్దం లో గుండ్రంగా తిరిగి చూసుకొని పొంగుతున్న అదరములు చూసుకొని మురిసిపోయా ఆడోళ్లకి అవే కదా అందం .కూతురు వయసున్న నన్ను చేడు దృష్టితో చూసే నాన్న స్నేహితులు లేకపోలేదు .సొంత కూతురిలా హత్తుకున్నా వాళ్ళు లేకపోలేదు .సరే అమ్మాయిని కదా పుట్టేసాను దేవతలు సైతం రాక్షసుల బారి నుండి కాపాడ మని పరమ శివుణ్ణి వేడుకున్నారు .వాళ్ళకే తప్పలేదు మనం ఎంత .ఆ రాక్షసులకు కనీసం పరమ శివుడు అంటే భయం అయినా వుంది .ఈ నరరూప రాక్షసులకు మాత్రం ఆ భయం కూడా లేకపోయ .మహిళలపై దాడుల్ని చూసి బయటకి వెళ్లాలంటే భయపడుతూ అడుగులు వేయాలి .నా అందాలు అనుభవించాలని కాలేజీ లో స్నేహితుని ముసుగులో ఒకడు ప్రియుడి ముసుగులో మరొకడు అన్నట్టు వాళ్ళ తిప్పలు వాళ్ళవి .అందరూ అలా వుండరులే మల్లీ నన్ను తిట్టుకుంటారు .అదిగో ఇదిగో అనేసరికి ఉద్యోగం వచ్చింది .నిండిపోయిన మెట్రో రైలులో అక్కడ ఇక్కడ వత్తడాలు .బయట పడలేని వ్యధ .నేను మంచి వయసులో వున్నా సరే..., చివరకి తల్లి వయసున్న ఆమెని వదలడం లేదే నీచులు .ఆఫీస్ లో ఏమో దాదాపు అందరూ మగాళ్లే ,సగం పైగా మంచోళ్ళే కానీ ఎవడో ఒకడు దుష్టుడు ఉంటాడు అక్కడ కూడా .ఒక్కదానినే రాత్రి కొంచెం ఆలస్యం అయితే రోడ్ మీదకి రావాలంటే భయం .జరగరానిది ఏమైనా జరిగితే అసలు ఆడపిల్లకి ఆ సమయం లో ఎం పని అనే రాతి యుగం మనుషులు .అదిగో ఇదిగో అనుకునే లోపు ముక్కు ముఖం తెలియని వాడు పెళ్లి చేసుకొని నువ్వు నా సొంతం అంటాడు .పెళ్లి అయిందో లేదో ఇక మీద పడిపోయి నన్ను పిప్పిని చేసేస్తాడు రాత్రులు .నెల తప్పిస్తాడు .హా సృష్టి కార్యం అంట ఇది .

మగ పిల్లాడే కావాలి అంట మళ్ళీ .నేనేమైన మెషిన్ పెట్టుకున్నానా లోపల .అయినా ఆడపిల్లని కంటే కాపాడుకోలేక తంటాలు పడాలి ఈ సమాజంలో మృగాళ్ల నుండి మగపిల్లాడు అయితేనే నయం అనిపిస్తుంది .
ఆరో నెల నుండి ఒకటే వాంతులు వికారం కడుపులో అసలే బిడ్డ వున్నాడు నా భాధ అంతా ఇంతా కాదు .పట్టరాని నొప్పులతో నా ప్రాణం మీదకి తెచ్చుకుని బిడ్డకి జన్మనిచ్చెసా .
విచిత్రం ఏమిటంటే నా చను మొనలు నా బిడ్డ నోటికి అందిస్తుంటే ఏదో తీయని మధుర స్పర్శ .ఇదే శృంగారం లో మా ఆయన పెదవులకి అందిస్తే విరహపు జ్వాల.సృష్టి ఎంత గొప్పదో కదా .ఇక పిల్లాడిని చంకనేసుకొనే ఇంట్లో పనులు .వాడి వయసు పెరిగే కొద్ది స్కూల్ లో జాయిన్ చేసే దాకా ఇంట్లో అల్లరి ,ఇల్లంతా చిందర వందర .మళ్ళీ నెల తప్పడం మళ్ళీ ఇదే తంతు ఇక .మా అత్తగారికి ఒకరు సరిపోరంట అదేమంటే నేను నలుగురిని కనలేదా అంటుంది .ఎంత అందంగా ఉంటే ఏమి లాభం లే ఇద్దరి పిల్లల తల్లిని అయ్యిపోయాగా భర్తకి బోర్ కొట్టేసా .ఇక చిత్తకార్తే చిత్తడిగా వాన జల్లు అన్నట్టు ఉంటుంది శృంగారం .చిత్త కార్తెలో పడాల్సిన వాన కూడా రావడం లేదు ఈ కాలం లో మార్పుల వళ్ళ. ఇక మనుషుల శృంగారం ఎంతలే . ఇంట్లో పనులు ,పిల్లలు , ఆఫీస్ లో ఉద్యోగం అబ్బబ్బబ్బా క్షణం తీరిక లేకపోయే .కుర్ర కారు చూపులు బాణాల వలే తాకుతున్నా కూడా చలించక పాతివ్రతనై నిలిచా .హమ్మయ్య నా రుతు చక్రం ఆగిపోయింది ఇక ప్రతినెలా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు అనుకునే లోపల పొడిబారిన జననాంగ సమస్యలు .ప్రతి నెలా గైనకాలిజిస్టు ని కలవాల్సిందే .ఎందరు కవులు నా అందాన్ని పొగిడిన ,ఎందరు కవులు నా గొప్ప తనాన్ని పొగిడినా సమాజం లో స్త్రీకి మాత్రం అన్నింటిలోనూ ఇబ్బంధులే .

నా ప్రియురాలి మాటలు నా ద్వారా తెలియచేస్తున్న .తప్పులు ఉంటే క్షమించండి .
 
:inlove:well said yaar✨:clapping:
@chekatlo chandrudu
 
Top