• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

ప్రపంచ జల దినోత్సవం...

Risikumar Reddy

Epic Legend
ప్రకృతి నుంచి మనం ఎంత వాడుకుంటున్నామో అంతే..
భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
నీటిని ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది.
కనుక ఇంట్లో లీకేజీలు లేకుండా చూసుకోవడం,
నీరు వృధా చేయకుండా వాడుకోవడం వల్ల కొంత వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు... వరల్డ్ వాటర్ డే సందర్భంగా మరి నీటిని మీరు ఎలా పొదుపుగా వాడుకుంటారు,.. నీటి వృధాను అరికట్టేందుకు మీరిచ్చే సలహాలను కామెంట్ చేయండి....

FB_IMG_1647938823681.jpg
 

ప్రపంచ జల దినోత్సవం: పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో నీటి కోసం సైన్యం కాపలా!​


జీవ మనుగడకు ఆధారమైన నీటి గురించి మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండదని తెలిసిందే. అయితే, అన్ని పదార్థాల మాదిరిగా సాధారణ రసాయిన నిమయాలను నీళ్లు పాటించవు. ఆ విరుద్ధ స్వభావం వల్లే భూమ్మీద జీవ మనుగడ సాధ్యం అయింది. మన భూగోళం మీద నీరు మొదట వాయురూపంలో ఉండేది. తేలికైన ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులతో అది రూపొందింది. చల్లబడితే అన్ని రసాయన పదార్థాల మాదిరిగా కాకుండా నీరు విస్తరిస్తుంది. అందువల్లే మంచుగడ్డలు నీటిపై ప్రవహిస్తాయి.​


మార్చి 22 న ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, ‘పర్యావరణం, ప్రగతి’ అనే అంశంపై బ్రెజిల్‌లోని రియో డిజనీరియో వేదికగా 1992లో జరిగిన ఐరాస సమావేశంలో రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా ఏటా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా పాటిస్తున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఈ ఏడాది ‘Groundwater, making the invisible visible’ థీమ్‌ను ఐరాస ప్రకటించింది.

భూగర్భ జలాల ప్రాముఖ్యతపై దృష్టి సారించి, అధిక దోపిడీ గురించి అవగాహన పెంచడమే ఈ థీమ్ లక్ష్యం. వరల్డ్‌వాటర్‌డే డాట్ ఆర్గ్ ప్రకారం.. ప్రపంచంలోని మంచినీళ్లు దాదాపు భూగర్భ జలాలే. ఐరాస అంచనా ప్రకారం.. ప్రపంచంలోని 2.2 బిలియన్ల మంది ప్రజలు సురక్షితమైన నీరు అందుబాటులో లేకుండానే జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి ప్రతీ ఒక్కరికీ పరిశుభ్రమైన నీటిని అందజేయడమే లక్ష్యంగా ఐరాస పెట్టుకుంది. ఇక, అంతరిక్షం నుంచి చూస్తే భూమి నీలి రంగులో కనిపించడానికి కారణం నీరు. భూమిపై 75 శాతం వరకూ నీటి వనరులు ఉన్నాయి.

భూగోళం మీద నీటి వనరులలో 99 శాతం ఉప్పు నీరే. ఇందులో 97 శాతం సముద్రాల్లో ఉండగా, మిగతాది నదులు, చెరువుల్లో ఉంది. తాగడానికి ఉపయోగపడే జలాలు కేవలం 1 శాతం మాత్రమే ఉన్నాయి. అందులో 0.86 శాతం చెరువులు, 0.02 శాతం నదుల్లో, మిగతా 0.12 శాతం భూగర్భ జలాలు. అంటే ప్రపంచ వ్యాప్తంగా కేవలం 0.3 శాతం ఉపయోగపడే నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వనరులే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 750 కోట్ల మందికిపైగా దాహాన్ని, ఇతర అవసరాలను తీరుస్తున్నాయి.

భారత్‌లో సింధు నాగరికత, ఈజిప్టులో నైలు నది నాగరికత ఇలా ప్రపంచ నాగరికతలు నదీ తీరాలు, నీటి వనరులకు సమీప ప్రాంతంలో విలసిల్లాయి. మన చరిత్రంతా జలవనరులతోనే ముడిపడి ఉంది. జీవం నీటితో మొదలైంది.. ప్రకృతి నీటితోనే నడుస్తోంది. అభివృద్ధి జరగాలంటే నీటి వనరులు కావాలి. జీవవైవిధ్య రక్షణ, జీవం నీటితోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ తెలిసినా ఈరోజు జరుగుతున్నదేంటి? నీటిని వృధా చేస్తూ కలుషితం చేసి విషతుల్యంగా మార్చేస్తున్నాం. ప్రపంచంలో కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతుంటే, ఉన్న నీటిని వృధాగా నేల పాలు చేస్తున్నాం. నీటి వనరులను వ్యర్థాలతో కలుషితం చేసి తాగడానికి వీల్లేని విధంగా తయారుచేస్తున్నాం.

‘‘2050 నాటికి ఈ భూమ్మీద తాగడానికి పుష్కలమైన జలం ఉండనే ఉండదు.. జనం స్నానాలు చేయడం మానేసి శరీరానికి రసాయనిక లేపనాలు పులుముకుంటారు.. కెమికల్ బాత్ చేస్తారు.. సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం నీటి వనరుల చుట్టు కాపలా ఉంటుంది.. తలంటు కోవడానికి నీరు సరిపోక ప్రజలందరూ బోడి గుండుతో జీవిస్తారు.. స్త్రీ పురుషులందరూ రోజు తల షేవ్ చేసుకునే పరిస్థితి వస్తుంది’’ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారంటే పరిస్థితిని ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.

భారతీయులకు నీటి విలువ తెలుసు కాబట్టే నీటిని గంగమ్మ అంటూ పూజించి, నదులకు, చెరువులకు, జలాశయాలకు హారతులిస్తారు. నారం అంటే నీరు. నీటిలో ఉంటాడు కాబట్టి శ్రీమహావిష్ణువుకు నారాయణుడు అని పేరు. నీటినే రూపంగా స్వీకరించి విష్ణువు నీటి విలువను తెలియజేస్తున్నారు. శివుడు ఏకంగా గంగను తన తలపై ధరించి గంగాధరుడయ్యాడు. నీరు పారబోయాల్సింది కాదు, నెత్తిన పెట్టుకుని పూజించాలని సమస్త మానవాళికి సందేశం ఇచ్చారు.

నీటిని వృధా చేయడం సృష్టికి, భగవత్తత్వానికి, సమస్త ప్రాణకోటికి వ్యతిరేకం. నీటిని కాపాడాలి, ప్రతి నీటి బొట్టూ విలువైందే. ఆలోచించండి... భూగోళంలో కేవలం 0.3 శాతం మాత్రమే శుద్ధనీటి వనరులు ఉన్నాయి. ఇప్పటికే చాలా భాగం కలుషితమయ్యాయి. పూర్తిగా కలుషితమైతే పరిస్థితేంటి? రాబోయే తరాలకు మనం ఇచ్చేదేంటి?
 
ప్రపంచ నీటి దినోత్సవం ఐరాస జరిపే వార్షిక దినోత్సవం. దీన్ని ఏటా మార్చి 22 న జరుపుతారు. ఇది మంచినీటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మంచినీటి వనరుల స్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈ రోజును ఉపయోగిస్తారు. 1992 బ్రెజిల్ లోని రియో డి జనీరోలో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సమావేశం (UNCED) ఎజెండా 21 లో ఈ దినోత్సవాన్ని మొదట ప్రతిపాదించారు. తొలి ప్రపంచ నీటి దినోత్సవం 1993 లో జరిగింది.
ఆ రోజు ఇతివృత్తంగా పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత లకు సంబంధించిన అంశాలపై దృష్టి పెడుతుంది. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్‌లోని ఆరవ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఐరాస ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక (WWDR) విడుదల అవుతుంది.

యుఎన్-వాటర్ ప్రపంచ జల దినోత్సవానికి కన్వీనరు. ప్రతి సంవత్సరం, ఆ రోజునటి థీమ్‌గురించి దానిపట్ల ఆసక్తి ఉన్న ఐరాస సంస్థలతో సంప్రదిస్తుంది. 2020 యొక్క థీమ్ "నీరు, వాతావరణ మార్పు". ఈ రెండు సమస్యల మధ్య విడదీయరాని అనుసంధానం ఎలా ఉందో పరిశీలిస్తుంది. COVID-19 మహమ్మారి కారణంగా, 2020 ప్రచారంలో చేతులు కడుక్కోవడం గురించి, పరిశుభ్రత గురించి సందేశాలను ఇచ్చి ప్రోత్సహించింది. ప్రచారానికి మద్దతు ఇస్తూ సురక్షితంగా ఉండటానికి మార్గదర్శకత్వం ఇచ్చింది.

2019 నాటి థీమ్ "ఎవరినీ వెనకబడ నివ్వం". 2014 నుండి 2018 సంవత్సరాలకు ఇతివృత్తాలు "నీరు, శక్తి" , "నీరు, సుస్థిర అభివృద్ధి","నీరు, ఉద్యోగాలు" , "నీటిని ఎందుకు వృథా చేస్తారు?", "నీటొ కోసం ప్రకృతి"

ప్రపంచ జల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలతో జరుపుకుంటారు. ఇవి నాటకం గాని, మ్యూజికల్, లేదా ప్రకృతిలో లాబీయింగ్ గానీ కావచ్చు. ఆ రోజున నీటి ప్రాజెక్టుల కోసం డబ్బును సేకరించే ప్రచారాలను కూడా చేపట్టవచ్చు.
 
భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము. నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము.

కరెన్సీ నోట్లపై ఈ గీతలని గమనించారా.. వాటి చరిత్ర ఏంటో తెలుసా..! ప్రప్రథమ జీవి పుట్టుక నీటితోనె జరిగింది. భూతలం నాల్గింట మూడు వంతులు మహాసముద్రాలు, నదులు, తటాకాలు వంటి ఉపరితల జలాలతో నిండి ఉంది. ప్రకృతిలో లభ్యమయ్యే నీటిలో అతిశుద్ధమైనది వర్షపు నీరు



మనం నివసించే భూగోళంలో 70 శాతానికిపైగా నీరే. అయితే, ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే. మొత్తం భూగోళంలోని నీటిలో దాదాపు 2.7 శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా, ఇందులోనూ 75.2 % ధృవప్రాంతాలలో మంచురూపంలో ఘనీభవించి వుంటే, మరో 22.6 % నీరు భూగర్భంలో వుంది. మిగతా నీరు సరస్సులు, నదులు, వాతావరణం, గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ, చెట్టు చేమలలో వుంటుంది. ఇంతేకాదు, సరస్సులు, నదులు, భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరాలకు చక్కగా ఉపయోగపడగలిగిన నీరు, చాలా కొద్ది పరిమాణం మాత్రమే. ప్రతిరోజూ మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. కాని, ఇప్పటికీ, 88.4 కోట్ల మంది ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.

eee.png


అభివృద్ధిచెందుతున్న దేశాలలో, తగిన నిబంధనలు, వనరులు లేనికారణంగా, 80 శాతం వ్యర్ధాలను పునర్వినియోగ ప్రక్రియకు మళ్ళించకుండానే పారవేస్తున్నారు. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక ప్రగతికూడా, కొత్తరకాల కాలుష్యానికి మూలమవుతున్నాయి. ఇదే దామాషాలో, పరిశుభ్రమైన నీటి అవసరం పెరుగుతున్నది. ఈ కారణంగా, ఇటు వర్తమానంలోను, అటు భవిష్యత్తులోను మానవ ఆరోగ్యానికి , పర్యావరణ స్వచ్ఛతకు ముప్పు పొంచివుండగా ; తాగడానికి ఉపయోగపడే పరిశుభ్రమైన నీటికి, వ్యవసాయ అవసరాలకు కావలసిన నీటికి తీవ్రమైన కొరత ఏర్పడుతున్నది. అయినప్పటికి, నీటి కాలుష్యం ‘అత్యవసరంగా దృష్టిసారించవలసిన అంశం’ అనే ప్రస్తావన, అరుదుగా కాని రావడంలేదు.
 
Last edited:
నీళ్ల గురించి చెప్పమంటే మంచినీళ్లు తాగినంత ఈజీగా చెప్పొచ్చు అని అనుకుంటున్నారా?

జీవ మనుగడకు ఆధారమైన నీటి గురించి మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.

ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటి గురించి మరికొంత తెలుసుకుందాం.

రంగు, రుచి, వాసన లేని పదార్థం నీరు అనే విషయం మనకు తెలిసిందే.

అయితే, అన్ని పదార్థాల మాదిరిగా సాధారణ రసాయిన నిమయాలను నీళ్లు పాటించవు.

ఆ విరుద్ధ స్వభావం వల్లే భూమ్మీద జీవ మనుగడ సాధ్యం అయింది.



నీటి గురించి మీకు తెలియని విషయాలు


మన భూగోళం మీద నీరు మొదట వాయురూపంలో ఉండేది.


తేలికైన ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులతో అది రూపొందింది.

శీతలీకరిస్తే అన్ని రసాయన పదార్థాల మాదిరిగా కాకుండా నీరు విస్తరిస్తుంది. అందువల్లే మంచుగడ్డలు నీటిపై ప్రవహిస్తాయి.

నిజానికి ఇది చాలా అసహజంగా కనిపిస్తుంది.

మంచు యుగాల నుంచి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి కారణంగా గడ్డ కట్టిన నీటిలోనూ జీవరాశులు బతికేలా చేసింది.

ఇదొక్కటే కాదు. చల్లటి నీటి కంటే వేడి నీళ్లే త్వరగా గడ్డకడుతాయనే విషయం మీకు తెలుసా.. చాలా మందికి తెలియదు.

గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా నీళ్లు ప్రవహించగలవు. అందువల్లే మన శరీరంలోని పై భాగంలో ఉన్న మెదుడుకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది.

భూమి నుంచి మొక్కలు నీటిని గ్రహిస్తున్నాయి. మరో విషయం... మన సౌరవ్యవస్థలో చాలా చోట్ల నీటి ఆనవాళ్లు ఉన్నాయి.

నీటితో ఉన్న గ్రహం మనదొక్కటే అని ఇన్నాళ్లు భావించాం.

కానీ, నిజానికి సౌర వ్యవస్థ నీటితోనే ఉంది. చంద్రుడు, అంగాకరకుడు, ప్లూటో గ్రహాల్లోనూ నీటి ఆనవాళ్లు ఉన్నట్లు ఇటీవల కనిపెట్టాం.

ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. గ్లాసులో నీళ్లు పోసి రంగు, రుచి, వాసనలు లేని ఆ అద్భుత పదార్థాన్ని చూడండి.

నీటికి ఆ విచిత్ర లక్షణం లేకుంటే మీరు, నేనే కాదు ఈ భూమ్మీద జీవమే లేదు.
 
నీళ్ల గురించి చెప్పమంటే మంచినీళ్లు తాగినంత ఈజీగా చెప్పొచ్చు అని అనుకుంటున్నారా?

జీవ మనుగడకు ఆధారమైన నీటి గురించి మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.

ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటి గురించి మరికొంత తెలుసుకుందాం.

రంగు, రుచి, వాసన లేని పదార్థం నీరు అనే విషయం మనకు తెలిసిందే.

అయితే, అన్ని పదార్థాల మాదిరిగా సాధారణ రసాయిన నిమయాలను నీళ్లు పాటించవు.

ఆ విరుద్ధ స్వభావం వల్లే భూమ్మీద జీవ మనుగడ సాధ్యం అయింది.



నీటి గురించి మీకు తెలియని విషయాలు


మన భూగోళం మీద నీరు మొదట వాయురూపంలో ఉండేది.


తేలికైన ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులతో అది రూపొందింది.

శీతలీకరిస్తే అన్ని రసాయన పదార్థాల మాదిరిగా కాకుండా నీరు విస్తరిస్తుంది. అందువల్లే మంచుగడ్డలు నీటిపై ప్రవహిస్తాయి.

నిజానికి ఇది చాలా అసహజంగా కనిపిస్తుంది.

మంచు యుగాల నుంచి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి కారణంగా గడ్డ కట్టిన నీటిలోనూ జీవరాశులు బతికేలా చేసింది.

ఇదొక్కటే కాదు. చల్లటి నీటి కంటే వేడి నీళ్లే త్వరగా గడ్డకడుతాయనే విషయం మీకు తెలుసా.. చాలా మందికి తెలియదు.

గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా నీళ్లు ప్రవహించగలవు. అందువల్లే మన శరీరంలోని పై భాగంలో ఉన్న మెదుడుకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది.

భూమి నుంచి మొక్కలు నీటిని గ్రహిస్తున్నాయి. మరో విషయం... మన సౌరవ్యవస్థలో చాలా చోట్ల నీటి ఆనవాళ్లు ఉన్నాయి.

నీటితో ఉన్న గ్రహం మనదొక్కటే అని ఇన్నాళ్లు భావించాం.

కానీ, నిజానికి సౌర వ్యవస్థ నీటితోనే ఉంది. చంద్రుడు, అంగాకరకుడు, ప్లూటో గ్రహాల్లోనూ నీటి ఆనవాళ్లు ఉన్నట్లు ఇటీవల కనిపెట్టాం.

ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. గ్లాసులో నీళ్లు పోసి రంగు, రుచి, వాసనలు లేని ఆ అద్భుత పదార్థాన్ని చూడండి.


నీటికి ఆ విచిత్ర లక్షణం లేకుంటే మీరు, నేనే కాదు ఈ భూమ్మీద జీవమే లేదు.
Well said
 
Top