నాలుగు సంవత్సరాల చిన్న పాప.అప్పుడప్పుడే గెంతడం చిన్న చిన్న అల్లర్లు చేయడం చేస్తూ ఆ కుటుంబాన్ని ఎంతగానో మురిపించిన ఆ పాప .ఇంట్లో నానమ్మ తాతయ్య నిద్రపోతున్నారు అమ్మ ఏమో వంట చేస్తూ వుంది ఆరుబయట గేటు తెరిచే వుంది అతను ఎవరో తెలీదు ఎప్పుడూ అతడిని ఆ చుట్టుపక్కల ఎవరూ చూసింది లేదు హాల్ లో వున్న పాపకి ఆట బొమ్మ చూపించి ఇలా రా అన్నాడు. ఎవరు మన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలియని తన వయసు తనది ,అతడు పిలవగానే వెళ్ళింది ఇక అంతే ఆ పాప వేలు పట్టుకొని కొంచెం దూరం నడిపించాడు .ఆ పాప అమ్మ అంటూ మారం చేయసాగింది . ఆ పాపని ఎత్తుకొని కనుచూపు మేర కనపడని అంత దూరం తీసుకెళ్ళిపోయాడు .చిన్నూ అన్నం పెడుతా రా నానా అని పిలిస్తే సమాధానం లేదు ఏంటా అని ఇల్లంతా చూస్తే ఎక్కడా కనిపించలేదు . అత్తయ్య మామయ్య అని కేక పెట్టి ఏడుస్తోంది పాప కనిపించడం లేదు అని. సిటీలో వుండడం తో ఎవరు పాపని ఎవరు పట్టించుకుంటారు అక్కడ ఇక్కడ అడిగితే ఒకతను ఎత్తుకొని వెళ్ళాడు ఇప్పుడే చూసా అని ఒక వ్యక్తి చెప్పాడు . చెప్పులు కూడా లేని కాళ్లతో పరుగు పెట్టింది అయినా జాడ లేదు .పోలీసులకి చెప్తే ఒక్కరు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు కంప్లైంట్ ఇవ్వండి పట్టుకుంటాం అన్నారు . అతను ఎంతో దూరం వెళ్లి ఉండదు ఇప్పుడే పట్టుకోండి నా బిడ్డని నాకు అప్పజెప్పండి అంటూ కాళ్ళు పట్టుకుంది అయినా వారు కనికరించకపోగా పిల్లలని వదిలేసి మీ పని మీరు చేసుకుంటూ బాధ్యాత లేకుండా వదిలేసి మమ్మల్ని అంటారేంటి పిల్లలని కంటె సరిపోదు అన్నట్టు పుండు మీద కారం చల్లినట్లు మాట్లాడుతున్నారు .ప్రతి రోజు నా బిడ్డకి ఏమైన పెట్టారో లేదో నా బిడ్డ ఆకలికి తట్టుకోలేదు అనుకుంటూ ఆ తల్లి పడిన మానసిక శోభ అంతా ఇంతా కాదు . ఇక బాధ భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకుంది కానీ ఒక వేళ బిడ్డ ఆచూకీ తెలిస్తే అప్పుడు అమ్మ అని పిలిస్తే పలకడానికి నేను లేకుంటే నా బిడ్డ ని ఎవరు చూసుకుంటారు అని అనుకొని గుండెలు పగిలేంత బాధ అనుభవిస్తూ అనరోగ్యం బారీన పడి చివరికు 10 సంవత్సరాల బాధ బరించిన ఆమెకి ఆ దేవుడు విముక్తి కల్పించాడు .దేవుడి మనసు ఎంత కఠినమైనదో కదా .
ఓ దేవుడా నీకు మనసు అనేది ఒకటుంటే ఎవరి కర్మలకు ఎవరినీ బాధ్యులని చేసి ఆడుకుంటావ్ నువ్వు .
మన బిడ్డలని మనమే కాపాడుకోవాలి .సమాజం లోని ఏ వ్యవస్థ మన బిడ్డలని కాపాడలేదు .
తల్లి తండ్రి వున్నా పిల్లలని అనాధగా మారుస్తున్న ఈ పిల్లలని అపహరించుకుపోయే వెధవలని తరిమి తరిమి కొట్టాలి .
ప్రతి ఒక్క తల్లి తండ్రికి హెచ్చరిక పిల్లల పట్ల హేమరపాటు పాటు పనికిరాదు.
ఓ దేవుడా నీకు మనసు అనేది ఒకటుంటే ఎవరి కర్మలకు ఎవరినీ బాధ్యులని చేసి ఆడుకుంటావ్ నువ్వు .
మన బిడ్డలని మనమే కాపాడుకోవాలి .సమాజం లోని ఏ వ్యవస్థ మన బిడ్డలని కాపాడలేదు .
తల్లి తండ్రి వున్నా పిల్లలని అనాధగా మారుస్తున్న ఈ పిల్లలని అపహరించుకుపోయే వెధవలని తరిమి తరిమి కొట్టాలి .
ప్రతి ఒక్క తల్లి తండ్రికి హెచ్చరిక పిల్లల పట్ల హేమరపాటు పాటు పనికిరాదు.