కటిక చీకట్లో సైతం చెట్లకూ, స్తంభాలకూ గుద్దుకోకుండా గబ్బిలాలు ఎలా వేగంగా ఎగరగలుగుతున్నాయో తెలుసుకోవడానికి చాలాకాలం పట్టింది. అలా ఎగిరేటప్పుడు వాటి దారిలో వచ్చిన పురుగులను తినేస్తూ ఉంటాయి కూడా.
ఇలా ఎలా అని కొంతమంది శాస్త్రజ్ఞులు మూడు ప్రయోగాలు నిర్వహించారు. మొదటి ప్రయోగంలో భాగంగా ఒక పెద్ద గదిలో తీగలు కట్టి, కొన్ని గబ్బిలాలకు కళ్ళకు గంతలు కట్టి వదిలిపెట్టారు. అవి ఏ తీగలకూ తగలకుండా, గోడలకు గుద్దుకోకుండా వేగంగా ఎగరగలిగాయి.
తరువాతి ప్రయోగంలో భాగంగా కళ్ళకి గంతలు తీసేసి, చెవుల్లో బిరడాలు పెట్టారట. ఈసారి మాత్రం కాస్త తడబడ్డాయిట. మాటిమాటికీ గోడలకీ, తీగలకీ గుద్దుకున్నాయిట.
మూడో ప్రయోగంలో చెవులకు బిరడాలు తీసేసి, నోరు కట్టేసి ప్రయత్నించారట. ఈసారి కూడా అదే తంతు. తీగలకీ, గోడలకీ గుద్దేసుకున్నాయిట.
దీనిబట్టి తెలిసిందేమిటీ అంటే గబ్బిలాలు ఎగిరేటప్పుడు తమ నోటితో ఒక శబ్ధాన్ని చేస్తాయిట. ఈ శబ్ధాల తరంగాలు మామూలు ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉంటుందిట. సుమారుగా సెకండుకి 45,000-50,000 సార్లు ఉండటం వల్ల మన చెవులకు వినిపించదుట. ఈ శబ్ధ తరంగాలు ఎదురుగా ఉన్న అడ్డంకికి తగిలి, ప్రతిఫలించి, వెనక్కి తిరిగివచ్చి, గబ్బిలం చెవులకి తగులుతాయి. వీటి చెవులు బాగా సున్నితంగా ఉండటం చేత, ఈ అల్పమైన శబ్ధ తరంగాలను గ్రహించి, అడ్డంకిని గుర్తించి, పక్కకి తప్పుకుంటాయిట.
ఆ వస్తువు ఎంత దూరంలో ఉందో, దాని పరిమాణం ఎంత ఉందో, అది కదులుతోందో లేదో, కదులుతున్నట్లైతే ఏ దిశగా, ఎంత వేగంతో కదులుతోందో ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాయిట గబ్బిలాలు. ఆ శబ్ధ తరంగాలను బట్టే ఆ అడ్డంకి ఉన్న వస్తువు తాను తినగలిగిందో లేదో కూడా గ్రహించగలుగుతాయిట.
అలాగని వీటికి కళ్ళ వల్ల పూర్తిగా ప్రయోజనం లేకపోలేదు. ఆ వస్తువుకి సమీపించిన తరువాత కళ్ళతో చూసి, అది తినగలిగేదే అయితే ఆ పురుగుని సమీపించగలిగి వాటిని పుటుక్కున పట్టుకుని లటుక్కున నోట్లో వేసుకుంటాయిట.
ఇలా గబ్బిలం శబ్ధతరంగాలను ఆధారం చేసుకుని ఎదుట ఉన్న వస్తువులను తెలుసుకునే ఈ టెక్నిక్‌ని ఉపయోగించి శాస్త్రజ్ఞులు 'రాడార్' ను కనుక్కున్నారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో శబ్ధ తరంగాలకు బదులు హైఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగించి, శత్రు విమానాలను పసిగట్టడానికి ఉపయోగించేందుకు ఈ రాడార్‌ను వాడారు.