• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

ఏంటో ఈ సమాజం

ఏంటో ఈ సమాజం ప్రతి ఒక్కరి కన్ను అందాల వెతులాటలోనే ఉంటుంది ,
మొన్న ఒక టీవీ సీరియల్ యాక్టర్ అందులోనూ మన తెలుగు అమ్మాయి ,తన కొడుకుతో పాటు ఇంటర్వ్యూ కి వచ్చింది .వాడి వయసుకి ఈ ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఒక దిక్కుమాలిన ప్రశ్న వేసింది .మరి అమ్మలో ఏం ఇష్టం అని ,యాంకర్ అడిగిన దిక్కుమాలిన ప్రశ్నకి వాడు "మమ్మీలో ఆటిట్యూడ్, పర్సనాలిటీ, ఫేస్ అంటే ఇష్టం.." అని సమాధానమిచ్చాడు. సరే అమ్మ లో మంచి క్వాలిటీస్ వున్నాయి కనుక అవే చెప్పాడులే అనుకున్న . తర్వాత లైవ్‌లో ఏం చెబుతావు మమ్మీకి అని యాంకర్ అంటే "టుడే యూ ఆర్ లుకింగ్ హాట్ అండ్ సెక్సీ.. ఎప్పుడూ నువ్వు హాట్ అండ్ సెక్సీగానే ఉంటావ్.." అని చెప్పాడు. ఇది విని యాంకర్ కూడా కాస్త అవాక్కయింది.సరే వాడు అన్నది కూడా నిజమే లే వున్నదే కదా చెప్పాడు తప్పేముందిలే అనుకున్న .ఈ వీడియొ యూట్యూబ్ అంతా చక్కర్లు కొట్టింది .పిల్లలు ఎవరైనా ఈ వీడియొ చూస్తే వాళ్ళ ముమ్మీస్ ని కూడా ఇలా అని తన్నులు తినే ప్రమాదం వుంది ,లేదా వాడిలో లేనిపోని విపరీత భావనలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు .అంత అందమైన మమ్మీ వున్నా వాడిని అలా అడగడమే తప్పు ,ఆ వీడియొ ఏదో కట్ చేసి ఆమె చెప్పిన మిగతా మంచి మాటలు వేయొచ్చు కదా ,అబ్బే అలా వేస్తే ఎవరు చూస్తారు అండీ,అదే ,నా కొడుకు నన్ను సెక్సీగా ఉన్నావ్ అంటాడు అని అనిన ____ యాంకర్ అంటే కదా చూసేది అని అంటారు .

అంతకు ముందు ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో ఓయో రూముకి వెళ్లి వస్తూ,తల్లి ఆలస్యం ఎందుకు అయింది అంటే ఆటో డ్రైవర్ బలవంతం చేయబోయాడు అనింది .ఈ పోలీస్ లు వెంటనే నిమిషాల్లో ఆటో అతన్ని పట్టుకొని కొడితే ,ఆటో యూనియన్ అంతా స్టేషన్ ముందు రచ్చ .అమ్మాయిని గట్టిగా విచారిస్తే నిజం చెప్పింది .అమ్మ కి బాయ్ ఫ్రెండ్ తో వెళ్లినట్టు తెలిస్తే తిడుతుందని అబద్ధం చెప్పా అనింది. ఇక మీడియా ఆ అమ్మాయి అడ్రస్ తో సహా ఫోటో కలిపి టీవీ లో వేస్తే ,ఆ కుటుంబం పరువు పోయే ,ఆ పిల్ల అవమానం తట్టుకోలేక ఆత్మ హత్యా చేసుకొని చనిపోయింది .

అదొక్కటేనా ఎక్కడైనా మానభంగం జరిగితే అమ్మాయి పలానా ఊరు పలానా కాలొనీ పలానా వాళ్ళ అమ్మాయి ఇంకా పలానా కాలేజీ అని టీవీ లో ఇస్తుంటే ఆడపిల్లలు స్టేషన్ కి పోయి వెళ్లి కంప్లైంట్ ధైర్యం గ ఎలా ఇస్తారు .

ఇక సమాజంలో కుర్రాళ్ళు కి తల్లి వయసులో వున్న ఆంటీ ల పై విపరీతమైన కోరికలు ,
పాఠాలు చెప్పే టీచర్ అందాలు గురించి మాట్లాడుకోవడాలు .
ఇక కళాశాలలు అయితే చెప్పాల్సిన పని లేదు .
చెల్లి వరస అయ్యే బామ్మర్ది పెళ్ళాం పై మనసు పారేసుకున్న సన్నివేశాలు ఈ డైలీ సీరియల్స్ లో ఎన్నో ఎన్నెన్నో . ఆ సీరియల్స్ పేర్లు వేరే చెప్పాల్సిన పనిలేదు .
చివరకి బాగా పేరున్న ఫ్యామిలీ సినిమా లు తీసే హీరో ఆయన .ఒక OTT చిత్రం చేశారు .పాపం ఈ ఆడోళ్లకి తెలీక ,ఆయన ఫామిలీ హీరో కదా అని ఆ సినిమా పెట్టు అంటే అదేం బాగొదులే అన్నట్టు చెప్పుకోవాల్సిన పరిస్థితి .
దంపతుల మార్పిడులు ,భర్త ముందే ప్రియుడితో కులుకులు భర్త అంగీకారంతోనే అది కూడా ,సరే అది వాళ్ళు దంపతులు వాళ్ళ ఇష్టం. కానీ ఈ పోకడలకు కారణం ఏంటో అంతు చిక్కని ప్రశ్న .
కంప్యూటర్లకి మొబైల్ ఫోన్లకి అతుక్కొని అతుక్కొని నిద్రలేమి ,సంతాన లేమి ,
చివరకి భర్త వీర్య కణం భార్య గర్భసంచిలోకి చేరాలంటే డాక్టర్ దగ్గరకి పోయి లక్షలు కట్టాల్సిన పరిస్థితి .సరే ఇలా అయినా కొంత మంది తల్లులు అవుతున్నారు సంతోషము .
ప్రియుడి పై మోజుతో భర్తని ప్రియుడితో కలిసి చంపిన భార్య ,ఏమైనా ఉంటే గుట్టుగా చేసుకోవాలి కానీ పాపం ప్రాణం తీయడం ఎందుకు .

నేను చెప్పినవి తప్పు అనుకుంటే మన్నించండి .అందరూ మంచోళ్ళు కాదు అందరూ చెడ్డ వాళ్ళు కాదు ,అలా అని నేను రాసింది ఊహించి రాసింది కూడా కాదు అది మీకు కూడా తెలుసు .
 
Top